Static Wikipedia February 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu

Web Analytics
Cookie Policy Terms and Conditions గురజాడ అప్పారావు - వికిపీడియా

గురజాడ అప్పారావు

వికీపీడియా నుండి

గురజాడ అప్పారావు
గురజాడ అప్పారావు
గురజాడ అప్పారావు

విషయ సూచిక

[మార్చు] ప్రవేశిక

తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి

దామిట్‌! కథ అడ్డంగా తిరిగిందీ

పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్‌


గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి.


గు ర జా డ అ ప్పా రా వు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు. 19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు.


వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసారు.

[మార్చు] జీవిత విశేషాలు

విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో 1862 సెప్టెంబర్ 21 అప్పారావు జన్మించారు. తండ్రి వెంకట రామదాసు, తల్లి కౌసల్యమ్మ. చీపురుపల్లిలో పదేళ్ళ వరకు చదివారు. విజయనగరంలో బి.ఏ చదువుతున్నపుడు వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి ఆయనకు సహాధ్యాయి. వారిద్దరూ ప్రాణస్నేహితులు.


1884 లో మహారాజ కాలేజి వారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. 1885 లో అప్పలనరసమ్మ గారితో వివాహమైంది. 1886 లో డిప్యూటీ కలెక్టరు ఆప్ఫీసులో హెడ్‌ క్లర్కు పదవినీ, 1887 లో కళాశాల లో అధ్యాపక పదవిని నిర్వహించారు. 1886 లో రాజా వారి ఆస్థానంలో చేరారు. 1911 లో మద్రాసు యూనివర్సిటీ లోని బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ లో సభ్యత్వం లభించింది.


గిడుగు రామమూర్తి తో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించారు (ఖచ్చితమైన సంవత్సరం తెలియ రాలేదు). ఆ రోజుల్లో ప్రబలంగా వున్న కన్యాశుల్కం, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు. 1892 లో నాటకపు తొలి ప్రదర్శన జరిగింది. 1897 లో కన్యాశుల్కం తొలి కూర్పును మహారాజా ఆనందగజపతికి అంకితమిచ్చారు. ఇప్పుడు మనకు దొరుకుతున్న కన్యాశుల్కం రెండవ కూర్పును 1909 లో రచించారు.

53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్ 30 న గరజాడ అప్పారావు మరణించారు. ఆయనకు ముగ్గురు సంతానం - ఇద్దరు కుమార్తెలూ, ఒక కుమారుడు.

[మార్చు] సాహితీ చరిత్ర

గురజాడ రచనల్లో కన్యాశుల్కం అగ్రగణ్యమైనది. కన్యాశుల్కం దురాచారాన్ని విమర్శిస్తూ గురజాడ రచించిన ఈ నాటకం భారతీయ భాషల్లో వెలువడిన ఉత్తమోత్తమమైన రచనలలో ఒకటి. 1892 లో ప్రచురించిన మొదటి కూర్పుకు ఎన్నో మార్పులు చేసి 1909 లో రెండవ కూర్పును ప్రచురించారు. వాడుక భాషలో, విజయనగర ప్రాంత యాసలో రాసిన ఈ నాటకం 100 సంవత్సరాల తరువాత కూడా ఈ నాటికీ పాఠకులను అలరిస్తూ ఉంది. ఈ నాటకం కన్నడం, ఫ్రెంచి, రష్యన్‌, ఇంగ్లీషు (2 సార్లు), తమిళం, హిందీ (2 సార్లు) భాషల్లోకి అనువాదమైంది.


గురజాడ మరణం తరువాత కన్యాశుల్కం పై ఎన్నో వివాదాలు రేగాయి. అది అసలు ఆయన రాయనేలేదనీ, వేరెవరో రాస్తే, తన పేరు వేసుకున్నారని ఒకటి; ఆయన ఇంగ్లీషులో రాస్తే, వేరే ఒకాయన దానిని తెలుగు లోకి అనువదించారని మరొకటి, ఇలాగ కొన్ని వివాదాలు రేగాయి. చివరికి ఆ వాదనలన్నీ అసత్యాలని తేలిపోయాయి. ఈ వివాదాలన్నీ గురజాడ మరణం తరువాత వచ్చినవే. ఇన్ని వివాదాల మధ్యా కన్యాశుల్కం కొన్ని వందల ప్రదర్శనలు పూర్తి చేసుకుంది. 100 ప్రదర్శనలు పూర్తి చేసుకున్న మొదటి తెలుగు సాంఘిక నాటకమదే!


