చర్చ:తెలుగు
వికీపీడియా నుండి
(ప్రొఫెసరు వేమూరి రావు గారి పుస్తకము నుండి ) (స్వేచ్చానువాదము చావా కిరణ్ కుమార్ - తప్పులు ఉన్న సరిదిద్ది క్షమించగలరు , అనువాదమనే మొదలు పెటినాను కానీ వేమూరి గారి వ్యాసము ఇంగ్లీషు వారికోసం ఉద్దేశించి వ్రాయబడినది ఈ తెలుగు వికీని ఎక్కువగా తెలుగు వారే చదువుతారు కనుక నేను ఎక్కువగా స్వతంత్రముగా కోసివేయడము, పొడిగించడము వంటి నిర్ణయములు తీసుకున్నాను, విజ్ఞులు సరిచూసి సరిదిద్దగలరు. )
see the page telugu in English Wiki. We can also translate from that page.
విషయ సూచిక |
[మార్చు] సమష్టి కృషి
25/9/2006 న వైజాసత్య ఇచ్చిన సందేశము ఇక్కడకు కాపీచేస్తున్నాను: "తెలుగు వికీపీడియాలో తెలుగు పై వ్యాసము అంతంత మాత్రమే ఉండటము ఏమీ బాగోలేదు. విస్తరించడానికి నడుం కడదాం రండి"
ఇది ముఖ్యమైన విషయం. ముందుగా ఈ వ్యాసము అభివృద్ధికి పందిరి వేద్దాము(ఫ్రేమ వర్క్) . సభ్యులు ఎవరివీలును బట్టి వారు వ్యాసానికి తోడ్పడవలెను. ఐతే కొన్ని ముఖ్యమైన గమనికలు
- ఇందులో చాలా విషయాలకు వేరే వేరే వ్యాసాలు ఉన్నాయి. కనుక అంతర్గత లంకెలకునూ, వర్గాలనూ జాగ్రత్తగా గమనించండి.
- ఒక విషయంమీద వేరే వ్యాసం ఉన్నట్లయితే, ఇక్కడకూడా క్లుప్తంగా వ్రాయండి, అప్పుడు ఈ వ్యాసం అతుకుల బొంతలాగా కాకుండా, సమగ్రవ్యాసంగా రూపు దిద్దుకొంటుంది.
కాసుబాబు 12:11, 25 సెప్టెంబర్ 2006 (UTC)
-
- ఇది చాలా మంచి ఆలోచన
-
- పందిరి వేయడముతో నేను ఏకీభవిస్తున్నాను
-
- ఈ వ్యాసములో మనము తెలుగు భాష గురించి వ్రాద్దాము
-
- తెలుగు లిపి గురించి మరొక వ్యాసము వ్రాద్దాము
-
- తెలుగు ప్రజల గురించి మరొక వ్యాసము వ్రాద్దాము ?
-
- దీనికి ముందు మనము మిగిలిన భాషలు ఎలా వ్రాసినారో ముఖ్యముగా ఇంగ్లీషు వికీలో చూసి కొద్దిగా ఆలోచనలౌ పొందితే బాగుంటుంది Chavakiran 13:08, 25 సెప్టెంబర్ 2006 (UTC)
ఇంక ఆలస్యము ఎందుకని పందిరి మొదలు పెట్టాను. సభ్యులంతా పందిరినీ మార్చ వచ్చు. వ్యాసాన్నీ కూర్చ వచ్చును. స్వాగతం కాసుబాబు 19:52, 25 సెప్టెంబర్ 2006 (UTC)
నేను ఇదివరలో చదివిన ఒక పుస్తకంలో క్రింది విధంగా ఉంది... "తెలుగు భాషలో అక్షరాలు కేవలం 36, ఆంధ్రభాషలో అక్షరాలు 56 " అని. దయచేసి మరోసారి పరీక్షించండి. --కిషోర్ 04:30, 6 నవంబర్ 2006 (UTC)
[మార్చు] మా తెలుగు తల్లికి మల్లెపూదండ -- యొక్క అవసరం
ఈ వ్యాసంలో నాకు ఈ పాట యొక్క అవసరము ఏమీ కనిపించడం లేదు.
