Static Wikipedia February 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu

Web Analytics
Cookie Policy Terms and Conditions తుని - వికిపీడియా

తుని

వికీపీడియా నుండి

తుని మండలం
జిల్లా: తూర్పు గోదావరి
రాష్ట్రము: ఆంధ్ర ప్రదేశ్
ముఖ్య పట్టణము: తుని
గ్రామాలు: 21
జనాభా (2001 లెక్కలు)
మొత్తము: 130.414 వేలు
పురుషులు: 64.776 వేలు
స్త్రీలు: 65.638 వేలు
అక్షరాస్యత (2001 లెక్కలు)
మొత్తము: 57.46 %
పురుషులు: 63.69 %
స్త్రీలు: 51.33 %
చూడండి: తూర్పు గోదావరి జిల్లా మండలాలు

తుని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. తుని (Tuni) సమీపంలో ఉన్న తలుపులమ్మ లోవ చాల అందమైన పర్యాటక కేంద్రంగా భాసిల్లే అవకాశాలు ఉన్నాయి.


తునికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలియదు. తుని రాజులు క్షత్రియులు; వత్సవాయి వంశం.


చారిత్రకంగా తునికి కొంత కాకపోతే కొంతైనా పేరు లేకపోలేదు. చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి కాశీ యాత్ర చేసుకుని, తిరిగి వస్తూ 1890 ప్రాంతాలలో తునిలోని సత్రంలో ఆగినట్లు చెప్పుకున్నారు. ఈ సత్రవ పెద్ద బజారు నుండి రైలు స్టేషన్ కి వెళ్ళే దారిలో, జి. ఎన్. టి. రోడ్డు, మెయిన్ రోడ్డు కలుసుకున్న మొగలో ఉండేది. ఈ జి. ఎన్. టి. రోడ్డు మీద, విశాఖపట్నంకి, రాజమండ్రి కి నడిమధ్యలో ఉంది తుని. మెడ్రాసు-హౌరా రైలు మార్గం కూడ తుని మీదుగానే వెళుతుంది.


అల్లూరి సీతారామరాజు, 1911 ప్రాంతాలలో, తునిలో తన మావయ్య గారి ఇంట ఉండి, విశాఖపట్నంలో ఉన్న మిసెస్ ఎ. వి. ఎన్. కాలేజీ కి అనుబంధంగా ఉన్న ఉన్నత పాఠశాలలో చదువు ప్రారంభించి, పూర్తి కాకుండానే ఆపు చేసేరని ఒక కథనం ఉంది. తునిలో రాజా వారి ఉన్నత పాఠశాల ఉండగా ఈయన విశాఖ లోని కళాశాలకి అనుబంధించిన పాఠశాలకి ఎందుకు వెళ్ళేరో తెలియదు. ఈ రోజులలోనే ఈయనకి నరిశీపట్నం, చింతపల్లి, మొదలైన మన్యపు ప్రాంతాలతో పరిచయం అయి ఉంటుంది. తర్వాత 1929 లో సీతారామరాజు దండు అడ్డతీగెల, రంపచోడవరం, చింతపల్లి, అన్నవరం, తుని పోలీసు స్టేషన్‌ల పై దాడి చేసి బ్రిటిష్ వాళ్ళని అల్లరి పెట్టేసేరు. ఏజన్సీ ప్రాంతాలలో పండిన చింతపండు, అడ్డాకులు, కుంకుడు కాయలు, కొండ చీపుళ్ళు మొదలైన వాటితో పాటు చెరకు బెల్లం, ఖద్దరు, తమలపాకులు, మామిడి పళ్ళు ఆదివారం సంతలో సరసమైన ధరలకి దొరికేవి.


ఈ సంత సత్రవ కి ఎదురుగా ఉన్న బయలులో తాండవ నదికి కుడి ఒడ్డున జరిగేది. ఎడమ ఒడ్డున పాయకరావు పేట. తుని తూర్పు గోదావరి జిల్లా లోను, పాయకరావు పేట విశాఖపట్నం జిల్లా లోను ఉన్నప్పటికి, ఈ రెండూ జంట ఊళ్ళు. పాత రోజుల్లో, విశాఖపట్నం నుండి వచ్చే బస్సులు నది దాటి ఇటు వచ్చేవి కావు; కాకినాడ నుండి వచ్చే బస్సులు అటు పోయేవి కావు. కాకినాడ నుండి వైజాగు బస్సులో వెళ్ళాలంటే తునిలో బస్సు దిగి, తుని నుండి పాయకరావు పేటకి బండి కట్టించుకుని, అక్కడ వైజాగు బస్సు పట్టుకోవాల్సి వచ్చేది. పాయకరావుపేట లోనే సుప్రసిద్ధ ఘట వాయిద్యుడు కోలంక వెంకటరాజు ఉండేవారు. ఈయనే ఘట వాయిద్యం కనిపెట్టేరని అంటారు. ద్వారం వెంకటస్వామినాయుడు కచేరీలలో పక్క వాయిద్యం వాయించేవారు.


