ఆంధ్ర ప్రదేశ్ నదులు
వికీపీడియా నుండి
తెలుగు సంస్కృతినుండి తెలుగు నదులని వేరు చేయడము కష్టము. నదుల విషయములో మన తెలుగు సీమ చాలా సౌభాగ్యవంతమైనది. మన సీమ గోదావరి , కృష్ణ , తుంగభద్ర , పెన్న , కిన్నెరసాని, మున్నేరు, శబరి, మొదలైన నదుల చేత సుసంపన్నము చెయ్యబడినది. ఆంధ్రలో సుమారు 25 నదులు కలవు. అందులో గోదావరి, కృష్ణ, పెన్న, నాగావళి, వంశధార ముఖ్య వదులు.