తుమ్మల సీతారామమూర్తి
వికీపీడియా నుండి
|
|
[మార్చు] జీవన సంగ్రహము
జననము : | 1901 డిసెంబర్ 25. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని కావూరు గ్రామము. |
---|---|
తల్లిదండ్రులు : | చెంచమాంబా నారయ్యలు. |
కుటుంబము : | 1930లో శ్రీమతి అన్నపూర్ణమ్మతో వివాహము. ఒక కుమార్తె నలుగురు కుమారులు. |
గురువులు : | కావూరి శ్రీరాములుగారు, జాస్తి సుబ్బయ్యగారు, తాడేపల్లి వేంకటప్పయ్యశాస్త్రిగారు, దువ్వూరి వేంకటరమణశాస్త్రిగారు. |
విద్య : | ఉభయభాషాప్రవీణ(ప్రథమశ్రేణి) ఆంధ్ర విశ్వవిద్యాలయము 1930. |
వృత్తి : | సేద్యము, తరువాత అధ్యాపనము. 1924 - 1929 తిలక్ జాతీయపాఠశాల - కావూరు. 1930 - 1957 గుంటూరు జిల్లాబోర్డునందలి దుగ్గిరాల, బాపట్ల, నిడుబ్రోలు, అప్పికట్ల - ఉన్నతపాఠశాలలు. 1920 - 1930 కాంగ్రెసుసేవ, శిక్ష 1922. |
అభిమాన విషయములు : | గ్రామజీవనము, గాంధితత్త్వము, సర్వోదయము, ఆంధ్రాభ్యుదయము, తిక్కన కవితామార్గము, చిన్నయసూరి సిద్ధాంతము. |
కృతులు : | గాంధీకావ్యాలు - ఆత్మకథ, మహాత్మకథ, అమరజ్యోతి, సర్వోదయగానము, గాంధీగానము, మహాత్మగాంధీ తారావళి. రాష్ట్రకావ్యాలు - రాష్ట్రగానము, ఉదయగానము. ఖండకావ్యాలు - పఱిగపంట, పెద్దకాపు, శబల, పైరపంట, సమదర్శి, కదంబకైత, చక్కట్లు, దివ్యజ్యోతి. కథాకావ్యాలు - ఆత్మార్పణము, ధర్మజ్యోతి. సామాజిక కావ్యాలు - ఎక్కట్లు, సందేశసప్తశతి. స్వీయచరిత్ర కావ్యాలు - నేను, నా కథలు, తపస్సిద్ధి. వేదాంతకావ్యాలు - గీతాదర్శము, భజగోవిందం, లక్ష్మీనృసింహ స్తోత్రము, హనుమాన్ చాలీసా. నీతికావ్యాలు - తెనుగు నీతి, నీతికుసుమావళి. స్మృతికావ్యాలు - రామకృష్ణస్మృతి. శతకములు - పురాంతక శతకము, రామశతకము, రామలింగేశ్వర శతకము. జంగం కథలు - బిల్హణీయము. నాటకాలు - గిరికా పరిణయము, హనుమద్విజయము,మహేంద్ర జననము. హరికథలు - అన్నదాన మాహాత్మ్యము, సాత్రాజితీ పరిణయము, నామదేవ చరిత్రము. |
సమ్మానములు : | 1949 నిడుబ్రోలులో - గజారోహణము, గండ పెండేరము, కనకాభిషేకము, సువర్ణకంకణము. 1960లో అఖిల భారత తెలుగురచయితల మహాసభ సత్కారము. 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్టసభ్యత్వ ప్రదానము. 1969లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమానము. 1969లో ఆంధ్ర విశ్వవిద్యాలయము "కళాప్రపూర్ణ" బిరుదుతో సత్కారము. 1984 మద్రాసులో శ్రీ ఎల్. వి. రామయ్య చారిటీస్ జాతీయకవి అవార్డు. 1985లో నాగార్జున విశ్వవిద్యాలయము "డాక్టర్ ఆఫ్ లెటర్స్"(డి.లిట్) బిరుదుతో సత్కారము 1985 విశాఖపట్టనములో సహస్ర చంద్రదర్శన మహోత్సవము. నెల్లూరు, అప్పికట్ల, ముక్త్యాల, తెనాలి, గుడివాడ, మద్రాసు, గుంటూరు, విజయవాడ మొదలగు తావులలో. |
జయంతి మహోత్సవములు : | 1952 నుండి పెక్కుచోట్ల. |
బిరుదులు : | ఇతరుల దృష్టిలో "అభినవతిక్కన", తన దృష్టిలో "తెనుఁగులెంక". |
నిర్యాణము : | 1990 మార్చి 21. గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని అప్పికట్ల గ్రామము. |
[మార్చు] కృతులు (ప్రచురించిన సంవత్సరము క్రమములో)
- గిరికా పరిణయము, 1911-1918
- మధ్య హనుమద్విజయము, 1911-1918 మధ్య
- అన్నదాన మాహాత్మ్యము, 1911-1918 మధ్య
- సాత్రాజితీ పరిణయము, 1911-1918 మధ్య
- పురాంతక శతకము, 1911-1918 మధ్య