మీరేమంటారు? Chavakiran 14:29, 5 అక్టోబర్ 2006 (UTC)
- అవును దాన్ని ప్రత్యేక వ్యాసములో పెట్టాలి. --వైఙాసత్య 15:55, 5 అక్టోబర్ 2006 (UTC)
- అది కిరణ్ గారి వ్యాఖ్య చదివి నేనిప్పుడే సృష్టించాను --వైఙాసత్య 17:02, 5 అక్టోబర్ 2006 (UTC)
[మార్చు] ప్రస్తుత లిపి
- ఈ విభాగాన్ని నేను చేర్చాను. ఉచితమో కాదో సభ్యులు వ్యాఖ్యానించ గలరు.
- "చ", "ఛ" ల మధ్య ఒక అక్షరం, "జ", "ఝ" ల మధ్య ఒక అక్షరం ఉండాలి. కాని వాటిని టైపుచేయడం నాకు చేతకావట్లేదు. కాసుబాబు 17:40, 5 అక్టోబర్ 2006 (UTC)
- ఈ రెండు అక్షరాలను ఇంకా యూనికోడులో చేర్చలేదండి. బహుశ త్వరలో చేరుస్తారనుకుంటా! __చదువరి (చర్చ, రచనలు) 17:55, 5 అక్టోబర్ 2006 (UTC)
- ఇంకో రెండు నెలలు ఆగాలి --వైఙాసత్య 21:43, 5 అక్టోబర్ 2006 (UTC)
[మార్చు] గమనించవలెను
తెలుగు చరిత్ర లో కొంత భాగాన్ని www.bhashaindia.com లోని "తెలుగు - తేనెకన్నా తీయనిది" అన్న వ్యాసాన్నుండి, తొలితెలుగు విశేషాలు http://www.pramukhandhra.org/pr_viseshaalu.html అన్న వ్యాసం నుండి యధా తధంగా తీసుకొన్నాను. ఈ విషయాలు సార్వత్రికమైనవి అవడం వల్ల కాపీ హక్కులు ఉల్లంఘించడంలేదని భావిస్తున్నాను
కాసుబాబు 17:55, 7 అక్టోబర్ 2006 (UTC)
తెలుగుతల్లి చిత్రం - ఇంకా మంచిది లభిస్తే ఎవరైనా చేర్చగలరు. కాసుబాబు 19:44, 9 అక్టోబర్ 2006 (UTC)
- ఇంకా రెండు బొమ్మలు ఉన్నాయి. ఏది బాగుందనిపిస్తే అది చేర్చండి బొమ్మ:Telugutalli.gif బొమ్మ:Telugu thalli.JPG --వైఙాసత్య 13:04, 10 అక్టోబర్ 2006 (UTC)
-
- Give me some time, I will upload the photo of telugu talli statue near Tank Bund. Chavakiran 07:32, 11 అక్టోబర్ 2006 (UTC)
[మార్చు] Have a look at english essay on english wiki
- That is a nice one to look.
- We need to add more of telugu grammar
- we need to sub device articles and write here briefly with a pointer to main article.
Chavakiran 16:17, 9 నవంబర్ 2006 (UTC)
[మార్చు] తెలుగు గురించి ప్రముఖుల వ్యాక్యాలు
తెలుగు గురించి ప్రముఖుల వ్యాక్యాలు
ఇవి తటస్త దృక్కోణముకు అనుగుణంగా ఉన్నాయా?
అలాగే, మనము వీటిని ప్రముఖుల వాక్యాల్లోకి మారిస్తే బాగుంటుది, పైన కుడివైపుకు ఉంచడం కన్నా!
ఏమంటారు? Chavakiran 16:17, 9 నవంబర్ 2006 (UTC)
- వీటినికి వేరేపేజీలో పెట్టి ఇక్కడ లింకు ఇస్తే బాగుంటుంది. ఇవి ప్రచురించబడిన అభిప్రాయాలు అందునా మూలాలతో సహా ఉన్నాయి కాబట్టి వికి తటస్థ దృక్కోణములో ఉన్నట్టే. --వైఙాసత్య 15:56, 11 నవంబర్ 2006 (UTC)
[మార్చు] లింకులు మరీ ఎక్కువ అవుతున్నాయి
, we need to have a strict policy about what can be linked and what can not be linked.
