పార్శ్వనొప్పి
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
చాలామంది పార్శ్వనొప్ప తలలో ఒకవైపే వస్తుందని భావిస్తుంటారు. కానీ కొన్నిసార్లు రెండు వైపులా కూడా రావచ్చు. ఈ రకం తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. తలలో కొట్టుకుంటున్నట్లుగా.. వస్తూ పోతున్నట్లుగా.. తగ్గుతూ, తీవ్రమవుతున్నట్టు ఉంటుంది. కొందరికి వాంతులవుతాయి, కొందరికి కావు. ఎవరన్నా మాట్లాడితే చికాకుగా ఉంటుంది. శబ్దాలు వినబుద్ధి కాదు, వెలుతురు చూడబుద్ధి కాదు. ప్రయాణం చేసినా, ఎండలో ఎక్కువగా తిరిగినా, భోజనం ఆలస్యమైనా లేక అస్సలు తినకపోయినా, నిద్ర తక్కువైనా లేక మరీ ఎక్కువైనా.. ఇలాంటి సందర్భాలన్నింటిలోనూ ఈ రకం తలనొప్పి రావచ్చు. వాస్తవానికి ఇవన్నీ పార్శ్వనొప్పిని ప్రేరేపించేవేగానీ.. పార్శ్వనొప్పికి మూలకారణాలు కావు. పార్శ్వనొప్పి జన్యుపరమైన సమస్య. వంశంలో ఎవరికైనా ఉంటే మనకూ రావచ్చు. పురుషుల్లోనూ ఉండొచ్చుగానీ ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువ. ఈ పార్శ్వనొప్పిని శాశ్వతంగా తగ్గించే మందేదీ లేదు. కాకపోతే దీన్ని తగ్గించి, నియంత్రించేందుకు మంచి చికిత్సలున్నాయి. ఇలా నియంత్రణలో ఉంచితే కొన్నాళ్లకు దానంతట అదే పోతుంది. కానీ మళ్లీ కొంతకాలం తర్వాత రావచ్చు.
[మార్చు] నివారణ
పార్శ్వనొప్పి ఎప్పుడన్నా ఓసారి వేధిస్తుంటే, ఆ నొప్పి వచ్చినప్పుడు సాధారణ పెయిన్ కిల్లర్లు తీసుకుంటే సరిపోతుంది. వీటితో నొప్పి వెంటనే తగ్గుతుంది. అలా కాకుండా నొప్పి మరీ తరచుగా వస్తూ తీవ్రంగా వేధిస్తుంటే మాత్రం.. కొంతకాలం పాటు కొన్ని ప్రత్యేక తరహా మందులు తీసుకోవటంతో ఫలితం ఉంటుంది. ఈ ప్రత్యేక చికిత్సకు చాలా రకాల మందులున్నాయి. వీటిని వ్యక్తి లావు-సన్నం, స్త్రీలు-పురుషులు, పిల్లలు-వృద్ధులు... ఇలా రకరకాల అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తారు. తలనొప్పి మరీ తీవ్రంగా రోజువారీ పనిని దెబ్బతీస్తూ, తరచూ వేధిస్తుంటేనే ఈ తరహా ప్రత్యేక మందులు ఇస్తారు. రెండు మూడు నెలలకోసారి వస్తుంటే.. అది వచ్చినప్పుడు సాధారణ పెయిన్ కిల్లర్లు సరిపోతాయి. నెలకు రెండు మూడుసార్లకంటే ఎక్కువగా వస్తున్నా, ఒక్కసారే వచ్చి మరీ ఎక్కువసేపు వేధిస్తున్నా అప్పుడీ ప్రత్యేక మందుల గురించి ఆలోచించాల్సి ఉంటుంది.