గారెలు
వికీపీడియా నుండి
గారెలు అనగానే ప్రతీ తెలుగు వారికి ఒక జాతీయం గుర్తుకు వస్తుంది. అది "తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి." గారెలు తెలుగు వారికి అత్యంత ప్రీతి పాత్రమయిన వంటకములలో ఒకటి. దీనిని కొబ్బరి పచ్చడి తో గాని, వేరు శనగ పప్పు పచ్చడి తో గాని, శనగ పప్పు పచ్చడి తో గాని జోడించి తింటే రుచి మధురంగా ఉంటుంది.
తెలుగువారి ప్రతి పండుగకు ఈ వంటకము తప్పనిసరి. గారెలను తాలింపు వేసిన పెరుగులో నాన బెట్టి, పెరుగు గారెలను తయారు చెస్తారు. వీటి రుచి అమోఘం.