I say
Links must be related to telugu language other are to be rather removed or moved to other articles. Chavakiran 16:17, 9 నవంబర్ 2006 (UTC)
- ఎలాగోలా వీటిని కుదించి అమరిక మార్చాలి. ఇలా అంత స్థలాన్ని ఆక్రమించడం బాగోలేదు --వైఙాసత్య 15:58, 11 నవంబర్ 2006 (UTC)
[మార్చు] ఇంటింటా తెలుగు దివ్వె
(పాపిశెట్టి గారు ప్రదీప్ చర్చాపేజీ లో వ్రాసిన విషయాన్ని ఇక్కడికి మారుస్తున్నాను. ఇది ఇక్కడ ఉండడమే సబబు అని.ఈ విషయంలో నేను ప్రదీప్ అనుమతి తీసుకొనలేదు. అతనికి అభ్యంతరము ఉండదని అనుకొంటూ - కాసుబాబు 19:01, 3 జనవరి 2007 (UTC))
-
- ఈ క్రింది వ్యాసాన్ని ఒక తెలుగు బ్లాగులో చూసాను. నచ్చింది. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. దిన్ని తెలుగు భష వర్గం క్రింద చేర్చితే బావుంతుందో లేక ఒక క్రొత్త వ్యాసంగా తెలికీలో పెడితే బావుంటుందో అర్ధంకావట్లా. బహుశా ఈ వ్యాసాన్ని మీరు ఇంతకుముందే చూసుంటారని అనుకుంటున్నాను. దీని పై మీ అభిప్రాయం ఏమిటి?
- ఇంటింటా తెలుగు దివ్వె - డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ Courtesy: ఈనాడు
- తెలుగువారిలో ప్రతి ఒక్కరూ తెలుగుకు నిలువెత్తు దర్పణంలా నిలవాలి. మనం పలికే ప్రతి పలుకులో తెలుగుకే పట్టం కట్టాలి. ప్రతి పలకరింతా తెలుగు పులకరింత కావాలి.
- మనం నిలబడాలనుకొంటే పక్కవాణ్ని పడేయాలనుకోవడం అవివేకం. అలాగే తెలుగు భాషను బాగా వ్యాపింప చెయ్యాలంటే, ఏవో కొన్ని భాషల వ్యాప్తిని అరికట్టాలనుకోవడం కూడా అవివేకమే. ఇప్పటికయినా మించిపోయింది ఏమీ లేదు. ఇంకా మనలో తెలుగు బాగా వచ్చినవాళ్లు చాలామంది ఉన్నారు. మనం చిత్తశుద్ధితో కొన్ని నిర్ణయాలు తీసుకొని, వాటిని తు.చ. తప్పకుండా ఆచరిస్తే ఫలితం కచ్చితంగా వచ్చి తీరుతుంది. మనల్ని చూసి ప్రభుత్వం కూడా మార్గం మార్చుకుంటుంది.
