తాండవ నది
వికీపీడియా నుండి
తాండవ నది తూర్పు కనుమలలో పుట్టి, తునికి సమీపంలో ఉన్న పెంటకోట దగ్గర సముద్రంలో కలుస్తుంది. తుని దగ్గర ఈ నది తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలకి సరిహద్దు. ఈ నదికి కుడి ఒడ్డున తుని, ఎడమ ఒడ్డున పాయకరావుపేట.
ఈ తాండవ నదికి తరచుగా వరదలు వచ్చి తునిని ముంచేసేవి. ఇప్పుడు తునికి కొన్ని కిలోమీటర్ల ఎగువన ఆనకట్ట కట్టి ఈ వరదలని అదుపులోకి తీసుకొచ్చేరు.