రాజశ్రీ (సినీ రచయిత)
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
రాజుశ్రీ (ఇందుకూరి రామకృష్ణంరాజు) ప్రముఖ సినీ రచయిత. 1934 ఆగష్టు 31 న విజయనగరంలో గురవరాజు నారాయణమ్మలకు జన్మించాడు. ఈయన ఎక్కువగా అనువాద చిత్రాలకు మాటలు, పాటలు రాసాడు. బి.యస్సీ ఫిజిక్సు చేసి ఆ తర్వాత రెండు మూడేళ్ళు విజయనగరం తహసిల్దారు వద్ద పి.ఏ గా చేసి, అక్కడ నచ్చక మద్రాసు వెళ్ళిపోయారు. అక్కడ ఎం.జి.ఆర్ ని కలిసి ఆయన కోసం రాసిన ఒక కథను వినిపించారు. అది నచ్చడంతో తేడివంద మాప్పిళ్ళ పేరుతో సినిమా తీసారు. అది విజయవంతం అయ్యింది. ఆ తర్వాత దాదాపు 60 వరకు తమిళ చిత్రాలకి కథ, స్క్రీన్ ప్లే అందించారు. సుమారు 1000 చిత్రాలకు రచన చేసారు. అంతే కాకుండా ఎంకన్న బాబు, మామా కోడలు, పెళ్ళిచేసి చూపిస్తాం మరియు పుదియ సంగమం అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. చదువు సంస్కారం, నిజం నిద్రపోదు చిత్రాలకు దర్శకత్వం వహించారు. మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం గీతాంజలికి మాటలు రాసారు. మట్టిలో మాణిక్యం, బంగారు గాజులు చిత్రాలకు బంగారు నంది పురస్కారాలు అందుకున్నారు. రాజశ్రీ రచన చేసిన చివరి చిత్రం ప్రేమికుడు. 1994లో నిదురలోనే మరణించాడు. అతని కొడుకు రాజశ్రీ సుధాకర్ కొన్ని ఆంగ్ల అనువాద చిత్రాలకు మాటలు రాసాడు.
[మార్చు] చిత్రాలు
- ప్రేమ పావురాలు (అనువాదం - హిందీ)
- ప్రేమికుడు (అనువాదం - తమిళం)
- జంటిల్ మేన్ (అనువాదం - తమిళం)
- మైఖేల్ మదనకామరాజు (అనువాదం - తమిళం)
- విచిత్ర సోదరులు (అనువాదం - తమిళం)
- ఘర్షణ (పాతది) (అనువాదం - తమిళం)
- ఖైదీ
- దేవుడమ్మ
- స్వయంవరం
- మట్టిలో మాణిక్యం
- సత్తెకాలపు సత్తయ్య
- సంబరాల రాంబాబు
- పరువు ప్రతిష్ట
[మార్చు] కొన్ని ఆణిముత్యాలు
- కురిసింది వాన నా గుండెలోన... - మట్టిలోమాణిక్యం
- మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట... - మట్టిలోమాణిక్యం
- నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి... సత్తెకాలపు సత్తయ్య
- మామా చందమామ విన రావా... సంబరాల రాంబాబు
- ఎక్కడో దూరాన కూర్చున్నావు... దేవుడమ్మ
- నిన్ను తలచి మైమరచా... - విచిత్ర సోదరులు