- రామశతకము, 1919
- రామలింగేశ్వర శతకము, 1919
- బిల్హణీయము, 1920
- మహాత్మగాంధీ తారావళి, 1921
- నామదేవ చరిత్రము, 1922
- రామకృష్ణస్మృతి, 1923
- భజగోవిందం, 1923
- లక్ష్మీనృసింహ స్తోత్రము, 1925
- మహేంద్ర జననము, 1924
- ఆత్మార్పణము (4 ముద్రణలు), 1932-1953
- ఆత్మకథ (ప్రథమ భాగము), 1936
- నీతికుసుమావళి, 1937
- రాష్ట్రగానము (7 ముద్రణలు), 1938-1973
- ధర్మజ్యోతి (5 ముద్రణలు), 1943-1985
- పఱిగపంట (2 ముద్రణలు), 1943-1952
- పెద్దకాపు, 1948
- అమరజ్యోతి, 1948
- తపస్సిద్ధి, 1949
- ఆత్మకథ (మొత్తం అయిదు భాగములు), 1951
- ఉదయగానము (2 ముద్రణలు), 1955-1973
- శబల, 1955
- సర్వోదయగానము, 1961
- తెనుగు నీతి, 1961
- నేను, 1963
- గీతాదర్శము, 1963
- పైరపంట, 1964
- సమదర్శి, 1967
- మహాత్మకథ, 1968
- నా కథలు, 1973
- ఎక్కట్లు, 1976
- హనుమాన్ చాలీసా, 1978
- సందేశసప్తశతి, 1981
- కదంబకైత, 1983
- గాంధీగానము, 1987
- చక్కట్లు, 1993
- దివ్యజ్యోతి, 1994
- తెనుఁగులెంక తుమ్మల సమగ్ర సాహిత్యము, తుమ్మల శతజయంతి ఉత్సవ సంఘ ప్రచురణ, గుంటూరు, 2001
- మొదటి భాగము - బాపూజీ ఆత్మకథ
- రెండవ భాగము - మహాత్మకథ
- మూడవ భాగము - ఖండకావ్యములు - రామశతకము, రామలింగేశ్వర శతకము, మహాత్మగాంధీ తారావళి, మహేంద్ర జననము, రామకృష్ణస్మృతి, ఆత్మార్పణము, రాష్ట్రగానము, ధర్మజ్యోతి, పఱిగపంట, శబల, ఉదయగానము, సర్వోదయగానము, తెనుగు నీతి, నేను, గీతాదర్శము
- నాల్గవ భాగము - ఖండకావ్యములు - పైరపంట, సమదర్శి, నా కథలు, హనుమాన్ చాలీసా, సందేశసప్తశతి, కదంబకైత, గాంధీగానము, చక్కట్లు, దివ్యజ్యోతి
[మార్చు] తుమ్మల కవితా సంకలన గ్రంథములు
- యుగకవిత, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1984
- రంగా - భారతి, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1986
- సంక్రాంతి, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1988
- రైతుజీవనము, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1990
- సత్యం శివం సుందరం, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1990
- తుమ్మల వాణి, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1992
- తుమ్మల యుగవాణి, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1996
- తుమ్మల సుభాషితములు, తుమ్మల శ్రీనివాసమూర్తి , 2000
- తుమ్మల వాణి, తుమ్మల శతజయంతి ఉత్సవ కమిటి, 2001
- ఆంధ్రప్రశస్తి, తుమ్మల శ్రీనివాసమూర్తి , 2004
- పండుగ కవితలు, తుమ్మల శ్రీనివాసమూర్తి , 2005
- తెనుఁగుతీపి, తుమ్మల శ్రీనివాసమూర్తి , 2005
[మార్చు] తుమ్మల జీవితము, కవిత్వము, వ్యక్తిత్వము పై ఇతరులు వ్రాసిన గ్రంథములు
- తెనుఁగులెంక తుమ్మల, గొల్లపూడి ప్రకాశరావు, 1975
- యుగకవి తెనుఁగులెంక శ్రీ తుమ్మల సీతారామమూర్తి, తుమ్మల శ్రీనివాస మూర్తి, 1989
- తెనుఁగులెంక తుమ్మల సీతారామమూర్తి కవిత్వం - వ్యక్తిత్వం, జూపూడి అమ్ములయ్య (అమూల్యశ్రీ), 1995
- తుమ్మల సీతారామమూర్తి (భారతీయ సాహిత్య నిర్మాతలు), నాగళ్ల గురుప్రసాదరావు, సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ, 2000
- అజరామరవాఙ్మయమూర్తి తుమ్మల సీతారామమూర్తి, సూర్యదేవర రవికుమార్, 2002