New Immissions/Updates:
boundless - educate - edutalab - empatico - es-ebooks - es16 - fr16 - fsfiles - hesperian - solidaria - wikipediaforschools
- wikipediaforschoolses - wikipediaforschoolsfr - wikipediaforschoolspt - worldmap -

See also: Liber Liber - Libro Parlato - Liber Musica  - Manuzio -  Liber Liber ISO Files - Alphabetical Order - Multivolume ZIP Complete Archive - PDF Files - OGG Music Files -

PROJECT GUTENBERG HTML: Volume I - Volume II - Volume III - Volume IV - Volume V - Volume VI - Volume VII - Volume VIII - Volume IX

Ascolta ""Volevo solo fare un audiolibro"" su Spreaker.
CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
విజయవాడ - వికిపీడియా

విజయవాడ

వికీపీడియా నుండి

విజయవాడలోని ప్రకాశం బ్యారేజి
విజయవాడలోని ప్రకాశం బ్యారేజి
కృష్ణా జిల్లాలో విజయవాడ పట్టణ ప్రాంటం ఉన్న ప్రదేశమును చూపిస్తున్న పటము
కృష్ణా జిల్లాలో విజయవాడ పట్టణ ప్రాంటం ఉన్న ప్రదేశమును చూపిస్తున్న పటము

విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మూడవ అతిపెద్ద నగరము. కృష్ణా జిల్లా లో, కృష్ణా నది ఒడ్డునే ఉన్న ఈ నగరం ఆంధ్ర కోస్తా ప్రాంతంలో ప్రసిద్ధ వ్యాపారకేంద్రం. మద్రాసు-హౌరా మరియు మద్రాసు-ఢిల్లీ రైలు మార్గములలో విజయవాడ వస్తుంది. దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ అతి పెద్ద కూడలి. భారత దేశం లోని అతిపెద్ద రైల్వే జంక్షన్లలో ఇది ఒకటి. విజయవాడను బెజవాడ అని కూడా పిలుస్తారు. విజయవాడకు ప్రస్తుత నామము, ఇక్కడి అధిష్టాన దేవత కనక దుర్గ ఆమ్మవారి మరో పేరు అయిన విజయ (విజయవాటిక) నుండి వచ్చింది. ఇక్కడ ఉన్న అనేక కార్పొరేటు విద్యాసంస్థల వలన దీనికి విద్యలవాడ అనే పేరు కూడా వచ్చింది. ఎండాకాలములో మండిపోయే ఇక్కడి ఎండలను చూసి కట్టమంచి రామలింగారెడ్డి ఇది బెజవాడ కాదు బ్లేజువాడ అన్నాడట.


విజయవాడ, పడమరన ఇంద్రకీలాద్రి పర్వతములతో, ఉత్తరాన బుడమేరు నదితో కృష్ణా నది ఒడ్డున ఉంటుంది. రాజధాని హైదరాబాదుకు 275 కి.మీ. దూరములో కృష్ణా జిల్లాలో 58 చదరపు కి.మీ. విస్తీర్ణములో ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం విజయవాడ జనాభా 825,436. అంతేకాదు విజయవాడ కృష్ణా జిల్లాకు వర్తక/వాణిజ్య రాజధాని.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

నాగార్జున సాగరు నుండి మచిలీపట్నము వరకు గల కృష్ణా పరివాహక ప్రాంతములలో రాతి యుగపు మానవుల సంచారము యొక్క ఆనవాళ్ళు లభించడం వలన, ఇక్కడ ప్రాచీన మానవులు నివశించారని భావిస్తున్నారు.

అర్జునుడు వేటగాని రూపములో ఉన్న శివుడిపై సాధించిన విజయానికి చిహ్నముగా ఇక్కడ విజయేశ్వరుడి (మల్లేశ్వర స్వామి లేదా జయసేనుడు)ని ప్రతిష్టించాడని పురాణగాథ. పురాణాలలో విజయవాడను విజయవాత అని పెలిచేవారు. దీని గురించి రాజేంద్రచోళ పురాణములో కూడా పేర్కొన్నారు.

