పశ్చిమ గోదావరి
వికీపీడియా నుండి
పశ్చిమ గోదావరి జిల్లా | |
---|---|
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ప్రాంతము: | కోస్తా |
ముఖ్య పట్టణము: | ఏలూరు |
విస్తీర్ణము: | 7,742 చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) | |
మొత్తము: | 37.96 లక్షలు |
పురుషులు: | 19.06 లక్షలు |
స్త్రీలు: | 18.9 లక్షలు |
పట్టణ: | 7.47 లక్షలు |
గ్రామీణ: | 30.48 లక్షలు |
జనసాంద్రత: | 490 / చ.కి.మీ |
జనాభా వృద్ధి: | 7.92 % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 73.95 % |
పురుషులు: | 78.43 % |
స్త్రీలు: | 69.45 % |
చూడండి: ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు |
పశ్చిమ గోదావరి, భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా. ఈ జిల్లా రాజధాని ఏలూరు. జిల్లాకు తూర్పున గోదావరి నది ప్రవహిస్తూ తూర్పు గోదావరి జిల్లాను జిల్లా నుండి వేరు చేస్తున్నది. జిల్లాకు ఉత్తరాన ఖమ్మం జిల్లా, పశ్చిమాన కృష్ణా జిల్లా, దక్షిణాన కృష్ణా జిల్లా, బంగాళాఖాతం లు సరిహద్దులుగా ఉన్నాయి. తాడేపల్లిగూడెం, జిల్లాలోని ఒక అభివృద్ధి చెందుతున్న పట్టణము. విజయవాడ నుండి 100 కి.మీ.లు మరియు ఏలూరు నుండి 50 కి.మీ.లు దూరమున ఉన్న ఈ పట్టణములో 52% అక్షరాస్యత కలదు.
విషయ సూచిక |
[మార్చు] జిల్లా విశేషాలు
అక్షరాస్యతలో హైదరాబాదు తర్వాతి స్థానం పశ్చిమగోదావరిదే. జిల్లాలో 700 కి.మీ. వైశాల్యంల గల కొల్లేరు సరస్సు ఉంది. అనేకరకాల పక్షులు అక్టోబరు - మే మాసాలలో ఇక్కడ చేరుతాయి. చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ద్వారకా తిరుమల ఏలూరు సమీపాన ఉంది. యాత్రికులకు సమస్త సౌకర్యాలున్న ఈ ఆలయంలో పెళ్ళిళ్ళు జరుగుతాయి.
జిల్లాలోని అధిక ప్రాంతం సాంద్ర వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ, వ్యావసాయికంగా ఎంతో అభివృద్ధి సాధించి, ఆంధ్ర ప్రదేశ్ ధాన్యాగారంగా ప్రసిద్ధిచెందింది. జిల్లాలో మత్స్య పరిశ్రమ కూడా బాగా అభివృద్ధి చెందింది. భీమవరం పట్టణం, రాష్ట్రంలోనే ప్రముఖ మత్స్య పరిశ్రమ వ్యాపారకేంద్రం. తణుకు లో ఆంధ్రా సుగర్స్, అక్కమాంబ టెక్స్ టైల్స్, సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్ వంటి పరిశ్రమలు కలవు.
- రెవిన్యూ డివిజన్లు (4): ఏలూరు, కొవ్వూరు, నర్సాపురం,జంగారెడ్డిగూడెం* లోక్‌సభ స్థానాలు (2): ఏలూరు, నర్సాపురం
- శాసనసభ స్థానాలు (16): ఆచంట, గోపాలపురం, పోలవరం, నర్సాపురం, ఏలూరు, పాలకొల్లు, భీమవరం, ఉండి, పెనుగొండ, తణుకు, అత్తిలి, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, దెందులూరు, కొవ్వూరు, చింతలపూడి.
- నదులు: గోదావరి నదికాక ఎర్రకాలువ ఈ జిల్లాలో ముఖ్యమైంది. దీనికి బైనేరు, పులివాగు, జిల్లేరు అనే ఉప కాలువలున్నాయి. దీనినే ఎగువభాగంలో ఎనమదుర్రు అని పిలుస్తారు.
- దర్శనీయప్రదేశాలు: ద్వారకా తిరుమల, కొవ్వూరు, పెనుగొండ, భీమవరం, అంతర్వేది.
