వికీపీడియా నుండి
< వికీపీడియా:చరిత్రలో ఈ రోజు
- 1556: రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బరు సైన్యం హేమును ఓడించిన రోజు. అప్పటికి అక్బరుకు పదమూడేళ్లు. సైన్యాధ్యక్షుడు బైరాంఖాన్ ఆధ్వర్యంలో మొఘలులకు ఈ విజయం సొంతమైంది.
- 1605: బ్రిటిష్ పార్లమెంటు భవనాన్ని పేల్చివేసేందుకు రోమన్ క్యాథలిక్కులు పన్నిన కుట్ర విఫలమైన రోజు. దీన్నే 'గన్‌పౌడర్ ప్లాట్' అంటారు. 'గై ఫాకెస్' అనే వ్యక్తి పేలుడు సామగ్రితో పార్లమెంటు లోపలికి వెళ్తుండగా భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. నాటి నుంచి ఏటా నవంబరు 5న ఇంగ్లండ్‌లో బాణాసంచా కాల్చి 'గై ఫాకెస్ డే'గా జరుపుకుంటారు.
- 1870: స్వాతంత్య్ర సమరయోధుడు, 'స్వరాజ్' పార్టీ స్థాపకుల్లో ఒకరైన... దేశబంధు చిత్తరంజన్‌దాస్ కోల్‌కతాలో జన్మించారు.
- 1895: జార్జ్ సెల్డెన్ రూపొందించిన గ్యాసోలిన్‌తో నడిచే ఇంజిన్‌కు పేటెంటు హక్కులు లభించాయి. అమెరికన్ ఆటోవెుబైల్ రంగానికి సంబంధించినంత వరకూ ఇదే మొదటి పేటెంటు.
- 1920: భారతీయ రెడ్‌క్రాస్ ఏర్పడింది.
- 1951: పశ్చిమ, మధ్య రైల్వేలు ముంబయిలో ఏర్పాటయ్యాయి.
- 1967: ఏటీఎస్-3 కృత్రిమ ఉపగ్రహాన్ని అమెరికా ప్రయోగించింది. రోదసి నుంచి పూర్తిస్థాయిలో భూమి ఛాయాచిత్రాలను తీసిన మొదటి ఉపగ్రహం అది.
- 1976: ఎమర్జెన్సీ కాలం. లోక్‌సభ పదవీకాలం ముగిసినా, మరో సంవత్సరం పాటు ఈ కాలాన్ని తనకు తానే పొడిగించుకుంది.
- 1977: భారత విదేశ వ్యవహారాల శాఖా మంత్రి, అటల్ బిహారీ వాజపేయి, ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించాడు.
- 1987: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ఆస్థానకవి, దాశరథి కృష్ణమాచార్య మరణించాడు.