ఇందిరా గాంధీ
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
ఇందిరా ప్రియదర్శిని గాంధీ (హిందీ: इन्दिरा प्रियदर्शिनी गान्धी)(Indira Priyadarshini Gandhi) (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) జనవరి 19, 1966 నుండి మార్చి 24, 1977వరకు మరళా జనవరి 14, 1980 నుండి అక్టోబర్ 31, 1984 న హత్యగావించబడేవరకు భారత దేశ ప్రధానమంత్రిగా పనిచేసినది.
ఈమె భారత దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కూతురు మరియు ఇంకొక భారత ప్రధాని రాజీవ్ గాంధీకి తల్లి. ఇందిరా గాంధీ భారత దేశపు ఒక ప్రసిద్ధ మరియు వివాదాస్పద రాజకీయ నాయకురాలు. ఈమె ఇంటిపేరు గాంధీ అని పెట్టుకున్నప్పటికీ ఈమె జాతిపిత మహాత్మా గాంధీకి సంబంధీకురాలు కాదు.