పేకేటి శివరాం
వికీపీడియా నుండి
పేకేటి శివరామ్ (పేకేటి శివరామ సుబ్బారావు) ప్రముఖ తెలుగు సినిమా నటుడు. 1953 లో కన్నతల్లి సినిమా ద్వారా ఆయన సినిమా రంగంలోకి ప్రవేశించాడు. తెలుగు తమిళ, కన్నడ సినిమాల్లో ఆయన నటించాడు. దేవదాసు లోని పాత్ర ద్వారా ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన నటించిన సినిమాల సంఖ్య తక్కువే. నటుడిగానే కాక, ప్రొడక్షను మేనేజరుగా కూడా ఆయన పని చేసాడు.
పేకేటి 2006 డిసెంబర్ 30 న మరణించాడు.