పుత్తడి బొమ్మా పూర్ణమ్మా అనే సుప్రసిధ్ద గేయం ఆయన రచనల్లో మరొకటి. దీని ఇతివృత్తం కూడా కన్యాశుల్కం దురాచారమే.

కరుణ రసాత్మకమైన ఈ గేయ కావ్యం లోని చివరి పద్యం ఇది:

కన్నుల కాంతులు కలువల చేరెను
మేలిమి జేరెను మేని పసల్‌
హంసల జేరెను నడకల బెడగులు
దుర్గను జేరెను పూర్ణమ్మ

ఆయన రాసిన ప్రముఖ గేయం లోని ఒక భాగం ఇది:

పూర్తి గేయాన్ని కూడా చదవండి.
దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌
గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌

కొండుభట్టీయం, నీలగిరి పాటలు, ముత్యాల సరములు, కన్యక, బిల్‌హణీయం (అసంపూర్ణం), లంగరెత్తుము, దించులంగరు, కాసులు ఆయన ఇతర రచనలు.

[మార్చు] కన్యాశుల్కం కర్తృత్వం పై వివాదం

1955 మార్చి 13 న (అప్పారావు గారు మరణించిన దాదాపు 40 ఏళ్ళ తరువాత) జయంతి కుమారస్వామి గారు ఆంధ్ర పత్రికలో రాసిన ఒక వ్యాసంతో ఒక పెద్ద వివాదం చెలరేగింది.


ఆ వ్యాసంలో కుమరస్వామి ఇలా రాసారు: "గురజాడ అప్పారావు గారు ఆంగ్లములో బహు నిష్ణాతులు. ఆయన ఎన్నో రచనలను ఆంగ్లంలోనే చేసారు. కన్యాశుల్కాన్ని కూడా ఆంగ్లంలోనే రచించారు. కాని తెనిగించినది అప్పా రావు గారు కాదు, గోమఠం శ్రీనివాసాచార్యులు గారు. గోమఠం శ్రీనివాసాచార్యులు గారిది విజయనగరమే అని, ఈ సంగతి గురజాడ అప్పారావు గారి మిత్రులైన వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి గారి ద్వారా తెలియ వస్తున్నది..."


"..లోకం అంతా గురజాడ అప్పారావు గారే కన్యాశుల్కం తెలుగులో రాసారు అని అనుకుంటున్నారు. శ్రీనివాసాచార్య్లు గారు తెనిగించడం నిజమా? అభూతకల్పనా??" ఇలా సాగింది ఆ వ్యాసం. ఈ వ్యాసంపై ఉవ్వెత్తున విమర్శలు రేగి ఒక నెలాపదిహేను రోజులపాటు ఆంధ్ర పత్రికలో రసవత్తరమైన చర్చ జరిగింది. ఎందరో ఉద్దండులు చర్చలో పాల్గొనారు.


జయంతి కుమారస్వామి గారు వివాదం లేవదీస్తే, నిడుదవోలు వెంకట రావు ఆ వాదనను సమర్ధిస్తూ రాసారు.


ఆరుద్ర, రామదాసు (అప్పారావు గారి కుమారుడు), గిడుగు సీతాపతి, భమిడిపాటి కామేశ్వర రావు, వంగోలు మునిసుబ్రహ్మణ్యం, ఎ వి జగన్నాధ రావు మొదలైన వారెందరో ఆ వాదనను వ్యతిరేకిస్తూ ఆంధ్ర పత్రికలో వ్యాసాలు రాసారు.