హిందువులకు మరియు బౌద్ధులకు విజయవాడ ఒక ముఖ్య ఆధ్యాత్మిక స్థలము. కళ్యాణి చాళుక్యులు ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించారు. కీ.శ. 638 సంవత్సరములో ఇక్కడ బౌధ్ధమతము బాగా ప్రాచుర్యములో ఉన్నప్పుడు చైనా దేశపు యాత్రికుడైన సుఆన్ సాంగ్ (Hsuan-tsang) ఈ ప్రాంతాన్ని దర్శించాడు.


బ్రిటీషువారు పరిపాలిస్తున్న రోజులలో ఈ ప్రాంతము చాలా అభివృద్ధిని చవిచూసింది. వారి కాలంలో కృష్ణానదిపై ఇక్కడ ఆనకట్టను నిర్మించారు. దానితో వ్యవసాయాభివృద్ధి జరిగి, తద్వారా విజయవాడ పట్టణం కూడా ఎంతో అభివృద్ధి చెందింది.

[మార్చు] విజయవాడకు ఆ పేరు ఎలా వచ్చింది?

విజయవాడకు ఆ పేరు రావటం వెనుక ఒక కధ ఉంది. ఆ కధ ఇలా సాగుతుంది: పాండవులు వనవాసం చేస్తూ అడవులలో తిరుగుతూ దారుక వనానికి వచ్చినప్పుడు, వారిని వేదవ్యాసుడు కలిసి, వారిలో ఒకరిని తపస్సు చేసి శివుడిని మెప్పించి పాశుపతాస్త్రమును పొందమని సలహా ఇచ్చాడు. పాండవులు ఆ పనికి ఆర్జునుడిని ఎన్నుకొంటారు. అర్జునుడు ఇంద్రకీల పర్వతముపై (ఇంద్రకీలాద్రి) ఒంటికాలిపై, చేతులు పైకెత్తి, పంచాగ్నుల మధ్య (నాలుగు సృష్టించినవి ఐదవది సాక్షాత్తూ సూర్య భగవానుడు), ఘోరమయిన తపస్సు చేసాడు. శివుడు, అర్జునుడి భక్తికి మెచ్చి ఇంకొంత పరీక్షించడానికి వేటగాని రూపము ధరించి ఒక ఎలుగుబంటిని తరుముకుంటూ వస్తాడు.


ఇంతలో ఆ ఎలుగుబంటి అర్జునుడి వైపు వస్తుంది. గొప్ప క్షత్రియ వీరుడయిన అర్జునుడు వెంటనే తన విల్లంబులతో ఆ ఎలుగుబంటిపైకి బాణము విసురుతాడు. అదే సమయములో వేటగాని రూపములో ఉన్న శివుడు కూడా బాణము విసిరుతాడు. ఈ రెండు బాణములు ఒకేసారి తగిలి, ఎలుగుబంటి మరణిస్తుంది. ఇద్దరూ ఆ ఎలుగును చంపింది తానంటే తానేనని తగువుకి దిగుతారు. మాటలు కాస్తా యుద్ధానికి దారితీస్తుంది. అర్జునుడు ఎంత గొప్పవీరుడయినా శివుడి ప్రతాపం ముందు తట్టుకోలేక బాగా ఆలసిపోతాడు. అప్పుడు భగవంతుని అనుగ్రహం పొందడానికి మట్టితో శివలింగమును తయారు చేసి పూజిస్తాడు. తాను శివలింగము మీద వేస్తున్న పూలు వేటగాని మీద పడుతుండటం గమనించి, సాక్షాత్తూ శివుడే ఆ వేటగాడని గుర్తిస్తాడు. అప్పుడు శివుడు తన స్వరూపంలో ప్రత్యక్షమై, అర్జునుడు కోరుకునే పాశుపతాస్త్రమును ప్రసాదిస్తాడు. ఆ అద్భుత క్షణాలకు గుర్తుగా ఇంద్రకీలాద్రిపై విజయేశ్వర స్వామి వారి గుడిని అర్జునుడు ప్రతిష్టించాడని ప్రతీతి.


