ఛాయా దేవి
వికీపీడియా నుండి
ఛాయా దేవి (1914 - ఏప్రిల్ 26, 2001) గా సినిమా తెరపై పరిచయమైన కనకలతా గంగూలీ అలనాటి బెంగాళీ చలనచిత్ర నటి. ఈమె 15 యేళ్ల ప్రాయములో జ్యోతిష్ బంధోపాధ్యాయ దర్శకత్వము వహించిన పథేర్ శేషే చిత్రముతో సినీరంగ ప్రవేశము చేసినది. ఈమె బెంగాళీ, హిందీ, తమిళ్ మరియు తెలుగు బాషలలో 150 పైగా చిత్రాలలో నటించినది. నటియే కాక మంచి నర్తకి, గాయని కుడా. 30వ దశకములో తను నటించిన చాలా సినిమాలలో తనే పాటలు పాడినది. తపన్ సిన్హా చిత్రము, అపోన్ జాన్ చిత్రములో ఛాయా దేవి పాత్రకు రాష్ట్రపతి పురస్కారము లభించినది. ఈమె హిందీ చలనచిత్ర నటుడు అశోక్ కుమార్ యొక్క పినతండ్రి కూతురు. ఛాయా దేవి, 2001 ఏప్రిల్ 26న మెదడు వాపు, న్యుమోనియాతో కలకత్తాలో మరణించినది.