రైలు కట్టకి ఇవతలి వైపు తాలుకా ఆఫీసు, సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసు, పోలీసు స్టేషను – అవతలి వైపు మాలపల్లె. ఈ మాలపల్లెలో 2001 ప్రాంతాలలో బ్రహ్మాండమైన చర్చి ఒకటి కట్టేరు. పూర్తి అయే నాటికి తునిలోని పెద్ద భవనాలలో ఒకటిగా ఇది పరిగణించబడవచ్చు. అంతే కాకుండా స్థాపత్య దృష్ట్యా ఈ చర్చి చాల అధునాతనంగా కనిపించింది. దరిద్ర నారాయణుడు తాండవిస్తూన్న ఆ మాలపల్లెలో ఈ అధునాతనమైన భవనం ఒక అపశృతిలా అనిపించింది. ఎక్కడ నుండి వస్తున్నాదో ఈ డబ్బు? క్రైస్తవ మత ప్రచారకులు డాలర్లు గుమ్మరిస్తున్నారట.


దేశంలో దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు నిర్మించడానికి డబ్బు దొరుకుతుంది గాని, ఏ అనాధ ఆశ్రమమో, ఆసుపత్రో, పాఠశాలో కట్టించడానికి దొరకదు. కనీసం ఆ డబ్బు పెట్టి ఒక పార్కో, ఒక ఉద్యానవనమో కట్టి పర్యావరణ పారిశుద్ధ్యానికి దోహదం చెయ్య వలసింది. ఆ మాటకొస్తే తునిలో రాజులు, కోమట్లే నయం – పాఠశాలలు కట్టి ప్రజోపకారమైన ఖర్చులు పెట్టేరు.


తునిలో వైశ్యులు ధనవంతులు, పౌర భాధ్యతలు తెలుసున్న వాళ్ళే కాకుండా తెలివైన వాళ్ళు కూడా. ఎందుకంటే డబ్బు గణించడానికి కూడ తెలివి కావాలి కదా. తుని కోమట్ల లక్ష్యం ఏదో వర్తకం చేసుకోవటం, నాలుగు రాళ్ళు మిగుల్చుకోవటం. అంతే కాని అత్తా కోడళ్ళ తగువులలో, లాభం లేని వ్యాపారాలలో తల దూర్చటం కాదు. కాని తన ఇష్టా ఇష్టాలతో నిమిత్తం లేకుండా తునిలో ఒక సెట్టి గారు చిన్న ఇబ్బందిలో ఇరుక్కున్నారు – పురాణ కాలం లో! ఎప్పుడో ఒక నాడు జ్యెష్ఠా దేవి (పెద్దమ్మ), లక్ష్మీ దేవి (చిన్నమ్మ) “నేను బాగుంటానంటే నేను బాగుంటాను” అని రివాజుగా తగువాడుకున్నారుట. తగువాడుకుని, మరెక్కడా ఊళ్ళే లేనట్టు, తునిలో సెట్టి గారింటికి తగువు తీర్చమని వచ్చేరుట. సెట్టి గారి గొంతుకలో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఎటు తీర్పు చెప్పినా చిక్కే! ఆలోచించి, “అమ్మా, చిన్నమ్మా! నువ్వలా లోపలికి వస్తూంటే బాగున్నావు. చూడు జ్యెష్టమ్మా! నువ్వు అలా బయటకి వెళుతూంటే బాగున్నావు,” అని తీర్పు చెప్పేరుట. తెలుగు భాషలో ‘తుని తగువు తీర్చినట్లు’ అన్న జాతీయానికి వెనకనున్న గాథ ఇది. ఇలా కర్ర విరగకుండా, పాము చావకుండా మాట్లాడే చాకచక్యం తుని వర్తకులకే ఉందని చెబుతారు.