ఇంద్రకీలాద్రిపై బోలెడన్ని రాతి గుడులు ఉండేవి. కాలక్రమంలో అవి శిధిలమైపోయాయి. రాళ్ళ కోసం క్వారీలలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు అక్కడ కొన్ని రాతి గుడులు బయటపడ్డాయి. వాటిని భద్రపరిచినారు.

[మార్చు] విజయవాడలో చూడదగిన ప్రదేశములు

లెనిను విగ్రహం (విజయవాడ ప్రముఖ కమ్యూనిస్టు కేంద్రం)
లెనిను విగ్రహం (విజయవాడ ప్రముఖ కమ్యూనిస్టు కేంద్రం)
  • విక్టోరియా మ్యూజియము - పురావస్తు శాఖవారి మ్యూజియము. బందరు రోడ్డులో ఉంది. ఇందులో విగ్రహాలు, వర్ణచిత్రాలను భద్రపరచారు. ఇక్కడ రాతి యుగానికి చెందినవిగా భావిస్తున్న ఎన్నో రాతి పనిముట్లను కూడా ఉన్నాయి. ఇక్కడ అల్లూరు నుంచి తెచ్చిన బ్రహ్మాండమయిన బుద్దుని నల్లరాతి (గ్రానైటు) విగ్రహము, మరియు ఇంకొక పాలరాతి విగ్రహము ఉన్నాయి. ఇవి మూడు లేదా నాలుగవ శతాబ్దమునకు చెందినవిగా భావిస్తున్నారు.
  • కొండపల్లి, కొండపల్లి కోట - కొండపల్లి గ్రామం విజయవాడ నగరానికి వాయువ్యాన 14 కి.మీ.ల దూరములో ఉన్నది. కొండపల్లి కలపతో తయారుచేసే బొమ్మలకు పెట్టింది పేరు. "పొనికి" అనే తేలికయిన చెక్కమీద లక్కపూతతో అందమయిన రంగులలో ఈ బొమ్మలను తయారుచేస్తారు. గ్రామాలలోని జీవన శైలిని, పురాణ గాధలలోని పాత్రలను, జంతువులను, పక్షులను, పండ్లను, కాయగూరలను, మొదలైనవాటిని వర్ణిస్తూ తయారవుతాయి. ఏడవ శతాబ్దములో నిర్మించిన మూడు అంతస్తుల కోటను కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ కోట ఎన్నో రాజ వంశాల పాలనలో ఉండేది. అంతేకాదు, ఇది ఒక వ్యాపార కేంద్రంగా కూడా ఉపయోగపడింది. బ్రిటిషు పాలకులు తమ సైన్యానికి రక్షణలో శిక్షణ ఇచ్చేందుకు ఈ కోటను వాడుకునేవారు. వనవిహారానికి ఇది చాలా అనువైనది.
  • ప్రకాశం బారేజి - కృష్ణా నదిపై ఇక్కడ ఒక ఆనకట్ట కట్టే ఆలోచన మొదట 1798 లో వచ్చింది. తరువాత 1841 లో కాప్టెను బకుల్ చేతులలో ఒక రూపాన్ని సంతరించుకున్నది. 1852 లో ఆనకట్టను నిర్మించడం మెదలుపెట్టి 1855 లో పూర్తి చేసారు. వందేళ్ళ పాటు ఉపయోగపడిన ఆనకట్ట ఆనకట్ట కొట్టుకొని పోవడంతో, 1954 మార్చి 1ఆంధ్ర రాష్ట్రపు మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఒక కొత్త రెగ్యులేటరు మరియు వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసాడు. 1957లో బారేజి పూర్తి అయింది. 1223.5మీటర్ల పొడవు కలిగిన ఈ బారేజీ వలన మొత్తం 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. దీని వలన కృష్ణా డెల్టా రాష్ట్రం లోనే పెద్ద ధాన్యాగారముగా మారింది. ప్రకాశం బారేజి వలన ఏర్పడిన సరస్సు నలుదిక్కులా కనిపిస్తూ చాలా మనోహరంగా ఉంటుంది.
