చిలకమర్తి లక్ష్మీనరసింహం
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
చిలకమర్తి లక్ష్మీనరసింహం (1867 - 1946) ప్రముఖ హాస్య రచయిత. పకోడీ మీద పకోడి శతకం రచించారు. అతను విక్టోరియా మహరాణి మీద కూడా రచనలు చేసారు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు గయోపాఖ్యాన్నం అనే నాటకం రాసేరు. ఆ నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. ఈ నాటకంలో టంగుటూరి ప్రకాశం పంతులు అర్జునుడి వేషం వేసేరుట.
ఈయన రాసిన ఒక బహుళ ప్రాచుర్యమైన పద్యము
భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదుడలై ఏడ్చుచుండ తెల్లవారును గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి. లక్ష్మీనరసింహం 1867లో పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలములోని ఖండవల్లి గ్రామములో ఒక బ్రాహ్మణ కుటుంబములో వెంకన్న, రత్నమ్మ దంపతులకు జన్మించాడు. జీవితం: 1867-1946.