తునిలో ఉంటూ, తుని ఉప్పు తింటూ, “తుని పాపభూమి!” అనే వారు కొందరు. దీనిని సమర్ధిస్తూ రెండు ఉదాహరణలు.


తుని ఊరి బయట బోడి మెట్ట అనే కొండ ఉండేది (ఇప్పుడు లేదు). ఈ మెట్ట మీద సీతామ్మవారి పాదం, మాయలేడి డెక్కల గుర్తులు ఉండేవి. ఈ బోడి మెట్ట మీద, ఒక రాయి మీద, ఒక సారి ఒక బాల యోగి వెలిసేడు - పూర్వాశ్రమంలో రైలు స్టేషన్ లో మసాలా గార్లు అమ్ముకుని బతికే కుర్రాడు. ఆ బాలయోగి కోసం కొండ మీద గుడి కట్టేరు. భక్తులు పాలు, పండ్లు పట్టికెళ్ళి రివాజుగా యోగికి ఇచ్చే వారు. దరిమిలా ఆ బాలయోగి – కొంచెం కండ పట్టిన తర్వాత – గుడి వదలి పెట్టి మళ్ళా ప్రజలలో కలిసిపోయేడు. స్టేషన్ లో మసాలా గార్లు అమ్మే ‘స్లాటు’ మరెవ్వరో తీసేసుకున్నారుట. బస్సు స్టేండు లోతేలేడు – గార్ల జంగిడి తో! “ముమ్మడివరంలో బాలయోగి నిలిచేడు; తునిలో నిలవలేక పోయేడు. తుని పాపభూమి కాక మరేమిటి?” అనే వారు.


ఇప్పుడు ఈ బోడి మెట్ట ని పూర్తిగా తవ్వేసి నేల మట్టం చేసేసేరు. పర్యావరణ రక్షణ దృష్ట్యా ఇది కూడ పాపిష్టి పనే!


బోడి మెట్ట వెనకాతల కొంచెం ఎత్తయిన కొండ మరొకటి ఉండి. అదే ఏనుగు కొండ. ఈ కొండని సగం పైకి ఎక్కితే చాలు ఏడు మైళ్ళ దూరంలో, పెంటకోట దగ్గర ఉన్న సముద్రం – నీలంపాటి చారలా కనిపించేది.


ఈ పెంటకోట లో సముద్రపుటొడ్డున ఒక విరిగిపోయిన లైట్‌హౌస్ ఉండేది. ఒకానొకప్పుడు పెంటకోటకి పడవలు వచ్చేవిట. తునిలో వర్తకులు ఈ పడవలలో పంచదార బస్తాలు వేసి ఎగుమతి చేసేవారట. (అప్పటికి ఏటికొప్పాకలో పంచదార ఫేక్టరీ ఉండేదో, లేకపోతే ఈ పంచదార ఎక్కడ నుండి వచ్చేదో చెప్పటం కష్టం.) ఒక సారి ఒక వర్తకుడు పేరాశతో వంద పంచదార బస్తాల “ఆర్డర్” లో తొంభై పంచదార బస్తాలతో పాటు పది ఇసక బస్తాలు కూడ వేసేడుట. (పప్పుల లోను, బియ్యం లోను రాళ్ళు, కారపు గుండలో ఇటికల పొడి కలిపే పద్ధతి కూడ ఈ వర్తకుడే కనిపెట్టి వుంటాడని అనే వారు.) ఆ దెబ్బకి తునిలో వర్తకుల మీద నమ్మకం పోయి, క్రమేపీ పెంటకోటకి పడవలు రావటం మనేసేయిట. దానితో దీపస్థంబం అవసరం పోయి శిధిలమై పోయిందిట. ఈ కథని అక్షరాలా నమ్మడానికి సాక్ష్యాధారాలు లేవు. "తుని పాపభూమి అనటానికి ఇది మరొక సాక్ష్యం” అని ఎవ్వరైనా అన్నప్పుడల్లా నా గుండె చెరువైపోయేది.


