నూతన్ ప్రసాద్
వికీపీడియా నుండి
నూటొక్క జిల్లాల అందగాడుగా ప్రసిద్ధి చెందిన నూతన్ ప్రసాద్ అసలు పేరు వరప్రసాద్. 1970వ మరియు 80వ దశకములో తెలుగు సినిమా రంగములో అలరారిన హాస్య నటుడు.
1973 లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు సినిమాతో ఈయన చిత్రరంగ ప్రవేశము చేశాడు. ఆ తరువాత నీడలేని ఆడది మొదలైన సిమాలలో నటించినా, ఈయనకు తొలి గుర్తింపు ముత్యాల ముగ్గు సినిమాలో రావుగోపాలరావు తో పాటు ప్రతినాయకునిగా నటించడముతో వచ్చినది. ఈ చిత్రము విజయముతో తదుపరి అనేక సినిమాలలో విలన్ పాత్రలు వచ్చాయి. అవన్నీ ఈయన తనదైన శైలిలో పోషించాడు. ఈయన యొక్క విభిన్న డైలాగు డెలివరీ విలనిజానికి ఒక హాస్యవన్నె తెచ్చింది. ఈయన అనేక సినిమాలలో అగ్ర నటులైన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ, చిరంజీవి సరసన కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మొదలైన విభిన్న పాత్రలు పోషించాడు. ఒక సినిమాలో కథానాయకునిగా కూడా నటించాడు.
నూతన్ ప్రసాద్ శైతాన్ గా నటించిన రాజాధిరాజు చిత్రముతో ఈయన నట జీవితము తారాస్థాయికి చేరుకొన్నది. చిత్రములో ఈయన నటన చాలా ప్రాచుర్యము పొందినది.