మలేరియా
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని సమీక్షిస్తూ, మెరుగుపరచేందుకు అవసరమైన సూచనలివ్వండి.
అలాగే, వ్యాసంలో అవసరమైన మార్పులు చేసి, దాని నాణ్యతను మెరుగుపరచండి. మీ సూచనలను చర్చా పేజీలో రాయండి. |
మలేరియా ఒక అంటురోగము. మనిషి రక్తంలో పరాన్నజీవులు చేరినప్పుడు మలేరియా సోకుతుంది. పరాన్నజీవులు తమ ఆహారం కోసం తాము నివసిస్తున్న మనుషులపైనే అధారపడతాయి. మలేరియా ఏ విధంగా వస్తుందో కనిపెట్టినందుకుగాను ఫ్రెంచి రక్షణ వైద్యుడయిన "చార్లెస్ లూయీ ఆల్ఫోన్సె లావెరెన్"కు 1907లో నోబెల్ పురస్కారం లభించింది. మలేరియా పరాన్నజీవి యొక్క జీవిత చక్రము, అది దోమలలో మరియూ మనుషులలో ఎలా నివశిస్తుందో తెలిపినందుకు 1992లో "సర్ రొనాల్డ్ రాస్" గారికి నోబెల్ పురస్కారం లభించింది.
మలేరియాను కలుగచేసే పరాన్నజీవాలను "ప్లాస్మోడియం ప్రొటోజోవా (Plasmodium Protozoa)" అని పిలుస్తారు. ప్రోటోజోవాలు ఎకకణజీవులు కానీ వీటి నిర్మాణము బ్యాక్టీరియా కంటే క్లిష్టమైనది. బ్యాక్టీరియా చాలా సులువయిన నిర్మాణము కలిగి ఉంటాయి.
సాధారణంగా ఈ క్రింది రకాల ప్లాస్మోడియంలు ప్రజలలో మలేరియా తెప్పిస్తాయి:
- ప్లాస్మోడియం ఫల్సిపరుం (falciparum)
- ప్లాస్మోడియం నోవెస్లి (knowesli)
- ప్లాస్మోడియం మలేరియై (malariae)
- ప్లాస్మోడియం ఒవేల్ (ovale)
- ప్లాస్మోడియం సెమీఒవేల్ (semiovale)
- ప్లాస్మోడియం వివాక్స్ (vivax)
పైవాటిలో ప.వివాక్స్ మరియు ప.ఫల్సిపరుం ఎక్కుమంది ప్రజలకు సోకుతుంది. ఫల్సిపరుం మలేరియా అన్నింటికంటే ప్రాణాంతకమయినది.
విషయ సూచిక |
[మార్చు] మలేరియా ఎలా సోకుతుంది?
సాధారణంగా దోమకాటు వలన మలేరియా వస్తుంది. దోమలు మనుషులను కుట్టేటప్పుడు వాటి లాలాజలాన్ని వదిలుతుంది, అప్పుడు వాటికి కుట్టటానికి సులువుగా ఉంటుంది. అయితే వాటి లాలాజలంలో ఉండే ప్లాస్మోడియం మనుషులలోకి ఈ సమయంలోనే ప్రవేశిస్తుంది. తద్వారా మనిషికి మలేరియా వ్యాధి సోకుతుంది. అయితే అన్ని దోమలూ మలేరియాను వ్యాప్తి చేయవు. కేవలం అనోఫిలస్ (anopheles) అనే జాతిలోని ఆడ దోమల వల్ల మాత్రమే మనుషులకు వ్యాధి సోకుతుంది.
కొంతమందికి ఇతర మార్గముల ద్వారా వ్యాధి సోకవచ్చు. గర్భంలో ఉన్న శిశువుకు తన తల్లినుండి వ్యాధి రావచ్చు. వ్యాధిగ్రస్తుని రక్తం వలన లేదా సిరంజీ వలన కూడా ఈ వ్యాప్తి చెందుతుంది.
[మార్చు] ఈ పరాన్న జీవులు మనుషులలో ఎలా బ్రతుకుతాయి?
మనుషులలోకి వచ్చిన ప్లాస్మోడియంను స్పోరోజొఐట్స్(sporozoites) అని పిలుస్తారు. మనుషులలోకి ప్రవేశించిన వెంటనే ఇవి కాలేయంలోకి వెళ్ళి అక్కడ తమ సంతతిని వృద్ది పరుచుకుంటాయి. అప్పుడే అవి మెరొజొఐట్(merozoite) దశకు చేరుకుంటాయి. మెరోజొఐట్స్ దశలో ఉన్న ప్లాస్మోడియం ఎర్ర రక్తకణాలలో చేరతాయి. అక్కడ మరలా మరిన్ని మెరొజోఐట్స్ ని సృస్టిస్తాయి. వాటి సంతతి అలా పెరిగిపోయి ఎర్ర రక్తకణాలలో ఏమాత్రం ఇమడలేక దానిని బద్దలు చేసుకుని బయటకు వచ్చేస్తాయి. సరిగ్గా ఈ సమయంలోనే వ్యాధిసోకిన మనిషి బాగా నీరసంగా కనిపిస్తాడు, జ్వరం కూడా వస్తుంది. ఇలా కొన్ని రోజుల వ్యవధిలో అలా జరుగుతూ ఉంటుంది. దీనిని పరోక్సిసం(paroxysm) అని అంటారు, అనగా హటాత్తుగా సంభవించే అనచుకోలేని ముట్టడి. అయితే పైన చెప్పిన ప్లాస్మోడియంలలో ప.వివాక్స్ మరియు ప.ఒవేల్ కాలేయంలో ఎక్కువ సేపు ఉంటాయి. అవి కాలేయంలో ఉన్నంత సేపు మనిషి బాగానే కనిపిస్తాడు, కానీ లోపల అవి వాటి సంతతిని వృద్దిచేసుకుంటాయి. దీనిని "డార్మన్ట్ ఫేస్(dormant phase)" లేదా నిద్రాణ దశ అని అనుకోవచ్చు. కొన్ని వారాలు లేదా నెలల తరువాత ప్లాస్మోడియం కాలేయం నుండి మెల్లగా రక్తంలోకి ప్రవేశితుంది. ఈ సమయంలోనే మనిషికి జ్వరం లక్షణాలు కనిపిస్తాయి.