- ముందుగా- తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ వారి సంతకాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా తెలుగులోనే చేయాలి. బ్యాంకు లావాదేవీల దగ్గరనుంచి, ఉద్యోగం చేసే చోట చేస్తున్న పొట్టి సంతకాల దాకా! మనమందరం కలిసి ప్రతిరోజూ సాగించే ఉత్తర, ప్రత్యుత్తరాలు అసంఖ్యాకంగానే ఉంటాయి. ఆ ఉత్తరాలలో నిర్దేశించిన విషయం ఆంధ్ర దేశ పరిధిలో ఉంటే, ఆ విషయాన్ని; ఉత్తరాలపై రాసే చిరునామాల్ని కూడా తెలుగులోనే రాయండి. ఒకవేళ ఆయా అధికారులు ఆంధ్రేతరులైనట్లయితే, తెలుగులో ఉన్న ఆ లేఖల్ని చదివి తర్జుమా చేయించుకునే తలనొప్పి వారిదే అవుతుంది. బజారుకు వెళ్ళి మనమేదైనా కొనేటప్పుడు వాటి పేర్లను సహజంగా తెలుగులోనే చెప్పి కొనుక్కురండి. నిత్యావసర వస్తువుల్ని, పచారీ సామాన్లను, కూరగాయలను, పండ్లను ఇలా పలకడానికి ఇబ్బందిలేని, తెలుగు భాషలో చక్కని పదాలు ఉన్న వాటిని ఆ పేర్లతోనే పలకండి. తెలుగు భాషలో లేని పదాలు గల ఇతర భాషలలోని వస్తువుల పేర్లను (టీవీ, సైకిలు, రేడియోవంటివి) అలాగే పలకండి. బ్యాంకు ఫారాలను, మనియార్డరు ఫారాలను, చలానాలను నింపేటప్పుడు ఒకవైపు ఆంగ్లంలోనూ, మరొకవైపు తెలుగులోనూ నమూనా ఉంటే తెలుగులోనే కచ్చితంగా నింపండి. టీవీ చూస్తున్నప్పుడు తెలుగు ఛానళ్ళనే చూడండి. తెలుగు భాషతోపాటుగా మనోవికాసాన్ని కలిగించే భాగవతం, దేవీ భాగవతం, పంచతంత్రం వంటి కార్యక్రమాలను తప్పనిసరిగా పిల్లలకు చూపించండి. మీ పిల్లల్ని రోజుకో గంట సేపు మీ ఇంట్లో ఉన్న వృద్ధుల దగ్గర కూర్చోపెట్టండి. వారి చేత తెలుగు సంప్రదాయాన్ని, సాహిత్యాన్ని, కథలు, పాటల రూపంలో చెప్పించండి. కొత్తగా పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించేటప్పుడు తప్పనిసరిగా తెలుగు భాషను ఎంపిక చేయండి. ఇంటి దగ్గర పిల్లలకు రోజూ కొన్ని కొత్త తెలుగు పదాల్ని నేర్పిస్తూ తెలుగులోనే మాట్లాడండి. కనీసం వారానికో పద్యం వాళ్లు నేర్చుకొని చక్కగా చదివేటట్టు చూడండి. విజటింగ్ కార్డులను, వివిధ శుభకార్యాలకోసం మనం ముద్రించే శుభలేఖలను తెలుగులోనే ముద్రించి అందరికీ పంచండి. పాఠశాలల్లో తెలుగులో మాట్లాడవద్దని నియంత్రించే యాజమాన్యాన్ని తల్లిదండ్రులందరూ కలిసి నిలదీయండి. ఇంట్లో చక్కగా తెలుగు మాట్లాడేవారికి చిన్న చిన్న బహుమతుల్ని ఇవ్వండి. ఎవరైనా తెలుగు వచ్చి కూడా ఇంగ్లిష్లో మాట్లాడితే వారితో తెలుగులోనే మాట్లాడండి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. అపరిచితులకు తెలుగు రాదేమోనని ముందుగా మీరే ఊహించేసుకొని ఆంగ్ల సంభాషణ ప్రారంభించకండి. చక్కగా తెలుగులోనే మాట్లాడండి. వారికి చక్కగా అర్థమవుతుంది. ఏవైనా దరఖాస్తులు రాయవలసి వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ తప్పుల తడకలతో ఆంగ్లంలో రాయడం మానేసి చక్కగా తెలుగులో స్వేచ్ఛగా రాసి (మాట్లాడే భాషనే) ఆత్మవిశ్వాసంతో నిలబడండి. శుభాకాంక్షల్ని నోరారా తెలుగులోనే తెలియజేయండి. (ఎదుటి వారు ఇంగ్లీషులో చెప్పినాసరే!) వారానికొక రోజు (సెలవు రోజైన ఆదివారమైతే మరీ మంచిది) పూర్తిగా చక్కని తెలుగు భాషలో మాట్లాడాలనే నిర్ణయాన్ని ఇంటిల్లిపాదీ తీసుకొనేట్లు చూడండి. ఆచరింపజేయండి. ఇలా ప్రతిఒక్కరూ నిత్యం తెలుగును గుర్తుంచుకొని వ్యవహరించాలి. ఇప్పటికే తెలుగు వచ్చినవారంతా ఈ సూచనలు పాటిస్తే తెలుగుకు ప్రాచుర్యం తక్కువ కాలంలోనే ఎక్కువగా లభిస్తుంది.