తునిలో రెండు చెరువులు ఉండేవి – బాడవ తోటలో రాజు గారి కోటకి ఆనుకుని ఉన్న పాత కాలపు జలకాలాడే కొలనుని మినహాయిస్తే. ఒకటి పోలీసు నూతికి ఎదురుగా ఉన్న చిన్న కోనేరు. రెండు ఊరు బైట, కొత్తపేట నుండి సూరవరం వెళ్ళే దారిలో ఉన్న లక్షిందేవి చెరువు. ఈ చెరువు గట్టు మీద ఇటికలతో కట్టిన పెద్ద పెద్ద కుండీలు మూడో, నాలుగో ఉండేవి. ఒకొక్క కుండీ 20 అడుగులు పొడుగు, 20 అడుగులు వెడల్పు, పది అడుగుల లోతు ఉండేవని ఇప్పుడు అంచనా వేస్తున్నాను. ఈ కుండీలు ఒక నీలిమందు కర్మాగారపు అవశేషాలుట. నీలి మొక్క (లేదా నీలిగోరింట, లేదా మధుపర్ణిక) అనే మొక్క రసం నుండి తయారు చేసేవారుట – ఈ నీలిమందుని. ఈ నీలిమందు వాడకం ఎప్పటినుండి మన దేశం లో ఉండేదో తెలియదు కాని, బ్రిటిష్ వాళ్ళ హయాం లో ఇది ఒక లాభసాటి వ్యాపారంగా మారింది. కనుక ఈ కుండీలు సా. శ. 1800 ప్రాంతాలలో ఎప్పుడో కట్టి ఉంటారు. కాని 1880 లో జెర్మనీలో ఏడాల్ఫ్ బేయర్ అనే ఆసామీ నీలిమందుని కృత్రిమంగా – అంటే నీలిమొక్కల ప్రమేయం లేకుండా – చెయ్యటం కనిపెట్టేడు. అది సంధాన రసాయనానికి స్వర్ణయుగం అయితే, నీలిమందు పండించి పొట్ట పోసుకునే పేద రైతులకి గడ్డు యుగం అయింది. ఏడాల్ఫ్ బేయర్ ధర్మమా అని భారత దేశంలో నీలి మొక్కల గిరాకీ అకస్మాత్తుగా పడిపోయింది. తర్వాత లక్షిందేవి చెరువు దగ్గర కర్మాగారం ఖాళీ అయిపోయింది. తర్వాత వాడుక లేక శిధిలమై కూలిపోయింది.


నీలి మొక్కలు తుని నుండి తలుపులమ్మ లోవ కి వెళ్ళే దారి పొడుక్కీ పుంత పక్కని పెరిగేవి. ఈ తలుపులమ్మ లోవలో దొరికినన్ని “బొటానికల్ నమూనాలు” ఆంధ్రదేశంలో మరెక్కడా దొరకవని అనేవారు. అందుకనే విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి, కాకినాడ పి. ఆర్. కాలేజి నుండి బోటని విద్యార్ధులు తరచు ‘ఫీల్డ్ ట్రిప్పు’ కని ఇక్కడకి వచ్చేవారు. ఇప్పుడంటే బస్సులు వేసేరు కాని పూర్వం తలుపులమ్మ లోవకి వెళ్ళటం అంటే ఎవరెస్టు శిఖరం ఎక్కినంత ఘన కార్యంగా భావించేవారు. ఈ లోయలో ఒక ఝరీపాతం ఉంది. ఆ రోజులలో ఈ ఝరీపాతం లోని నీళ్ళు కొబ్బరి నీళ్ళల్లా తియ్యగా ఉండేవి. ఈ సెలయేరుకి ఇటు అటు ఎన్నో రకాల జాతుల మొక్కలు ఉండేవి. పర్యాటకులని ఆకర్షించటానికి అనువుగా తీర్చిదిద్దవలసిన సుందరమైన ప్రదేశం ఇది.


భోజనం విషయంలో కూడ తుని పర్యాటకులని బాగానే ఆకర్షించిందని చెప్పవచ్చు. ఆవిరి యంత్రాలు ఇంకా బాగా చలామణీలో ఉన్న రోజులలో నీళ్ళు తాగడానికి తునిలో ప్రతి రైలు బండి విధిగా కనీసం పదిహేను నిమిషాలు ఆగవలసి వచ్చేది. అంతే కాకుండా మెడ్రాసు మెయిలు (2 అప్), హౌరా మెయిలు (1 డౌన్), రెండూ మధ్యాహ్నం భోజనాల వేళకి తునిలో ఆగేవి. అలాగే సాయంకాలం భోజనాల వేళకి నైన్ డౌన్, టెన్ అప్ ఆగేవి. ఒక్క మొదటి తరగతి ప్రయాణీకులకి తప్ప భోజనం రైలు పెట్టెలోకే సరఫరా అయే సదుపాయం ఆ రోజులలో ఉండేది కాదు. కనుక తుని ‘మీల్స్ హాల్ట్’. తునిలో భోజనం బాగుండేదని ఉత్తరాది వారు, దక్షిణాది వారు కూడ చెప్పేవారు.


