మధుబాబు
వికీపీడియా నుండి
మధుబాబు తెలుగు నవలా రచయిత, డిటెక్టివ్ నవలలు రాస్తూ ఉంటారు. షాడో వీరి నవలలో సాధారణంగా హీరో, కొన్ని నవలలలో వాత్సవ్, కూడా హీరోగా చేసి రాస్తూ ఉంటారు. ఈయన రచనా శైలిలో ఒక ప్రత్యేకత ఉన్నది, ఏ విషయాన్ని రచయతగా చెప్పరు, దానిని కథ లోని పాత్రలు మాట్లాడుకునేటట్లు చేస్తారు.
విజయవాడకు చెందిన ఈయన 60 కి పైగా నవలలను షాడో కధానాయకునిగా ప్రచురించాడు. ఈయన నవలలు ప్రాచుర్యము పొందడానికి పాత్రలలోని మానవీయత మరియు హాస్యమేనని పాఠకులు భావిస్తారు. ప్రారంభదశలో మధుబాబు నవలలు మద్రాసులోని ఎం.వీ.ఎస్ పబ్లికేషన్స్ ప్రచురించినది. ఆ తరువాత ఈయన మధుబాబు పబ్లికేషన్స్ పేరుతో సొంత ప్రచురణాలయము ప్రారంభించారు.
మధుబాబును అనుకరిస్తూ మధురబాబు, శ్రీ మధుబాబు వంటి రచయితలు వెలశారు.