- ఇక- అసలు తెలుగువారై ఉండి, తెలుగు భాషలో రాయడం, చదవడం వంటివి రానివారి కోసం ప్రభుత్వం కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. తెలుగు భాషను బోధించని, ప్రాధాన్యం ఇవ్వని పాఠశాల తెలుగుదేశంలోనే ఉండకూడదు. చిన్నప్పటినుంచి తెలుగును నిర్బంధ విద్యగా అమలు చేయాలి. తెలుగుదేశంలో ప్రతి ఒక్కరికీ అ, ఆ, ఇ, ఈ లతోనే చదువు ప్రారంభం కావాలి. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య దాకా తెలుగుకు ప్రత్యేక ప్రాధాన్యాన్ని కల్పించాలి. వృత్తి విద్యా కోర్సులలో సైతం తెలుగు భాషా సాహిత్యాలకు, సంస్కృతికి తగిన ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. ఉద్యోగ ప్రకటనల్లోని నియమ నిబంధనలలో... తెలుగు రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చి ఉంటేనే అర్హతగా ప్రకటించాలి. ఇది ప్రభుత్వ ఉద్యోగాలకే కాక ప్రయివేటు ఉద్యోగాలకు కూడా వర్తింపజేయాలి. (ఇది తెలుగు మాతృభాషగా కలవారికి మాత్రమే) ఎంసెట్ వంటి పోటీ పరీక్షలలో తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాలకు సముచిత స్థానం కల్పించాలి. పరీక్షలలో ఉత్తీర్ణత శ్రేణిని నిర్ణయించడానికి తెలుగు మార్కులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో..., ఆంధ్ర దేశం వరకు పరిమితమయ్యే అధికారిక లేఖా వ్యవహారాలన్నీ తెలుగులోనూ; ఆంధ్రేతర ప్రాంతాలతో జరిపే వ్యవహారాలలో తెలుగుతోపాటుగా అన్యభాషలలోనూ జరిగేటట్లు శాసనం చెయ్యాలి. కంపెనీల, సినిమాల, షాపుల, అధికారుల పేర్లు, హోదాలు ఇలా అన్నీ తెలుగులో (తెలుగు లిపిలో) రాసేటట్లు ఆజ్ఞలు జారీ చేయాలి. శాసనసభలో నాయకులు మాతృభాషలోనే ప్రసంగించాలి. ఇలాంటివి ఎన్నో ఆలోచనలు మనసు పెట్టి ఆలోచిస్తే స్ఫురిస్తాయి. అలా స్ఫురించినవాటిని ఆచరణలోకి తీసుకువస్తే ప్రయోజనం ఉంటుంది.
- తెలుగును వ్యాప్తి చేయడంలో ప్రజల బాధ్యత ప్రజలది, ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వానిది. సాధ్యమయినంత వరకు మన నిత్య జీవనాన్ని పూర్తిగా తెలుగుమయం చెయ్యడానికి ఎవరికీ ఏ ఇబ్బందికానీ ఖర్చుకానీ ఉండదు. ఉద్యమాలు చేసి ఆయాసపడనక్కర్లేదు. ఉద్యమస్ఫూర్తి ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. అది నూటికి నూరుపాళ్ళూ ఆచరించేదిగా ఉండాలి. ప్రతి ఒక్కరూ తక్కినవారిని ప్రభావితం చేసి కార్యోన్ముఖులయ్యేలా చూడాలి. ఇది మనందరి గురుతర బాధ్యత. తెలుగు వెలుగును దశదిశలా వ్యాపింపజేయడమో, లేక క్రమక్రమంగా కొండెక్కిపోతున్న వెలుగును పోగొట్టుకొని, మన భాషా సంస్కృతుల్ని అజ్ఞానంలోనికి నెట్టుకొని ఉనికిని కోల్పోవడమో... అంతా మన చేతుల్లోనే ఉంది. మన చేతల్లోనే ఉంది. ఆలోచించండి. ఆచరించండి. ఉద్యమించండి. పాపిశెట్టి 19:39, 18 డిసెంబర్ 2006 (UTC)