అలీ ఆదిల్‌షా
వికీపీడియా నుండి
అలీ ఆదిల్‌షా, బీజాపూరు సుల్తాను. 1558 నుండి 1580 వరకు పరిపాలించినాడు.
ఈయన ఇతర దక్కన్ ప్రాంతపు ముస్లిం రాజులతో కలసి తళ్ళికోట యుద్ధము లో విజయనగర సామ్రాజ్య పతనానికి కారణమైనాడు. విజయనగరము నుండి దోచుకొన్న సంపదతో అనేక కట్టడాలు నిర్మింపచేసినాడు. ఈయన బీజాపూరు లో గగన్ మహల్, అలీ రౌజా (తన సొంత సమాధి), చాంద్ బావుడీ (పెద్ద బావి) మరియు జామీ మసీదు కట్టించాడు.
సుల్తానుల మధ్య సంధిలో భాగముగా అలీ ఆదిల్‌షా 1562 లో అహ్మద్‌నగర్ సుల్తాను హుస్సేన్ నిజాంషా కూతురు చాంద్ బీబీ ని వివాహము చేసుకున్నాడు. 1580 లో మరణించే సమయానికి అలీ ఆదిల్‌షాకు సంతానము లేక పోవడము వలన తన nephew? పదేళ్ల బాలుడు ఇబ్రహీం ఆదిల్‌షా II రాజ్యమునకు వారసుడయ్యాడు. ఆ కాలములో అలీ ఆదిల్‌షా భార్య చాంద్ బీబీ రాజ్యవ్యవహారాలు చూసుకొన్నది.
అలీ ఆదిల్‌షా గోవా లోని సఫా షహౌరి మసీదు ను 1560లో పోంద ప్రాంతములో కట్టించినాడు.
మూస:బీజాపూరు సుల్తానులు