[మార్చు] మండలాలు
భౌగోళికంగా పశ్చిమ గోదావరి జిల్లాను 46 రెవిన్యూ మండలములుగా విభజించినారు.
![]() |
||
1 జీలుగుమిల్లి | 17 నిడదవోలు | 33 ఉండి |
2 బుట్టాయగూడెం | 18 తాడేపల్లిగూడెం | 34 ఆకివీడు |
3 పోలవరం | 19 ఉంగుటూరు | 35 కాళ్ళ |
4 తాళ్ళపూడి | 20 భీమడోలు | 36 భీమవరం |
5 గోపాలపురం | 21 పెదవేగి | 37 పాలకోడేరు |
6 కొయ్యలగూడెం | 22 పెదపాడు | 38 వీరవాసరము |
7 జంగారెడ్డిగూడెం | 23 ఏలూరు | 39 పెనుమంట్ర |
8 టి.నరసాపురం | 24 దెందులూరు | 40 పెనుగొండ |
9 చింతలపూడి | 25 నిడమర్రు | 41 ఆచంట |
10 లింగపాలెం | 26 గణపవరం(ప.గో) | 42 పోడూరు |
11 కామవరపుకోట | 27 పెంటపాడు | 43 పాలకొల్లు |
12 ద్వారకా తిరుమల | 28 తణుకు | 44 యలమంచిలి |
13 నల్లజర్ల | 29 ఉండ్రాజవరం | 45 నరసాపురం |
14 దేవరపల్లి | 30 పెరవలి | 46 మొగల్తూరు |
15 చాగల్లు | 31 ఇరగవరం | |
16 కొవ్వూరు | 32 అత్తిలి |
[మార్చు] జిల్లా రూపురేఖలు మార్చిన నీలివిప్లవం
ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నాటికి పశ్చిమగోదావరి జిల్లాలో చేపల సాగుకు ప్రత్యేకమైన పద్ధతులంటూ ఏమీ లేవు. ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో విస్తరించిన గోదావరి, దక్షిణం వైపున 19.5 కిలోమీటర్ల మేర సముద్రం కొల్లేరు, ఉప్పుటేరు ప్రాంతాల్లో లభించే చేపలతోనే మత్స్యకారులు వ్యాపారం జరిపేవారు. చేపల అధికోత్పత్తి, వాణిజ్య రంగ విస్తరణకు ఎటువంటి పద్ధతులు అప్పట్లో లేవు. 1961 నాటికి జిల్లాలో తొమ్మిది మార్కెట్లే ఉండేవి. నాడు 460 టన్నుల చేపల విక్రయాలు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1969-70 మధ్య రూ. 10.25 లక్షల విలువైన 471 టన్నుల చేపలు, రూ. 1.61 లక్షల విలువ చేసే 73 టన్నుల రొయ్య అమ్మకాలు జరిగాయి. ఈ క్రమంలోనే మత్స్యపరిశ్రమపై ఆధారపడిన మత్స్యకారుల కోసం 42 ఫిషర్‌మేన్ కోఆపరేటివ్ సొసైటీలు 5805 మంది సభ్యులతో ఏర్పడ్డాయి. 1981 నాటికి ఆ సంఖ్య 61 సొసైటీలకు పెరిగింది. 1960లో బాదంపూడిలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించడంతో జిల్లాలో చేపల పెంపకం చెరువుల్లో మొదలైంది. ఇందుకోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో భీమవరం సమీపంలోని పెదఅమిరం, నర్సాపురం, కొవ్వలి, తణుకు, ఏలూరు, కొవ్వూరు తదితర చోట్ల చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు వెలిశాయి.
- 80వ దశకం నుంచి విప్లవాత్మక మార్పులు
శాస్త్రీయ పద్ధతుల్లో వాణిజ్య వ్యాపారంగా చేపల పెంపకం 1980 నుంచి ప్రారంభమైంది. తొలుత జిల్లాలో ఆకివీడు, కృష్ణా జిల్లా కైకలూరు పంట ప్రాంతాలుగా చేపల పెంపకం విస్తరించింది. ప్రారంభంలో 20 వేల ఎకరాల్లో మొదలైన ఈ సాగు 1985-86 ప్రాంతంలో వరి పంట నష్టాలకు గురవుతుండటంతో ఒకేసారి మరో 10 వేల ఎకరాలకు విస్తరించింది. భీమవరం, నిడమర్రు, గణపవరం, కాళ్ళ, ఉండి, వీరవాసరం, మొగల్తూరు, నర్సాపురంలలో చేపల చెరువులు బాగా విస్తరించాయి. ప్రధానంగా భీమవరం ప్రాంతంలో చేపల పరిశ్రమ అభివృద్ధి కోసం ఆనంద గ్రూపు-అమాల్‌గమ్ ఫిషరీస్ సంయుక్తంగా 1988లో కొత్త పద్ధతులను, ఫిష్ ప్యాకింగ్ గ్రేడింగ్ విధానాలను ప్రారంభించాయి. అప్పటి వరకు ఒక మోస్తరుగా రైళ్ళ ద్వారా చేపల ఎగుమతులు జరిగేవి. తదుపరి ప్యాకింగ్‌తో ట్రేడింగ్ విధానం ప్రారంభం కావడంతో భీమవరం చేపల ఉత్పత్తుల పెంపకానికి ప్రధాన కేంద్రంగా మారింది. అస్సాం, ఢిల్లీ, కలకత్తా తదితర ప్రాంతాలకు చేపల ఎగుమతులు ప్రారంభమయ్యాయి. తొలి రోజుల్లో 500 టన్నుల ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి.
- ప్రభుత్వ ప్రోత్సాహం
ఈ దశాబ్దంలోనే ప్రభుత్వం చేపట్టిన పథకాల వల్ల 1985 నాటికిఉప్పునీటి చేపల ఉత్పత్తి 4 వేల టన్నులు, మంచినీటి చేపల ఉత్పత్తి 10546 టన్నులకు పెరిగింది. ఏడో పంచవర్ష ప్రణాళికలో ఈ పరిశ్రమ అభివృద్ధికి చెరువుల తవ్వకం, కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు, మత్స్య క్షేత్రాలను చేపట్టారు. ఈ పథకాలకు అప్పట్లో రూ. 7.13 కోట్లు కేటాయించారు. మత్స్యకారులకు గృహాలు, పడవలు అందించారు. రూ. 1.7 కోట్లతో చేపల మార్కెట్ అభివృద్ధి సౌకర్యాల కల్పనకు వెచ్చించారు. 1990 నాటికి జిల్లాలో ఏలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, పెనుగొండ, తణుకు, పడాల, కొవ్వలి ప్రాంతాలలో 200 టన్నుల ఐస్‌ను ఉత్పత్తి చేసే 24 ఫ్యాక్టరీల ఉత్పత్తిని పెంచుతూ నెలకొల్పారు. 1990 ప్రాంతంలో మరో 50వేల చేపల చెరువులుగా మారిపోయాయి. దీంతో గ్రామాలకు గ్రామాలు హరిత విప్లవం నుంచి నీలి విప్లవం వైపు మరలాయి.
- తాజా పరిణామాలు
రెండున్నర దశాబ్దాలలో 20 వేల ఎకరాల నుంచి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల విస్తీర్ణానికి పెరిగాయి. 1990 నాటికి ప్రభుత్వం ప్రైవేటు రంగాలలో 7054 చెరువులు ఉండగా 20 వేలకు పెరిగినట్లు అంచనా. ఒక్క గణపవరం, నిడమర్రు, ఆకివీడు మండలాలలో గతంలో 35 లారీల చేపలు కలకత్తా మార్కెట్‌కు రోజూ వెళ్ళేవి. ప్రస్తుతం రోజుకి 1250 లారీల్లో చేపలు ఎగుమతి అవుతున్నాయి.
[మార్చు] బయటి లింకులు
ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు | ![]() |
---|---|
అనంతపురం | అదిలాబాదు | కడప | కరీంనగర్ | కర్నూలు | కృష్ణ | ఖమ్మం | గుంటూరు | చిత్తూరు | తూర్పు గోదావరి | నల్గొండ | నిజామాబాదు | నెల్లూరు | పశ్చిమ గోదావరి | ప్రకాశం | మహబూబ్ నగర్ | మెదక్ | రంగారెడ్డి | వరంగల్ | విజయనగరం | విశాఖపట్నం | శ్రీకాకుళం | హైదరాబాదు |