అంగలూరు (గుడ్లవల్లేరు మండలం)
వికీపీడియా నుండి
అంగలూరు కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలములోని ఒక గ్రామము. హేతువాద రచయిత, సంఘ సంస్కర్త అయిన త్రిపురనేని రామస్వామిచౌదరి ఈ గ్రామమునకు చెందిన వాడే. ఒక కథనము ప్రకారము ఈ ఊరు 12వ శతాబ్దము నుండి ఉన్నది. పూర్వము ఇక్కడ సైన్యము కొరకు అంగళ్లు ఉండటము వలన అంగళ్లూరు అని పేరు వచ్చినది. ఆంగళ్లూరు కాలక్రమేణా అంగలూరు అయినది. ఈ చిన్న గ్రామము అనేకమంది స్వాతంత్ర్యసమరయోధులను అందిచినది.