కృష్ణా జిల్లా
వికీపీడియా నుండి
కృష్ణా జిల్లా | |
---|---|
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ప్రాంతము: | కోస్తా |
ముఖ్య పట్టణము: | మచిలీపట్నం |
విస్తీర్ణము: | 8,727 చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) | |
మొత్తము: | 42.18 లక్షలు |
పురుషులు: | 21.51 లక్షలు |
స్త్రీలు: | 20.67 లక్షలు |
పట్టణ: | 13.65 లక్షలు |
గ్రామీణ: | 28.52 లక్షలు |
జనసాంద్రత: | 483 / చ.కి.మీ |
జనాభా వృద్ధి: | 14.05 % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 69.91 % |
పురుషులు: | 74.57 % |
స్త్రీలు: | 65.05 % |
చూడండి: ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు |
కృష్ణా జిల్లాకు ఆ పేరు జిల్లాలో ప్రవహించే కృష్ణా నది వల్ల వచ్చింది. జిల్లా అధికారిక కేంద్రం మచిలీపట్నం కాగా, వాణిజ్య కేంద్రంగా విజయవాడ ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లా సరిహద్దులలో ఉత్తరాన ఖమ్మం జిల్లా, తూర్పున పశ్చిమ గోదావరి, దక్షిణాన బంగాళాఖాతము, నైరుతిలో గుంటూరు జిల్లా, వాయవ్యంలో నల్గొండ జిల్లా ఉన్నాయి. రాష్ట్రంలోని పెద్ద నగరాల్లో విజయవాడ మూడవది.
విషయ సూచిక |
[మార్చు] విశిష్టతలు
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సు లో కొంత భాగం కృష్ణా జిల్లాలో కూడా ఉంది. ఇక్కడ ప్రవహించే నదులు కృష్ణా, బుడమేరు, మున్నేరు మరియు తమ్మిలేరు. కృష్ణా జిల్లా ఎందరో ప్రముఖులకు పుట్టినిల్లు. వారిలో కొందరు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు, పింగళి వెంకయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, కె.ఎల్.రావు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కైకాల సత్యనారాయణ మరియు విశ్వనాథ సత్యనారాయణ. విజయవాడ, గుడివాడ, వుయ్యూరు, మచిలీపట్నం, కొండపల్లి, తిరువూరు, కైకలూరు, నందిగామ, నూజివీడు, జగ్గయ్యపేట ఈ జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలు.
[మార్చు] చరిత్ర
చరిత్రలో వివిధ కాలాల్లో శాతవాహనులు, చోళులు, రెడ్డిరాజులు, గోల్కొండ నవాబులు మొదలైనవారు ఈ ప్రాంతాన్ని పాలించారు. కృష్ణా జిల్లాను ఇంతకు ముందు "మచిలీపట్నం జిల్లా" అని పిలిచేవారు. 1859లో గుంటూరు జిల్లాలోని కొన్ని తాలూకాలను ఈ జిల్లాలో కలిపి కృష్ణాజిల్లాగా పేరు మార్చారు. 1925లో కృష్ణాజిల్లాను కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలుగా విభజించారు. పట్టణ ప్రాంత ప్రజలలో ఎక్కువ మంది వ్యాపారంలో ఉండగా, గ్రామాల్లో వ్యవసాయం ప్రధాన వృత్తి.
[మార్చు] మరి కొంత వివరము
ఇక్కడి తెలుగులో కొంత కోస్తా యాస కలిసి ఉంటుంది. జిల్లలో 9% అటవీ ప్రదేశం. సామాజిక అటవీ కార్యక్రమం కూడా కొనసాగుతున్నది. ఇక్కడి తీరప్రాంతములలో చమురు నిల్వలు కూడా ఉన్నాయి. కృష్ణా జిల్లాలో ఎన్నో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో కెసీపి చెక్కర కర్మాగారం చెప్పుకోతగ్గది. ఇదికాక ఎన్నో సిమెంటు ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. విజయవాడ దగ్గరి ఇబ్రహీమ్ పట్నం వద్ద ఉన్న తాప విద్యుత్కేంద్రం చాలా పేరెన్నికగన్నది. ఇవికాక మచిలీపట్నంలో గిల్టునగల తయారీ, కొండపల్లి చెక్కబొమ్మలు, జగ్గయపేట లో సంగీత సాధనముల తయారీ మొదలయిన చేతి వృత్తి పనులు కూడా ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన సాంప్రదాయిక నృత్య రీతి యైన కూచిపూడి నృత్యం జిల్లాలోని కూచిపూడిలో పుట్టింది.
[మార్చు] మండలాలు
భౌగోళికంగా కృష్ణా జిల్లాను 50 రెవిన్యూ మండలములుగా విభజించారు.
1 జగ్గయ్యపేట | 18 పెనమలూరు | 35 నాగాయలంక |
2 వత్సవాయి | 19 తొట్లవల్లూరు | 36 కోడూరు |
3 పెనుగంచిప్రోలు | 20 కంకిపాడు | 37 మచిలీపట్నం |
4 నందిగామ | 21 గన్నవరం | 38 గూడూరు |
5 చందర్లపాడు | 22 అగిరిపల్లి | 39 పామర్రు |
6 కంచికచెర్ల | 23 నూజివీడు | 40 పెదపారుపూడి |
7 వీరుల్లపాడు | 24 చత్రాయి | 41 నందివాడ |
8 ఇబ్రహీంపట్నం | 25 ముసునూరు | 42 గుడివాడ |
9 జి.కొండూరు | 26 బాపులపాడు | 43 గుడ్లవల్లేరు |
10 మైలవరం | 27 ఉంగుటూరు | 44 పెదన |
11 ఏ.కొండూరు | 28 వుయ్యూరు | 45 బంటుమిల్లి |
12 గంపలగూడెం | 29 పమిడిముక్కల | 46 ముదినేపల్లి |
13 తిరువూరు | 30 మొవ్వ | 47 మందవల్లి |
14 విస్సన్నపేట | 31 ఘంటసాల | 48 కైకలూరు |
15 రెడ్డిగూడెం | 32 చల్లపల్లి | 49 కలిదిండి |
16 విజయవాడ గ్రామీణ | 33 మోపిదేవి | 50 కృతివెన్ను |
17 విజయవాడ పట్టణం | 34 అవనిగడ్డ |
[మార్చు] వనరులు
ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు | |
---|---|
అనంతపురం | అదిలాబాదు | కడప | కరీంనగర్ | కర్నూలు | కృష్ణ | ఖమ్మం | గుంటూరు | చిత్తూరు | తూర్పు గోదావరి | నల్గొండ | నిజామాబాదు | నెల్లూరు | పశ్చిమ గోదావరి | ప్రకాశం | మహబూబ్ నగర్ | మెదక్ | రంగారెడ్డి | వరంగల్ | విజయనగరం | విశాఖపట్నం | శ్రీకాకుళం | హైదరాబాదు |