  • గాంధీ కొండ: గాంధీ కొండ లేదా ఒర్ కొండ అని పిలిచే ఈ కొండ మీద 1968 లో మహాత్ముడి సంస్మరణార్ధం ఒక స్మారక స్థూపాన్ని నిర్మించారు. ఈ స్తూపం 15.8 మీటర్లు (52 అడుగులు) ఎత్తు ఉంటుంది. ఇక్కడ ఒక గాంధీ స్మారక గ్రంధాలయం, "సౌండ్ అన్డ్ లైట్ షో" మరియు నక్షత్రశాలలు ఉన్నాయి. ఈ కొండపై నుండి దాదాపు విజయవాడ మొత్తం కనిపిస్తుంది. కొండ మొత్తం చూపించడానికి ఒక బొమ్మ రైలు కూడా తిరుగుతూ ఉంటుంది. ఈ స్తూపం మహాత్ముని సంస్మరణార్ధం భారత దేశములో నిర్మించిన మొదటి స్తంభము. దీనిని అక్టోబరు 6 1968 న అప్పటి అధ్యక్షుడు స్వర్గీయ డా. జాకీర్ హుసేన్ ఆవిస్కరించి, జాతికి అంకితమిచ్చాడు.
  • ఉండవల్లి గుహలు: కీ.శ. 7వ శతాబ్దములో నిర్మితమయిన ఈ గుహలు విజయవాడకు 8 కీ.మీ.ల దూరములో ఉన్నాయి. రెండంతస్తుల ఈ గుహారూపాలను బౌద్ద సన్యాసులు వానా కాలములో తమ విశ్రాంతి గదులుగా ఉపయోగించేవారు. పడుకున్న భంగిమలో ఉన్న "అనంతశయన విష్ణువు" యుక్క భారీ ఏకశిలా విగ్రహము ఇక్కడ ఉంది. ఈ కొండ నుండి కృష్ణా నది మనోహరముగా కనిపించును. ఈ కొండపైన రాళ్ళమీద విగ్రహ ప్రతిమల మాదిరిగా చెక్కిన చిత్రాలు కూడా చూడ వచ్చు.
  • నరసింహ స్వామి ఆలయము: విజయవాడకు దక్షిణాన 12 కి.మీ.ల దూరములో ఉన్న మంగళగిరిలో ఈ ఆలయము ఉంటుంది. విష్ణుమూర్తి యొక్క అవతారాలలో ఒకటైన నరసింహ స్వామిని ఇక్కడ దర్శించుకోవచ్చు. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ స్వామికి ఒక ప్రత్యేకత ఉంది, అదేమిటంటే, భక్తులు ఎంత పానకం సమర్పించినా అందులో సగం మాత్రమే స్వామి స్వీకరిస్తాడు. ఈ ఆలయమును 14వ శతాబ్దములో నిర్మించారు, మరల 17, 18వ శతాబ్దాలలో నమూనాను మార్చినారు. ఆలయానికి వెలుపల రధాకారములో ఉన్న గరుక్మంతుని కోవెల ఉంది.
  • హజరత్‌బల్‌ మసీదు: విజయవాడలో ఈ మసీదు మతపరమయిన ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలలో ఇంకోటి. ఇక్కడ ఉన్న మహమ్మదు ప్రవక్త యొక్క పవిత్రమయిన అస్తికలను సంవత్సరానికి ఒకసారి చూపిస్తారు. ఈ పండుగలో ముస్లిమేతరులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.