భోజనం తర్వాత కిళ్ళీకి కూడ తుని ప్రసిద్ధమే. తుని దగ్గర, లకారసామి కొండ దిగువున, రాంభద్రపురం పక్కన సత్యవరం అనే పల్లెటూరు ఉంది. ఆ ఊరు మట్టిలో ఏమి ఉందో కాని అక్కడ పెరిగే తమలపాకుల రుచి ఇంతా అంతా కాదు. దేశం అంతా ప్రసిద్ధి. విజయనగరం తమలపాకులు అరిటాకుల్లా ఉండేవి. తుని ఆకుల్లో కవటాకులు నోట్లో వేసుకుంటే ఇలా కరిగి పోయేవి. తుని తమలపాకులు లేకపోతే కాకినాడలో నూర్జహాన్ కిళ్ళీ ఉండేదే కాదు. హొటల్లో భోజనం చేసి, కోటయ్య కొట్లో కాజా కొనుక్కు తిని, తర్వాత నూర్జహాన్ కిళ్ళీ వేసుకుని సినిమాకి వెళ్ళటం అంటే పాత రోజులలో ఒక లగ్జరీ.


తునిలో ఉండే మరొక లగ్జరీ మామిడి పళ్ళు. వీటిలో కొన్ని రకాలు: చెరకు రసం, పెద్ద రసం, చిన్న రసం, నూజివీడు రసం (లేక తురక మామిడి పండు), పంచదార కలశ, నీలం, కోలంగోవ, ఏండ్రాసు, సువర్ణరేఖ, బంగినపల్లి, కలెక్టరు, జహంగీరు.


మామిడి పళ్ళతో పాటు తుని నుండి ఎగుమతి అయే వస్తువులు ముఖ్యంగా బెల్లం, తమలపాకులు, చేనేత బట్టలు. స్టేషన్ లో గుడ్స్ షెడ్డులో నిలువెత్తు పేర్చి ఉండేవి ఈ సరుకులు.


తుని స్టేషను నుండి బయలుదేరి, రైలు కట్ట వెంబడి నడచి తాండవ నది మీద ఉన్న రైలు వంతెనని దాటుకుని పాయకరావుపేట వైపు వెళితే, అక్కడ ఎడం పక్కని ఒక పెద్ద బియ్యపు మిల్లు, దాని పక్కని కొండంత ఎత్తున, పిరమిడ్ లా ఒక ఊక పోగు, వీటికి వెనక ఒక పెద్ద మేడ కనిపిస్తాయి. ఊక అమ్మి ఆ మేడ కట్టేరని మా ఊళ్ళో ఒక వదంతి ఉంది. అందుకని దానిని ఊక మేడ అనేవారు. ఎందుకూ పనికిరాదనుకునే ఊకని పేడతో కలిపి పిడకలు చెయ్యవచ్చనీ, ఇటిక ఆవాలలో వేసి కాల్చ వచ్చనీ, కాలిన ఊక నుసితో పండ్ల పొడి చెయ్యవచ్చనీ గమనించి, అటువంటి “పనికిమాలిన” ఊకని అమ్మి మేడలు కట్టగలిగే చాకచక్యం మా ఊరి వర్తకులకి ఉందనిన్నీ అప్పుడు తెలిసింది.


స్టేషన్‌కి ఎదురుగా ఉన్న కిళ్ళీ బడ్డీ దగ్గర గోలీ సోడా తాగి, ఆ పక్కనే ఉన్న రీడింగ్ రూం కి వెళ్ళి పేపరు చదవటం చాలమందికి దైనందిన కార్యక్రమాలలో ఒకటిగా ఉండేది. రీడింగ్ రూము అంటే లైబ్రరి కాదు. ఇరవై అడుగులు పొడుగున్న ఒక పెద్ద గది, ఆ గది నిండుగా ఈ కొస నుండి ఆ కొసకి ఒక పొడుగాటి బల్ల, దానికి రెండు వైపులా కుర్చీలు. బల్ల మీద రెండో మూడో ఇంగ్లీషు దిన పత్రికలు, ఒకటో, రెండో తెలుగు దిన పత్రికలు, ఏదో నామకః వారపత్రికలు, ఉండేవి. వాటి కోసం గది ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండేది. ఎనాటమీ లేబులో శవాన్ని కోసినట్లు, పేపరుని ఏ కీలుకా కీలు విడగొట్టేసి, తలో మూలకీ పట్టుకు పోయి చదువుకునే వారు. ముందు పేజీ ఒకడు నిలబడి చదువుతూ ఉంటే, దాని వెనక పేజీ మరొకడు ఒంగుని చదివే వాడు.


ఈ గది పక్కగా చిన్న కొట్టు. అందులో ఒక రేడియో ఉండేది. ఆ రేడియోనే బయట అరుగు మీద ఉన్న లవుడ్ స్పీకర్ కి తగిలించేవారు. సాయంకాలం ఐదింటికి వార్తలు, ఆ తర్వాత సంగీతం పెట్టేవారు. తునిలో ఉన్న సామాన్య జనసందోహానికి అదొక్కటే రేడియో. రీడింగ్ రూము బయట అరుగు మీద ఎప్పుడూ ఎవ్వరో ఒకరు చదరంగం ఆడుతూ ఉండేవారు. ఆడేవాళ్ళు ఇద్దరు, చూసే వారు, సలహాలు ఇచ్చేవారు పది మంది! అరిగిపోయిన ఆ చదరంగం బల్ల మీద గళ్ళు కనిపించేవే కావు.


ఈ అరుగుకి ఎదురుగా కొంత ఖాళీ స్థలం ఉండేది. ఆ స్థలంలో సిమెంటుతో కట్టిన ఒక వేదిక, జెండా ఎగరెయ్యడానికి ఒక స్థంబం. ఒక సారి తెన్నేటి విశ్వనాధం గారు ప్రజాపార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఈ వేదిక మీద నిలబడి ప్రసంగించేరు. విశ్వనాధం గారు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి ప్రియ సహాధ్యాయి, శిష్యుడు, రాజకీయ వారసుడూను. కాంగ్రెస్ పార్టీ మీద, జవాహర్‌లాల్ నెహ్రు పరిపాలనా దక్షత మీద విరక్తి పుట్టి ప్రజాపార్టీని స్థాపించేరు. ఆ సందర్భం లో "కాంగ్రెస్ పార్టి మండోదరి శరీరంలా చివికి పోయింది. ఇది మరమ్మత్తు చేస్తే బాగుపడేది కాదు. అందుకని దీని స్థానంలో మరొక కొత్త పార్టీని స్థాపించేం” అని అంటూ మండోదరి కథ చెప్పుకొచ్చేరు.


[మార్చు] మండలంలోని గ్రామాలు

[మార్చు] తూర్పు గోదావరి జిల్లా మండలాలు

మారేడుమిల్లి - వై.రామవరం - అడ్డతీగల - రాజవొమ్మంగి - కోటనందూరు - తుని - తొండంగి - గొల్లప్రోలు - శంఖవరం - ప్రత్తిపాడు - ఏలేశ్వరం - గంగవరం - రంపచోడవరం - దేవీపట్నం - సీతానగరం - కోరుకొండ - గోకవరం - జగ్గంపేట - కిర్లంపూడి - పెద్దాపురం - పిఠాపురం - కొత్తపల్లె - కాకినాడ(గ్రామీణ) - కాకినాడ (పట్టణ) - సామర్లకోట - రంగంపేట - గండేపల్లి - రాజానగరం - రాజమండ్రి (గ్రామీణ) - రాజమండ్రి (పట్టణ) - కడియం - మండపేట - అనపర్తి - బిక్కవోలు - పెదపూడి - కరప - తాళ్ళరేవు - కాజులూరు - రామచంద్రాపురం - రాయవరం - కపిలేశ్వరపురం - ఆలమూరు - ఆత్రేయపురం - రావులపాలెం - పామర్రు - కొత్తపేట - పి.గన్నవరం - అంబాజీపేట - ఐనవిల్లి - ముమ్మిడివరం - ఐ.పోలవరం - కాట్రేనికోన - ఉప్పలగుప్తం - అమలాపురం - అల్లవరం - మామిడికుదురు - రాజోలు - మలికిపురం - సఖినేటిపల్లి

Static Wikipedia 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2006 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu