చిరంజీవి
వికీపీడియా నుండి
చిరంజీవి (Chiranjeevi) గా ప్రసిద్ధి చెందిన కొణిదెల శివశంకర వరప్రసాద్ (Konidela Shiva Shankara వర Pradsad)తెలుగు సినిమా రంగంలో ఒక ప్రముఖ కధానాయకుడు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్గా ఆంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. మొత్తం దేశంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా [1].
విషయ సూచిక |
[మార్చు] కుటుంబం
ఆగష్టు 22, 1955 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో కొణిదెల వెంకట్రావు,అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించాడు.చిరంజీవి వివాహం ప్రసిద్ధ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980లో జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.
చిరంజీవి సోదరులు నాగేంద్రబాబు (సినిమా నిర్మాత, నటుడు), పవన్ కళ్యాణ్ (మరొక కధానాయకుడు). చిరంజీవి బావ అల్లు అరవింద్ ప్రముఖ సినిమా నిర్మాత. చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ కూడా సినిమా కధానాయకునిగా రాణిస్తున్నాడు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ హీరోగా సినిమా నిర్మాణం 2007లో ప్రారంభమైంది.బహుశా దీని పేరు "చిరుత" కావచ్చు.
[మార్చు] సినిమా ప్రస్థానం
చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978 లో పునాది రాళ్లు సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా. కాని ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయ్యింది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషికద 1,116 రూపాయలు. మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కధ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించాడు.
ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి హీరోగా నిలద్రొక్కుకున్నాడు. ఇంకా రుద్రవీణ, చంటబ్బాయ్,ఛాలెంజ్, శుభలేఖ చిత్రాలలో వివిధ తరహా పాత్రలలో మెప్పించి మంచి గుర్తింపు పొందాడు. గాంగ్ లీడర్ సినిమా చిరంజీవికి బలఙయన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. 1980, 90లలో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి వినోదాత్మక చిత్రాలు, ఆపద్బాంధవుడు, స్వయంకృషి వంటి సున్నితమైన పాత్రలతో వచ్చిన సినిమాలు కూడా విజయవంతమయ్యాయి. తరువాత కొంతకాలం చిరంజీవి సినిమాలు అంతగా విజయవంతంగా నడువ లేదు.
మళ్ళీ 1990 దశకం చివరిలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, హిట్లర్, చూడాలని వుంది సినిమాలు మంచి విజయాలను సాధించాయి. 2002లో వచ్చిన ఇంద్ర సినిమా తారా పధంలో చిరంజీవిని అత్యుత్తమ స్థానానికి తీసుకు వెళ్ళింది. ఇదే సమయంలో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు విస్తృతంగా చర్చనీయాంశాలయ్యాయి. తరువాత వచ్చిన టాగోర్, శంకర్దాదా ఎమ్.బి.బి.ఎస్, స్టాలిన్ వంటి సినిమాలు విజయవంతాలైనా గాని సినిమా బడ్జెట్‌లు విపరీతంగా పెరిగి పోవడం వలనా, ప్రేక్షకుల అంచనాలు అతిగా ఉండడం వలనా, రంగంలో తీవ్రమైన పోటీ నెలకొనడం వలనా అంత పెద్ద హిట్‌లుగా పరిగణించబడడం లేదు.
తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదటి యాక్షన్-డాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చును. అంతకు ముందు హీరోల సినిమాలలో ఈ అంశాలున్నా వాటికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. ఇంకా ఈ ఇమెజ్ వలన చిరంజీవి సున్నితమైన పాత్రలు పోషించిన సినిమాలకు తగినంత ప్రాధాన్యత రాలేదనిపిస్తుంది.
[మార్చు] సేవా కార్యక్రమాలు
చిరంజీవి అక్టోబర్ 2, 1998లో 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్' స్థాపించాడు. 'చిరంజీవి బ్లడ్ బాంక్', 'చిరంజీవి ఐ బాంక్' ఈ ట్రస్టు నడుపుతున్న ముఖ్య సేవా సౌకర్యాలు. రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా ఇవి గుర్తింపు పొందాయి.[2]. అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పధాన్ని పెద్దయెత్తున సమాజసేవా కార్యక్రమాలకు మళ్ళించడం ఈ ట్రస్టులు సాధించిన ఘనవిజయం. వీరి రక్తదానం వలన రాష్ట్రంలో 80,000 మంది, నేత్రదానం వలన 1000 మంది సేవలనందుకొన్నారని అంచనా .[3]. ఇప్పటికి ఈ సంస్థలకు 3.5 లక్షల మంది తమ మరణానంతరం నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. నాలుగు సంవత్సరాలు ఈ సంస్థలు 'అత్యుత్తమ సేవా సంస్థలు'గా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలనందుకొన్నాయి.
