వికీపీడియా నుండి
< వికీపీడియా:చరిత్రలో ఈ రోజు
- కనుమ పండగ
- 1940: వాడుక భాష ఉద్యమ పిత, గిడుగు రామమూర్తి మరణించాడు.
- 1943: ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం 'ద పెంటగాన్'(అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం) నిర్మాణం పూర్తయింది.
- భారత సైనిక దినోత్సవం. 1949లో ఇదేరోజున మొదటిసారి ఓ భారతీయుడు(కె.ఎం.కరియప్ప) ఇండియన్ ఆర్మీ చీఫ్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా జనవరి 15ను సైనికదినోత్సవంగా జరుపుకొంటున్నాం.
- 1966: భారత వాయుసేన (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్)కు సైన్యంతో సమాన హోదా లభించింది.
- 1998: పూర్వ తాత్కాలిక ప్రధానమంత్రి గుల్జారీలాల్ నందా మరణించాడు.
- 1988: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌మ్యాచ్‌లో భారత లెగ్‌స్పిన్నర్ నరేంద్రహిర్వాణీ తానాడిన తొలిటెస్టులోనే 16వికెట్లు (16/136, 8/61 మరియు 8-75) తీసుకొని రికార్డు సృష్టించాడు.ఈ రికార్డును ఇప్పటికీ ఎవరూ ఛేదించలేదు.