అసమర్థుని జీవయాత్ర
వికీపీడియా నుండి
ప్రముఖ తెలుగు నవలా రచయిత త్రిపురనేని గోపీచంద్ కు నవలా సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని సాధించి పెట్టిన అసమర్థుని జీవయాత్ర తెలుగులో మెట్టమొదటి మనో వైజ్ఞానిక నవల.
1947లో రచించబడిన ఈ నవలను సాహితీ విమర్శకుడు డి.ఎస్.రావు ఆంగ్లములో ది బంగ్లర్ ఎ జర్నీ త్రూ ద లైఫ్ (The Bungler - A Journey Through Life) గా అనువదించాడు[1].
[మార్చు] నవలా నిర్మాణం
జ్ఞానం అనేది నిత్యం సముద్రంలోకి ప్రవహించే కొత్త నీరులాంటిది అని తెలుసుకోకుండా, అసమగ్రమని ముందే తేల్చేసిన పాత సిద్ధాంతాల్ని అర్థం చేసుకున్న జ్ఞానంతో తాను జీవిస్తున్న ప్రస్తుత సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, తనకు మాలిన ధర్మానికి పోయి, సర్వం కోల్పోయి తన చాతకానితనాన్ని అసంబద్ధతర్కంతో సమర్థించుకోవడం వంటి వాటి వల్ల ఎలాంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కోవల్సి వస్తుందోనన్న విషయాన్ని రచయిత ఈ నవలలో చెప్పదల్చాడు.
యిందుకుగానూ ఆయన ఎన్నుకున్న ఇతివృత్తం, దాన్ని నిర్వహించిన శిల్పం, పాత్రల మనస్తత్వాన్ని పట్టించే వర్ణన, నాటకీయత మధ్య సాగే ముగింపు...యివన్నీ గోపీచంద్ ప్రతిభను, ప్రయోగదీక్షతను, సృజనాత్మకతను, సమర్థతనూ చాటుతున్నాయి.
సీతరామారావు పాత్రలో కనిపించే ఆధిక్యతా, ఆత్మన్యూనతా భావాలు వివిధ రకాలైన మానసిక చిత్తప్రవృత్తుల దృష్ట్యా యిది ఫ్రాయిడ్,ఆడ్లర్ సిద్ధాంతాల ప్రభావంతో వచ్చిన మనోవైజ్ఞానిక నవల అని చెప్పవచ్చును.
యిందులో (సీతారామారావు) అసమర్థుడుగా మారటం అన్న ఆరంభం నుండి అతను కడతేరే వరకు సీతారామారావు జీవితాన్ని ఆరుభాగాలుగా విభజించి రచించాడు గోపీచంద్.
- అసమర్థుడు
- అసమర్థుని భార్య
- అసమర్థుని ఆదర్శం
- అసమర్థుని మేనమామ
- అసమర్థుని ప్రతాపం
- అసమర్థుని అంతం
చూట్టానికి వేటికవే ఆరుభాగాలుగా కన్పించినా వీటిలో ఎక్కడా ఏకసూత్రత కొరవడలేదు. ఆ ఆరుభాగాలూ సీతారామారావులోని క్రమపరిణామాన్ని చూపాయి.
[మార్చు] మూలాలు
[మార్చు] బయటి లింకులు
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |