టంగుటూరి సూర్యకుమారి
వికీపీడియా నుండి
టంగుటూరి సూర్యకుమారి (Tanguturi Suryakumari) అలనాటి తెలుగు సినిమా నటి మరియు ప్రసిద్ధ గాయకురాలు. ఆమె నవంబర్ 13,1925 లో రాజమండ్రిలో జన్మించినది. ఈమె ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు యొక్క అన్న కూతురు. 1937 లో మద్రాసు వచ్చి సినీరంగ ప్రవేశము చేసినది. 1952 లో ఆమె తొలి మిస్ మద్రాసు అయినది. తెలుగు, తమిళము, కన్నడ మరియు హిందీ భాషా చిత్రాలలో నటించిన సూర్యకుమారి మంచి గాయకురాలు కూడా. స్వాతంత్ర్యోద్యమ సమయములో మాతెలుగుతల్లికి మల్లెపూదండ, దేశమును ప్రేమించుమన్న మొదలైన అనేక దేశభక్తి గీతాలు పాడినది. 1973లో లండన్ లో స్థిరపడిన ఈమె ఏప్రిల్ 25, 2005 న లండన్ లో మరణించినది.
[మార్చు] సినిమాల జాబితా
- విప్రనారాయణ (1937)
- అదృష్టం (1939)
- రైతుబిడ్డ (1939)
- జయప్రద (1939)
- దేవత (1941)
- అబ్ల (1941) - హిందీ
- చంద్రహాస (1941)
- దీనబంధు (1942)
- భక్త పోతన (1942)
- భాగ్యలక్ష్మి (1943)
- కృష్ణప్రేమ (1943)
- కటకం (1947) - తమిళ్
- గీతాంజలి (1948)
- సంసారనౌక (1948) - తమిళ్
- భారతి (1949) - కన్నడ
- అదృష్టదీపుడు (1950)
- మరదలు పెళ్లి (1952)
- వతన్ (1954) - హిందీ
- ఉడాన్ ఖటోలా (1955) - హిందీ
- బాంబే ఫ్లైట్ 417 (1956) - ఆంగ్లము
- భక్త రామదాసు (1964)