  • గుణదల మేరీమాత చర్చి: విజయవాడకు తూర్పున ఉన్న ఈ చర్చఇని 1925 లో రెవ.ఆర్లాటిగారు - గుణఅదలలోని సెయింట్‌ జోసెఫ్ అనాధాశ్రయములో అప్పటి అధికారి - ఇక్కడ మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్టించి, తరువాత చర్చీని నిర్మించారు. 1971 లో దీనిని పవిత్రపరిచినారు(చొన్సెచ్రతెద్). ఇప్పుడు మేరీ మాత చర్చీగా ప్రసిద్ది చెందింది. ప్రతీ సంవత్రరం ఫిబ్రవరి నెలలో ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. దానికి వందల సంఖ్యలో ప్రజలు సందర్శిస్తారు.
  • హ్రీంకార తీర్థ (జైనుల ఆలయము): మంగళగిరిలో ఉన్న ఇంకో ఆకర్షణ ఈ జైన దేవాలయం. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని జైన ఆలయాలలోకి ఇదే అతి పెద్దదని ప్రతీతి. ఈ ఆలయము కళాఖండాలకు పెట్టింది పేరు.
  • రాజీవ్‌ గాంధీ పార్కు: ఈ పార్కును విజయవాడ మునిసిపలు కార్పోరేషను ప్రత్యేక శ్రద్ధ తీసికొని నిర్మించింది. ఇక్కడ ఎన్నో రకాల పూల మొక్కలు పెంచబడుతున్నాయి. సంగీతాన్ని వినిపించే ఫౌంటేను, ఒక మినీ జూ ఈ పార్కుకు ప్రత్యేక ఆకర్షణ.
  • మొగల్రాజపురం గుహలు: ఈ గుహలను కీశ ఐదవ శతాబ్దములో నిర్మించినట్లు చెబుతాతు. వీటిలో నటరాజ స్వామి, వినాయకుడు, మొదలగున వారి విగ్రహములు చూడవచ్చు. ఇక్కడ ఉన్న అర్ధనారీశ్వరుని విగ్రహము దక్షిణ భారతదేశములో మరెక్కడా కనిపించదు.
  • భవానీ ద్వీపం - ఈ ద్వీపం కృష్ణానదిపై ఉన్న అన్ని ద్వీపాలలోకీ పెద్దదని చెప్పుకోవచ్చు. ఇది విజయవాడ నగరానికి 4 కి.మీ.ల దూరములో ఉంటుంది. 133 ఎకరాల ఈ దీవిని ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖవారు గొప్ప పర్యాటక ప్రదేశముగా మలచారు. ఇక్కడ ఒక రిసార్టు కూడా ఉంది. ప్రకృతి ప్రేమికులకు ఇది చాలా గొప్ప విహారక్షేత్రము. దీవి వద్దకు వెళ్ళేందుకు పడవ వసతి కల్పించారు.
  • అమరావతి - ఇది విజయవాడకు 68 కీ.మీ.ల దూరములో కృష్ణా నది దక్షిణపు ఒడ్డున ఉన్న చిన్నపట్టణము. అమరావతి దక్షిణభారతదేశములోనే అత్యంత ప్రసిద్ధి చెందిన బౌద్దారామం. క్రీ.పూ. మూడు లేదా రెండవ శతాబ్దాలలో ఆచార్య నాగార్జునుడు ఇక్కడ అతిపెద్ద స్థూపాన్ని నిర్మించాడు. కల్నలు మెకెన్జీ 1797 లో తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఇక్కడ కొన్ని శిల్పాలు బయటపడ్డాయి. ఇక్కడ దొరికిన పురావస్తు అవశేషాలు చాలావరకు మద్రాసు మరియు కోల్కతాలలో ఉన్న మ్యూజియములలో భద్రపరిచారు. ఇక్కడి ప్రాంతంవారు దీనిని దీపాల దిన్నె అని పిలిస్తారు. ఇక్కడ ఒక పురావస్తు మ్యూజియము ఉన్నది. అందులో అప్పటి నాణేలు, గాజులు, బోధి వృక్షము యొక్క శిల్పాలు, విరిగిన కమ్మీలు మొదలయినవాటిని చూడవచ్చు.
  • బీసెంటు రోడు - విజయవాడలోని ప్రముఖ వాణిజ్య కేంద్రం.

