భారతదేశములో ప్రాంతీయ భాషల ప్రాముఖ్యము
వికీపీడియా నుండి
విషయ సూచిక |
[మార్చు] హిందీ భాష
బ్రిటిష్ వారి పరిపాలనలో ఇంగ్లీష్య్ భాష ఉన్నత విద్య, కార్య నిర్వాహకత్వపు భాష గా ఎదిగింది. బ్రిటిషు వారు వెళ్ళిన తరువాత కూడా ఇది ఇలాగే కొనసాగ వలసినదేనా అనే ప్రశ్నకు రెండు సమాధానములు ఉన్నవి.
- ఉత్తర భారతీయుల ప్రకారము హిందీ ని జాతీయ భాష చెయ్యడము.
- (హిందీ కి దగ్గరగా లేని మాతృభాష కల)ఇతర భారతీయుల ప్రకారము ఇంగ్లీషు ను ఆంతరరాష్ట్ర సంబంధములకు వాడుకోవడము.
హిందీని జాతీయ భాష గా చాలా మంది దక్షిణభారతీయులు, హిందీ కి దగ్గరగా లేని మాతృభాష కల ఇతర భారతీయులు ఒప్పుకున్నపటికీ వారు సాధారణంగా మూడు భాషలను నేర్ఛుకోవలసి వచ్చును. ఉత్తర భారతీయుల కు కూడా ఒక వేరే ప్రాంతీయ నేర్పిస్తే బాగానే ఉంటుంది. ఈ విషయము మీద 1965 ప్రాంతాలలో పార్లమెంటులో నిర్ణయాలు తీసుకోవడాము జరిగింది కాని అమలు కాలేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత అధికార భాషా సంఘము ప్రయత్నాల వలన ప్రభుత్వ జీ.వో లు కోర్టు కార్యకలాపాలు తెలుగు లో పూర్తిగా అనువదించబడ్డాయి.
ఉత్తర భారత దేశములో నివసించే హిందీ రాని భారతీయులు చాలా మంది ద్వితీయ శ్రేణి పౌరులుగా(భారత పౌరుల కంటే తక్కువ వారిగా) భావింపబడడము కద్దు. దీనికి హిందీ రాక పోవడము కొంత కారణము. [1] యూరోపియన్ యూనియన్ లో తప్పితే ప్రపంచములో ఇంక ఏ దేశము లో ఇటువంటి సమస్య లేనందున [2] ఈ సమస్య పరిష్కారము కనుగొనడానికి కొంత కాలము పడుతుంది.
[మార్చు] 2007 లో మార్పులు
- భారతదేశము లోనే కాక ప్రపంచములో నే అత్యంత ప్రతిష్టాకరమైన ఐ.ఐ.టి. ఎంటెన్స్ (IIT-JEE-2007) ను వివిధ భారతీయ భాషల లో 2007 నుండి నిర్వహిస్తున్నారు. ఇందులో తెలుగు కూడా ఉంది. ప్రశ్న పత్రాలు ఇంగ్లీషు లో కాని హిందీ లో కాని ఉంటాయి. జవాబులు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మళయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ ల లో వ్రాయవచ్చు. [3]
[మార్చు] ఆధారములు
[మార్చు] మూలములు
- http://www.hindu.com/mag/2004/01/18/stories/2004011800040300.htm
- http://nitawriter.wordpress.com/2006/11/02/are-south-indians-superior-to-north-indians/
- http://www.hindu.com/2005/06/21/stories/2005062108410400.htm
- http://www.hindu.com/2005/09/18/stories/2005091803740600.htm
- Indian languages page . Data 1995. Courtesy Library of Congress.