దిరుసుమర్రు
వికీపీడియా నుండి
దిరుసుమర్రు, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం మండలానికి చెందిన గ్రామము[[దిరుసుమర్రు గ్రామ ప్రధాన విశేషములు.]]
దిరుసుమర్రు గ్రామము భీమవరం మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము భీమవరం – మొగల్తూరు రహదారి యందు భీమవరం పట్టణము నుండి సుమారు 7 కి.మీ. దూరమున కలదు. ప్రధాన రహదారి నుండి గ్రామము సుమారు 5 కి.మీ లోపలకు కలదు. గ్రామప్రారంభమున శ్రీ ప్రసన్న ఆంఙనేయ స్వామి వారి ఆలయం కలదు. ఈ ప్రసన్న ఆంఙనేయ స్వామి గ్రామమును అన్ని ఆపదల నుండి కాపాడునని గ్రామస్ధుల విశ్వాసము. ప్రతి ఏడాది ముక్కోటి ఏకాదశి నుండి 9 రోజులు పాటు ఈ ఆంఙనేయ స్వామి ఉత్సవములు గ్రామస్ధులు ఘనముగా నిర్వహించెదరు. గ్రామప్రారంభముననే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలదు. చుట్టుప్రక్కల గ్రామములకు యిదియే ఉన్నత పాఠశాల. గ్రామప్రారంభమున కల సుమారు 1.5 కి.మీ.ల ప్రాంతమును సింగరాఙుపాలెం అని అందురు. ఈ సింగరాఙుపాలెమునందు శ్రీరామాలయం కలదు. ప్రతి ఏడాది శ్రీరామనవమి నాడు శ్రీసీతారాముల కళ్యాణమును గ్రామస్ధులు ఘనముగా నిర్వహించెదరు. గ్రామప్రారంభమునుండి సుమారు 3.5 కి.మీ లోపల ఒక పురాతన శివాలయం కలదు. ఈ శివాలయమునందు ప్రత్యేకత గంగాదేవి ఆలయం శివుని ఆలయం పైభాగమున మొదటి అంతస్తు యందు ఉండుట. భక్తులు మొదట శివపార్వతులను దర్శించి ఆ పైన మొదటి అంతస్తు యందున్న గంగాదేవిని దర్శించి తరించెదరు. ఇచట ప్రతి ఏడాది ఙరుగు శివరాత్రి ఉత్సవములకు చుట్టుప్రక్కల గ్రామములనుండు కూడా ప్రఙలు వచ్చెదరు.
[[దిరుసుమర్రు గ్రామమునకు చేరుట]]
భీమవరం పట్టణము యందున్న పాతబస్టాండు మరియు ఆదివారం బఙారు నుండి దిరుసుమర్రు గ్రామమునకు ప్రైవేటు బస్సు సౌకర్యము మరియు ఆటో సౌకర్యము కలదు. ఆర్.టి.సి. బస్సులు కొన్నిసార్లు ఉండును. ఆటో సౌకర్యము ఆర్.టి.సి బస్టాండు నుండి మరియు భీమవరం పట్టణ టౌన్ రైల్వే స్టేషన్ నుండి కలదు.
[[దిరుసుమర్రు గ్రామమునుండి వచ్చిన ప్రముఖులు(పూరించవలెను)]]
1. పద్మశ్రీ బి.వి.రాఙు గారు.
[[దిరుసుమర్రు గ్రామ ఇతర వివరములు(పూరించవలెను)]]
జనాభా గ్రామ సర్పంచ్ ఎం.పి.టి.సి. ప్రధాన ఉపాధ్యాయుడు
[[దిరుసుమర్రు గ్రామము నందు ప్రధాన వృత్తులు]] 1. వ్యవసాయము
ప్రధాన పంట వరి. నీటి పారుదల వ్యవస్ధ చక్కగా ఉండుటచే రబీ మరియు ఖరీఫ్ లందు రైతులు వరినే పండించెదరు.
2. ఆక్వా కల్చర్
వరి తర్వాత ఆక్వా కల్చర్ రెండవ ప్రధాన వృత్తి. ఆక్వా కల్చర్ ప్రధానముగా చేపల మరియు రొయ్యల చెరువులలో సాగు చేయబడును.
ఈ వ్యాసము శ్రీనివాస ఫణి, దిరుసుమర్రు చే వ్రాయబడినది. దిరుసుమర్రు గ్రామ పౌరులు ఏవరైననూ ఈ వ్యాసమును సరిచేయవచ్చు. పొరపాటులకు చింతించుచున్నాను.