[మార్చు] సత్కారాలు
- జనవరి 2006లో రాష్ట్రపతి చే పద్మ భూషణ్ సత్కారం.[4].
- నవంబర్ 2006లో ఆంధ్ర విశ్వవిద్యాలయంవారి గౌరవ డాక్టరేటు[5].
[మార్చు] నటించిన సినిమాలు
సంవత్సరం | పేరు | పాత్ర | ఇతరత్రా విశేషాలు |
---|---|---|---|
2007 | శంకర్‌దాదా జిందాబాద్ | శంకర్ ప్రసాద్ | నిర్మాణంలో ఉంది |
2006 | Stalin | Stalin | |
Style | Cameo as himself | ||
2005 | Jai Chiranjeeva | Satyanarayana Murthy | |
Andarivadu | Govindarajulu/Siddharth | ||
2004 | Shankar Dada MBBS | Shankar Prasad | Winner: Filmfare Best Actor Award (Telugu) Winner: Santosham Best Actor Award |
Anji | Anji | ||
2003 | Tagore | Tagore | Winner: Santosham Best Actor Award |
2002 | Indra | Indra Sena Reddy | Winner: Nandi Award for Best Actor Winner:Filmfare Best Actor Award (Telugu) |
2001 | Daddy | Raj Kumar | |
Manjunatha | Manjunatha Swamy/Lord Siva | ||
Mrigaraju | Raju | Also playback singer | |
2000 | Annayya | Rajaram | |
Hands Up | Cameo | ||
1999 | Iddaru Mitrulu | Vijay | |
Sneham Kosam | Simhadri/Chinnayya | Winner: Filmfare Best Actor Award (Telugu) | |
1998 | Choodalani Vundi | Ramakrishna | |
Bavagaru Bagunnara | Raju | ||
1997 | Master | Raj Kumar | First Playback siniging movie |
Hitler | Madhava Rao | ||
1995 | Rikshavodu | Raju | |
Big Boss | Surendra | ||
Alluda Majaka | Sitaramudu/Mr.Toyota | ||
1994 | The Gentleman | Vijay | Hindi |
S.P.Parshuram | Parshuram | ||
Mugguru Monagallu | Prudhvi/Vikram/Dattatreya | Triple Role film | |
1993 | Mechanic Alludu | Ravi | |
Muta Mesthri | Subhash Chandra Bose | Winner: Filmfare Best Actor Award (Telugu) | |
1992 | Aapathbandhavudu | Madhava | Winner: Nandi Award for Best Actor |
Aaj Ka Goonda Raj | Raja | Hindi | |
Gharana Mogudu | Raju | ||
1991 | Rowdy Alludu | Johnny/Kalyan | |
Gang Leader | Rajaram | ||
Stuartpuram Police Station | Rana Prathap | ||
1990 | Raja Vikramarka | Raja Vikramarka | |
Prathibandh | Siddhanth | Hindi | |
Kodama Simham | Bharath | ||
Jagadeka Veerudu Athiloka Sundari | Raju | ||
Kondaveeti Donga | Raja | ||
1989 | Lankeshwarudu | Shankar | |
Rudranetra | Nethra | ||
State Rowdy | Kaali Charan/Prudhvi | ||
Athaku Yamudu Ammayiki Mogudu | Kalyan | ||
1988 | Yudda Bhoomi | ||
Trinetrudu | Abhimanyu | Also Producer | |
Marana Mrudangam | Janrdhan/Johnny | ||
Khaidi No.786 | Gopi | ||
Yamudiki Mogudu | Kali/Balu | ||
Rudraveena | Suryanarayana Sharma | Winner: Filmfare Best Actor Award (Telugu) | |
Manchi Donga | Veerendra | ||
1987 | Jebu Donga | Chitti Babu | |
Swayamkrushi | Sambaiah | Winner: Nandi Award for Best Actor | |
Pasivadi Pranam | Madhu | ||
Chakravarthy | Chakravarthy | ||
Aradhana | Puli Raju | ||
Donga Mogudu | Ravi Teja/Nagaraju | ||
1986 | Chanakya Shapadham | Chanakya | |
Dairyavanthudu | |||
Rakshasudu | |||
Chantabbai | Pandu Ranga Rao | ||
Veta | Raanaa Pratap Kumar Verma | ||
Magadheerudu | |||
Kondaveeti Raja | Raja | ||
Kirathakudu | Charan | ||
1985 | Vijetha | Chinnababu | |
Adavi Donga | Kalidas | ||
Raktha Sindhuram | Gandra Goddali & Inspector Gopi | ||
Puli | Kranthi | ||
Jwala | Raju | ||
Chiranjeevi | Chiranjeevi | ||
Donga | |||
Chattam Tho Poratam | Ravi Shankar | ||
1984 | Rustum | Gopi | |
Agnigundam | Vijay | ||
Naagu | Naagu | ||
Intiguttu | Vijay Kumar | Winner: Filmfare Best Actor Award (Telugu) | |
Challenge | Gandhi | ||
Mahanagaramlo Mayagadu | |||
Devanthakudu | |||
Hero | Krishna | ||
Goonda | Kalidas/Raja | ||
Allulu Vasthunnaru | |||
1983 | Sangarshana | Dilip | |
Manthri gari Viyyankudu | Babji | ||
Khaidi | Suryam | ||
Simhapoori Simham | Vijay | ||
Maa Inti Premayanam | |||
Roshagadu | Sikander | ||
Maga Maharaju | Raju | ||
Gudachari No.1 | Vijay | ||
Puli Bebbuli | |||
Shivudu Shivudu Shivudu | |||
Aalyashikaram | |||
Abhilasha | Chiranjeevi | ||
Palletoori Monagadu | |||
Prema Pichollu | Ravi | ||
1982 | Bandhalu Anubandhalu | ||
Manchu Pallaki | |||
Mondi Ghatam | Ravindra | ||
Yamakinkarudu | Vijay | ||
Billa Ranga | Billa | ||
Patnam Vachina Prativrathalu | Gopi | ||
Tingu Rangadu | Rangadu | ||
Radha My Darling | |||
Sitadevi | |||
Idi Pellantara | |||
Subhalekha | Narasimha Murthy | Winner: Filmfare Best Actor Award (Telugu) | |
Bandipotu Simham | |||
Intlo Ramayya Veedilo Krishnayya | Rajasekharam | ||
1981 | Kirayi Rowdylu | ||
Chattaniki Kallu Levu | Vijay | ||
Priya | |||
Srirasthu Subhamasthu | |||
47 Rojulu | |||
Rani Kasula Rangamma | |||
Ooriki Ichina Maata | Ramudu | ||
Nayam Kavali | Suresh Kumar | ||
Prema Natakam | Guest Appearance | ||
Tirugu Leni Manishi | |||
Todu Dongalu | |||
Paravathi Parameshwarulu | |||
Adavaalu Meeku Joharulu | |||
1980 | Rakta Sambandham | ||
Mogudu Kavali | |||
Prema Tarangalu | Kumar | ||
Love in Singapore | Suresh | ||
Thathayya Premaleelalu | |||
Kaali | |||
Nakili Manishi | Prasad / Shyam | ||
Punnami Naagu | Naagulu | ||
Mosagadu | |||
Jathara | |||
Aarani Mantalu | |||
Chandipriya | |||
Kottapeta Rowdy | Guest Appearance | ||
Agni Samskaram | |||
1979 | Kothala Raayudu | ||
Sri Rambantu | |||
Idi Katha Kaadu | |||
Poonadi Rallu | |||
I Love You | Ramesh | ||
Kotta Alludu | |||
Kukka Katuku Cheppu Debba | |||
Tayaramma Bangarayya | |||
Golimar | |||
1978 | Manavoori Pandavulu | Parthu | |
Pranam Khareedu | Narasimha |
[మార్చు] మూలాలు, వనరులు
- ↑ Devotion and Defiance in Fan Activity - S.V.Srinivas http://apache.cscsarchive.org/Hongkong_Action/docs/devotion_defiance.pdf
- ↑ idlebrain.com. A Notable Deed by Megastar. Retrieved on 3 November, 2006.
- ↑ idlebrain.com. Chiranjeevi Charitable Trust. Retrieved on 3 December, 2006.
- ↑ andhravilas.com. Chiranjeevi receives Padma Bhushan. Retrieved on 3 November, 2006.
- ↑ in.yahoo.com. Chiranjeevi receives Doctorate. Retrieved on 2 November, 2006.