ఈమని
వికీపీడియా నుండి
ఈమని, గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలానికి చెందిన గ్రామము.
ఈ వూరికీపేరు రావడం ఇలా జరిగిందని చెబుతారు. ఒకప్పుడు ఇదంతా దట్టమైన అటవీ ప్రాంతం. అందులో మునులు తపస్సు చేసుకొంటూ ఉండేవారు. వారు దగ్గరలో, కృష్ణానదికి అటువైపున ఉన్న "మునికోటిపురం" (ప్రస్తుతం మున్నంగి) అనేవూరికి అప్పడపుడూ వెళుతుండేవారు. మళ్ళీ మళ్ళీ కృష్ణలో స్నానాలు చేసి తపస్సుకోసం "ఈ వని" (ఈ అడవి)కి తిరిగి వచ్చేవారు. "ఈ వని" కాలక్రమంలో "ఈమని"గా మారింది.
గ్రామీణ పరిపాలనలో మండల వ్వవస్థ ప్రవేశపెట్టకముందు ఈమని ఒక పంచాయితీ సమితి కేంద్రము. మొత్తం 42 గ్రామపంచాయితీలకు ఈమని సమితికేంద్రంగా ఉండేది. (పంచాయితీ సమితి లో ఒక సమితి అభివృద్దీ అధికారి -BDO, ఒక సమితి ప్రెసిడెంటు ఉండేవారు. స్థానిక పాలనా బాధ్యతలు - విద్య, వ్యవసాయం, వైద్యం వంటివి పంచాయితీ సమితి అధికారంలో ఇండేవి), అప్పటి సమితి ఆఫీసు ఉండే భవనం ఇప్పుడు శిధిలావస్థలో ఉన్నది.