వికీపీడియా:తటస్థ దృక్కోణం
వికీపీడియా నుండి
వికీపీడియాలోని వ్యాసాలన్నీ తటస్థ దృక్కోణంతో రాయాలనేది వికీపీడియా విధానం. అన్ని ప్రముఖ దృక్కోణాలు, ప్రధానమైన చిన్న, చిన్న దృక్కోణాలను వ్యాసాలు నిస్క్పాక్షికంగా ప్రతిబింబించాలి.
వికీపీడియా సంగ్రహానికి సంబంధి మూడు ముఖ్యమైన విధానాలున్నాయి. అవి:
- తటస్థ దృక్కోణం
- పరిశోధన తాలూకు అసలు ప్రతి కాకూడదు
- నిర్ధారణకు అనుకూలంగా ఉండాలి.
ఈ మూడు విధానాలు కలిసి ఒక వ్యాసపు నాణ్యతను, వికీపీడియా ప్రమాణికతను నిర్ణయిస్తాయి. కాబట్టి వీటిని సంయుక్తంగా పరిశీలించాలి గాని, విడివిడిగా చూడరాదు. సభ్యులంతా వీటి గురించి బాగా తెలుసుకొని ఉండాలి.
[మార్చు] ఉపోద్ఘాతం
వికీపీడియాలోని వ్యాసాలన్నీ తటస్థ దృక్కోణంతో రాయాలనేది వికీపీడియా విధానం. అన్ని ప్రముఖ దృక్కోణాలు, ప్రధానమైన చిన్న, చిన్న దృక్కోణాలను వ్యాసాలు నిస్క్పాక్షికంగా ప్రతిబింబించాలి. తేలిగ్గా అపార్ధం చేసునే అవకాశం గల విధానమిది. వికీపీడియా గొప్పతనమేమిటంటే, వ్యాసాలు పక్షపాత రహితంగా ఉండేందుకు ఇక్కడి సభ్యులంతా కృషిచేస్తారు.
నిష్పాక్షికంగా రాయడానికి సాధన అవసరం. ఇది ఎలా రాయాలనే విషయమై అనుభవజ్ఞులైన సభ్యులు తమ సలహాలను ఒక పాఠంగా రాయాలని కోరుతున్నాం.
[మార్చు] తటస్థత - ప్రాధమిక భావన
వికీపీడియా లో "నిష్పాక్షికత", "తటస్థ దృక్కోణం" అనే వాటిని మామూలు అర్ధానికి భిన్నంగా, చాలా ఖచ్చితమైన అర్ధంలో వాడతాము:
- వ్యాసాలు చర్చలను నిష్పాక్షికంగా వివరించాలి గానీ, చర్చలో ఏదో ఒక పక్షం గురించి బోధించ కూడదు. ప్రజలు సాధారణంగా అంతర్గతంగా పక్షపాతం కలిగి ఉంటారు గనుక, ఇది కష్టమైన విషయమే.
-->