ఈలోగా యామిజాల పద్మనాభ స్వామి గారు వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి ని ఇంటర్వ్యూ చేసారు. ఆ ఇంటర్వ్యూ లో శాస్త్రి గారు "గురజాడ కన్యా శుల్కాన్ని ఇంగ్లీషులో రాసారు. దానిని తెలుగులో రాసింది మాత్రం గోమఠం శ్రీనివాసాచార్యులు గారు." అని చెప్పారని స్వామి గారు ఆంధ్రపత్రికలో రాసారు. దీనిపై మరిన్ని విమర్శలు చెలరేగాయి.


చివరికి ఆంధ్ర పత్రిక సాహిత్య విలేకరి వావిళ్ళ వారిని ఇంటర్వ్యూ చేసి ఇలా రాసారు. వావిళ్ళ వారు "కన్యాశుల్కం తెలుగు లో రసింది గురజాడే. దానిని ప్రదర్శన యోగ్యం చెయ్యడానికి గోమఠం వారూ, వేదం వెంకటాచలయ్య గారు అక్కడక్కడా మెరుగులు పెట్టారు" అని చెప్పారు.


మరి స్వామి గారికి అలా ఎందుకు చెప్పారని అడగ్గా వావిళ్ళ వారు ఇలా అన్నారు:"ఏదో అడిగినాడు. ఏదో చెప్పినాను. మీరు పాటించకండి". ఈ విధంగా ఆ వివాదం సద్దుమణిగింది. ఇంత వివాదానికీ మూలకారణం ఐన వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి గారు తనకు తానుగా ఒక్క ప్రకటన కూడా చెయ్యక పోవడం విశేషం.


అప్పట్లో ఆంధ్ర పత్రికలో వచ్చిన ఈ వ్యాస పరంపరను ఆచార్య మొదలి నాగభూషణ శర్మ, డాక్టరు ఏటుకూరి ప్రసాదు గారల సంపాదకత్వంలో విశాలాంధ్ర పబ్లిషింగు హౌసు వారు ఒక పుస్తకంగా ముద్రించారు. 970 పేజీల బృహద్గ్రంధంలో పై వివాదం తో పాటు గా, కన్యాశుల్కం గురించిన ఎన్నో వ్యాసాలు, విశ్లేషణలు, పరిశోధనలు, పాత్రల పరిశీలనలు ఉన్నాయి. కన్యాశుల్కం గురించి తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఒక గొప్ప వనరు.

[మార్చు] ఎవరెవరు ఏమన్నారు

  • "కన్యాశుల్కం నాటకానికి సాటి రాగల రచన భారతీయ సాహితంలో మృచ్చకటికం తప్ప మరోటి లేదు" - శ్రీశ్రీ
గురజాడ అప్పారావు
గురజాడ అప్పారావు


టాంకు బండ పై విగ్రహాలు బొమ్మ:TankBund.jpg
సికింద్రాబాదు నుండి వరసగా

సమర్పణ ఫలకం | రుద్రమదేవి | మహబూబ్ ఆలీఖాన్ | సర్వేపల్లి రాధాకృష్ణన్ | సి.ఆర్.రెడ్డి | గురజాడ అప్పారావు | బళ్ళారి రాఘవ | అల్లూరి సీతారామరాజు | ఆర్థర్ కాటన్ | త్రిపురనేని రామస్వామిచౌదరి | పింగళి వెంకయ్య | మగ్దూం మొహియుద్దీన్ | సురవరం ప్రతాపరెడ్డి |జాషువ | ముట్నూరి కృష్ణారావు | శ్రీశ్రీ | రఘుపతి వెంకటరత్నం నాయుడు |త్యాగయ్య| రామదాసు | శ్రీకృష్ణదేవరాయలు | క్షేత్రయ్య | పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి | బ్రహ్మనాయుడు | మొల్ల | తానీషా | సిద్ధేంద్ర యోగి | వేమన | పోతనామాత్యుడు | అన్నమాచార్య | ఎర్రాప్రగడ | తిక్కన సోమయాజి | నన్నయభట్టు | శాలివాహనుడు

ఇతర భాషలు
Static Wikipedia 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2006 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu