పిఠాపురం నాగేశ్వరరావు
వికీపీడియా నుండి
తెలుగు సినీ జగత్తులో జంట దర్శకులని, జంట సంగీత దర్శకులని చాలా మందిని చూసాంకాని, జంటగాయకులనతగ్గవారు మాత్రము మాధవపెద్ది - పిఠాపురం మాత్రమే. పిఠాపురం నాగేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 1930 మే 5న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు: విశ్వనాధం - అప్పయమ్మ గార్లు. అసలు వీరి ఇంటిపేరు ' పాతర్లగడ్డ ', కానీ, 'చిత్తూరు' నాగయ్య లాగా, నాగేశ్వరరావుగారు కూడా తమ ఊరిపేరునే తన ఇంటిపేరు చేసుకున్నారు.
[మార్చు] బాల్యం
పిఠాపురం నాగేశ్వరరావు అసలు పేరు పాతర్లగడ్డ నాగేశ్వరరావు. పిఠాపురం నుంచి వచ్చాడనో ఏమో, అందరూ పిఠాపురం నాగేశ్వరరావు అనేవారుగాని, అసలు ఇంటిపేరు కలిపేవారుకారు. పిఠాపురంలో హైస్కూల్ చదువులువరకు చదువుకున్న నాగేశ్వరరావుకి రంగస్థలం మమకారం తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. ఆయన తండ్రి , ఆ రోజులలో మంచి రంగస్థల నటుడు. గాత్రశుద్ది బాగావున్న నాగేశ్వరరావు, స్నేహితుల ప్రోద్బలముతో, 1944 నుంచి వవ్యకళా సమితి వారి నాటకాల్లో నటించటము మొదలుపెట్టారు. విశేషమేమిటంటే, పాడుకోలేని ఇతర నటీనటులకు తర వెనుక నుండి పాటలు, పద్యాలు, శ్లోకాలు పాడే విధానానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఆ అనుభవంతో, సినిమాలలో పాడాలనే ఆశతో, ఇంట్లో చెప్పకుండా మద్రాసు పారిపొయివచ్చారు. తెలిసినవారందరిళ్ళలో తలదాచుకోని తన అదృష్టన్ని పరీక్షించుకున్నారు.
[మార్చు] సినీ జీవితం
1946 లో విడుదలైన మంగళ సూత్రం అనే సినిమాలొ తొలిసారిగా పాడి, సినిరంగంలొ కాలుమోపారు. అప్పటికాయన వయస్సు కేవలం పదహరేళ్ళే . జెమినివారి ప్రతిష్టాత్మక సినిమా చంద్రలేఖ లొ పాడే అవకాశం రావటంతో సినిపరిశ్రమలో నిలదొక్కుకున్నారు. అప్పటినుంచి, సుమారు పాతికేళ్ళు అనేక సినిమాల్లో పాడి తనసత్తా నిరుపించుకున్నారు. అది సోలో అయినా, యుగళగీతమైనా సరే, ఆయన పాడినవన్ని దాదాపు హస్యగీతాలే. ఘంటసాల వారితో కలిసిపాడిన "మా ఊళ్ళో ఒక పడుచుంది" (అవేకళ్ళు) పాట, మాధవపెద్దిగారితో కలిసిపాడిన " అయ్యయో! జేబులోడబ్బులుపొయనే " (కులగోత్రాలు) పాట, పిఠాపురం గారికి ఎనలేని పేరుతెచ్చాయి. ఈనాటికి ఆ పాటలు అందరినోళ్ళలో నానుతాయంటే అతిశయోక్తికాదు. ఆయన చివరిసారిగా "చల్లని రామయ్య - చక్కని సీతమ్మ" అనే పాట 1978లో బొమ్మరిల్లు సినిమాకోసం పాడారు. 1996 మార్చి 5న మృతి చెందిన హస్యగీతాల గోపురం శ్రీ పిఠాపురం.
[మార్చు] పాడిన పాటలు
పిఠాపురం తెలుగు లోనెగాక, తమిళ, కన్నడ, హిందీ, సింహళ భాషలలో సుమారు 7వేల పాటలు పాడారు. అందులో ఆయన పాడిన కొన్ని హుషారైన పాటలు:
- రాజు వెడలె సభకు (మాయలమారి - 1951)
- పెళ్లి చేసి చూపిస్తాం మేమేపెళ్లి పెద్దలనిపిస్తాం (పెళ్లి చేసి చూడు - 1952)
- ఏం చేస్తే అది ఘనకార్యం మనమేం చేస్తే అది ఘనకార్యం (చంద్రహారం-1954)
- నిసగమపా లోకం మోసం పమగరిసా (జయసింహ-1956)
- రా, మాతోటి గెలిచే (సువర్ణసుందరి - 1957)
- మందుకాని మందు (ఇంటిగుట్టు - 1958)
- తడికో తడికో (అత్తా ఒకింటి కోడలే - 1958)
- మాయాసంసారం తమ్ముడూ (ఉమాసుందరి-1956)
- పదవే పోదాము గౌరీ (వెంకటేశ్వర మహాత్యం-1960)
- అయ్యయో! జేబులోడబ్బులుపొయనే (కులగోత్రాలు - 1962)
- డివ్వీ డివ్వీ డివ్వట్టం నువ్వంటేనే నాకిష్టం (దాగుడుమూతలు-1964)
- పట్నమెల్లగలవా ఓ భామా (పెద్దమనుషులు - 1964)
- సోడా సోడా ఆంధ్రా సోడా! (లక్ష్మీనివాసం - 1967)
- అబ్బబ్బచలి (భలేరంగడు-1969)
- మా ఊళ్ళో ఒక పడుచుంది (అవేకళ్ళు)