[మార్చు] దేవాలయాలు

[మార్చు] కనక దుర్గ అమ్మ వారి దేవాలయం

కనక దుర్గ అమ్మ వారి దేవాలయం
కనక దుర్గ అమ్మ వారి దేవాలయం

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణావది ఒడ్డువే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉన్నది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కెన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.

రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమవి ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి.

[మార్చు] మరకత రాజరాజేశ్వరీ దేవాలయం - పటమట

మరకత రాజరాజేశ్వరి
మరకత రాజరాజేశ్వరి

ఆధునిక యుగంలో అపురూపమైన శిల్పకళతో తయారైన గొప్ప దేవస్ధానం. అమ్మవారి మూర్తి అపురూపమైన మరకత శిలతో(పచ్చ) చెక్కబడింది. అంతేకాక, ఆలయవు గోడలన్నీ రాతితో చెక్కబడి శ్రీచక్రం లోని వివిధ చక్రాలు, వాటిలోని దేవతలను అద్భుతంగా దర్శింపజేస్తూ ఉంటాయి. ఆలయ శిఖరం సుమేరు శ్రీచక్ర అకారంలో ఉంటుంది. అమ్మ వారి ముందు కూర్మం (తాబేలు) పై మాణిక్యం (కెంపు) తో చేసిన శ్రీచక్రం అలరారుతూ ఉంటుంది. 2002 లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ చే ఈ గుడి కుంభాభిషేకం మరియు ప్రతిష్ఠ జరుపబడింది.


[మార్చు] వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం - లబ్బీపేట

బెన్ఝ్చిర్చ్లె నుఒద్ 2 క్మ్ దురమ్. ఇది ఎన్తొ పెరుగన్ఛిన్ది . ఇన్దిర గన్ధి స్తదిఉమ్తి దగ్గర.

[మార్చు] ఆంజనేయస్వామి వారి దేవాలయం - మాచవరం

[మార్చు] క్షిప్రగణపతి దేవాలయం - పటమట

[మార్చు] బయటి లింకులు

[మార్చు] కృష్ణా జిల్లా మండలాలు

జగ్గయ్యపేట | వత్సవాయి | పెనుగంచిప్రోలు | నందిగామ | చందర్లపాడు | కంచికచెర్ల | వీరుల్లపాడు | ఇబ్రహీంపట్నం | జి.కొండూరు | మైలవరం | ఏ.కొండూరు | గంపలగూడెం | తిరువూరు | విస్సన్నపేట | రెడ్డిగూడెం | విజయవాడ గ్రామీణ | విజయవాడ పట్టణం | పెనమలూరు | తొట్లవల్లూరు | కంకిపాడు | గన్నవరం | ఆగిరిపల్లి | నూజివీడు | చత్రాయి | ముసునూరు | బాపులపాడు | ఉంగుటూరు | వుయ్యూరు | పమిడిముక్కల | మొవ్వ | ఘంటసాల | చల్లపల్లి | మోపిదేవి | అవనిగడ్డ | నాగాయలంక | కోడూరు | మచిలీపట్నం | గూడూరు | పామర్రు | పెదపారుపూడి | నందివాడ | గుడివాడ | గుడ్లవల్లేరు | పెదన | బంటుమిల్లి | ముదినేపల్లి | మందవల్లి | కైకలూరు | కలిదిండి | కృతివెన్ను

Static Wikipedia (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2006 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu

Static Wikipedia February 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu