గ్రహణం మొర్రి
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
గ్రహణం మొర్రి అనేది పై పెదవి ముందు భాగంలో మధ్యన చీలిక వస్తుంది. ఇది అంగిలి (హార్డ్‌ప్యాలేట్) లోపలి దాకా ఉంటుంది. ప్రస్తుతం మనదేశంలో 10 లక్షలమందికి పైగా చిన్నారులు ఇలాంటి సమస్యతో జీవిస్తున్నట్లు తెలుస్తోంది. మన దేశంలో జన్మిస్తున్న ప్రతి 700 మంది చిన్నారుల్లో ఒకరు ఇలాంటి సమస్యతో పుడుతున్నట్లు గుర్తించారు. అంటే మన దేశంలో ఏటా 30 వేలమంది పిల్లలు ఇలాంటి సమస్యతో పుడుతున్నారు. దీనివల్ల ఎదిగే దశలో పిల్లకు సామాజిక సమస్యలే కాకుండా, పాలు తాగటం, మాట్లాడటం కూడా సమస్యలే. గర్భం దాల్చిన సమయంలో తల్లి తీసుకునే ఆహారం, పోషకాల ప్రభావం పొట్టలోని బిడ్డపై పడుతుంది. కాబట్టి గర్భిణులు ఆకుకూరలు, నిమ్మజాతి పండ్లు, బీన్స్, పప్పు ధాన్యాలు వంటి ఫోలిక్ ఆమ్లం సమృద్ధిగా ఉంటే ఆహారం తీసుకొంటే ఈ పుట్టబోయే పిల్లలకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయి.