ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం
వికీపీడియా నుండి
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం (శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) ప్రముఖ తెలుగు నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు మరియు నటుడు. తెలుగువారు అభిమానముగా బాలు అని పిలిచే ఈయన జూన్ 4,1946 లో అప్పటి నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మ పేట గ్రామములో (ప్రస్తుతము ఈ గ్రామము తమిళనాడు రాష్ట్రములో ఉన్నది) ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు.
[మార్చు] బాల్యము
బాలసుబ్రహ్మణ్యం ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబములో రెండవ కుమారుడు. ఈయన తండ్రి సాంబమూర్తి పేరొందిన హరికథా పండితుడు. బాల్యమునుండే బాలుకు పాటలు పాడటము ఒక హాబీగా ఉండేది. తండ్రి కోరిక మేరకు ఇంజనీరు కావాలనే ఆశయముతో మద్రాసులో AMIE కోర్సులో చేరాడు. ఆ కాలములోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకొన్నాడు.
[మార్చు] సినీరంగ ప్రవేశము
బాలసుబ్రహ్మణ్యం 1966 లో నటుడు మరియు నిర్మాత అయిన పద్మనాభము నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమాతో గాయకునిగా రంగప్రవేశము చేశాడు. ఈ సినిమాకు ఆ తర్వాత కాలములో బాలు యొక్క గురువు అయిన కోదండపాణి సంగీత దర్శకత్వము వహించాడు.