వికీపీడియా నుండి
త్రిపురనేని గోపీచంద్ ప్రముఖ తెలుగు రచయిత, హేతువాది, సాహితీవేత్త మరియు తెలుగు సినిమా దర్శకుడు. గోపీచంద్ 1910, సెప్టెంబర్ 8 న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి ప్రముఖ సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి. గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించాడు.అనేక వాదాలతో వివాదపడుతూ, తత్వాలతో దాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించాడు. తన తండ్రినుంచి గోపీచంద్ పొందిన గొప్ప ఆయుధం,ఆస్తి,శక్తి ఎందుకు? అన్న ప్రశ్న. అది అతన్ని నిరంతరం పరిణామానికి గురిచేసిన శక్తి. అతనిలోని అరుదైన, అపురూపమైన, నిత్యనూతనమైన అన్వేషణాశీలతకి ఆధారం. ఎందుకు? అన్న ప్రశ్ననే అతన్ని ఒక జిజ్ఞాసువుగా,తత్వవేత్తగా నిలబెట్టింది. ఈ క్రమంలో అతనిలో చెలరేగిన సంఘర్షణ అతని నవలలన్నింటిలోనూ ప్రతిఫలించింది.
[మార్చు] జీవిత క్రమం
- 8-సెప్టెంబర్-1910 నాడు గోపీచంద్ జన్మించారు.సుప్రసిద్ధ రచయిత, హేతువాది, సంస్కరణవాది అయిన త్రిపురనేని రామస్వామి చౌదరి వీరి తండ్రిగారు,తల్లి పున్నమాంబ.
- హేతువాద నాస్తికత్వపు భావజాలాల వాతావరణంలో పెరిగిన గోపీచంద్ పై వాటి ప్రభావం సహజంగానే పడింది.
- 1932 లో వివాహం;1933లో బి,ఏ పట్టా ఆ తర్వాత లా డిగ్రీ. కొంతకాలంగా న్యాయవాదిగా ప్రాక్టీసు పెట్టినా ఆ వృత్తిలో యిమడలేక పోయారు. ఈ దశలో వీరు కమ్యూనిజం పట్ల(మార్క్సిజం)పట్ల ఆకర్షితులయ్యారు.కానీ అందులోని అరాచకత్వం ఆయనకు నచ్చలేదు.
- ఆ తర్వాత ఎమ్.ఎన్.రాయ్ 'మానవతావాదం' వారిపై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఈ కాలంలో వీరు ఆంధ్రా రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగా పనిచేసారు.
- 1928లోనే శంబుక వధ కథ ద్వారా సాహిత్యరంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ 1938లో పట్టాభి గారి సోషలిజం అన్న పుస్తకాన్ని వెలువరించారు.
- తొలుత కథా సాహిత్యంలో స్థిరపడ్డ గోపీచంద్ ఆ తర్వాత నవలా సాహిత్యరంగంలోకి అడుగుపెట్టారు. వీరి తొలి నవల పరివర్తనం(1943).
- 1939లో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించన వీరు దర్శకనిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించారు. అయితే వాటివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయారు.
- 1953లో ఆంధ్రరాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గా, 1956లో ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ సహాయ డైరెక్టర్ గా పనిచేసారు.
- 1957-62 వరకు ఆకాశవాణిలో పనిచేసారు. ఈ దశలో అరవిందుని భావాల పట్ల విశ్వాసం ఏర్పడడంతో ఆధ్యాత్మికవాదం వైపుకి పయనించారు.
- 2-నవంబర్-1962 నాడు గోపీచంద్ గారు స్వర్గస్తులైనారు.
[మార్చు] యదార్ధ రచనలు
- తత్వవేత్తలు
- పోస్టు చేయని ఉత్తరాలు
- మాకూ ఉన్నాయి సొగతాలు
[మార్చు] బయటి లింకులు