ప.ఫల్సిపరుం అన్నింటి కన్నా భయంకరమయిన మలేరియా. ఇది రక్తంలో మరింత వ్యాప్తి చెందటం వలన మనిషి ఆరోగ్యం మరింత క్షీనిస్తుంది. అంతేకాదు దీని వలన ఎర్ర రక్తకణాలు బంకబంకగా తయారయ్యి రక్తనాళాలకు అడ్డుపడతాయి. దీని వలన ఇతర అంగాలు దెబ్బతినే అవకాశం ఉంది.
[మార్చు] మలేరియా ఏఏ ప్రాంతాలలో వ్యాప్తిలో ఉంది?
కడుపుతో ఉన్న ఆడవారు మరియు చిన్నపిల్లలు ఎక్కువగా ఈ వ్యాధిబారిన పడతారు. ప్రపంచ జనాబాలో 40% మంది మలేరియా పీడిత ప్రాంతాలలో నివశిస్తున్నారు. మలేరియా పీడిత ప్రాంతాలు ఇవే:
- ఆఫ్రికా
- ఆసియా (ఎక్కువగా భారతదేశము, మధ్యప్రాశ్చం మరియూ దక్షిణాసియాలలో)
- హిస్పానియోల
- మధ్య మరియు దక్షిణ ఆమెరికా
- తూర్పు యూరోపు
- దక్షిణ పసిఫిక్ ప్రాంతాలు
ప్రతీ సంవత్సరం 30,00,00,000 నుండి 50,00,00,000 మంది వరకు మలేరియా బారిన పడుతున్నారు. ప్రతీ సంవత్సరం 10,00,000 నుండి 20,00,000 వరకు ప్రజలు మలేరియా వలన మరణిస్తున్నారు. చనిపోతున్నవారిలో 90% మంది ఆఫ్రికావారే. అందులో సింహభాగం చిన్నారులే. ఆఫ్రికాలో 20% మంది పిల్లలు మలేరియా వలన 5ఏల్లలోపే చనిపోతున్నారు. ఒకవేళ చనిపోక బ్రతికి ఉనట్లయితే వారి మెదడు దెబ్బతిని ఇతరుల మాదిరి తెలివితేటలతో ఉండలేరు.
ఈ మరణాలను మనం ఆపవచ్చు. మలేరియాను మందులవలన గానీ లేదే దోమలను ఆపటం వలన కానీ అరికట్టవచ్చు. UNICEF(యునీసెఫ్) ఏమంటుందంటే: పెద్దలకు వచ్చిన మలేరియాను తొలగించటానికి కావలసిన మందుల ఖర్చు కేవలం 2.40 డాలర్లు మాత్రమే, అంటే సుమారు 125రూపాయలు. కానీ మలేరియా ఎక్కువగా పేద దేశాలలోని ప్రజలకు సోకుతుంది. వారి వద్దకానీ దేశ ప్రభుత్వాల వద్దకానీ మందులు కొనే స్థోమత లేదు.
[మార్చు] మలేరియాను ఈ విధంగా గుర్తించండి
మలేరియా సోకిన 10 నుండి 30 రోజులలో జ్వరం రావచ్చు(అంటే ప్లాస్మోడియం రక్తంలోకి చేరిందన్నమాట). ఆ తరువాత ఇంకో వారం రోజులకుగానీ వ్యాధి లక్షణాలు కనిపించవు. కొంతమందికి మలేరియా సోకిన సంవత్స్రానికిగానీ వ్యాధి లక్షణాలు కనిపించవు. కానీ ఎక్కువ మందికి 10 నుండి 30 రోజులలో జ్వరం వస్తుంది. మలేరియా సోకినప్పుడు జ్వరం హటాత్తుగా వస్తుంది. మలేరియా మనకు జలుబు ఉన్న వచ్చిందేమో అనే అపోహ కలుగజేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు ఊపిరి తీసుకోవటం కష్టమవుతుంది.
కొని లక్షణాలు:
- కీళ్ళ నెప్పులు
- తల నెప్పి
- వాంతులు
- వోపిక లేకపోవటం లేక మగతగా అనిపించటం
- అనేమియా (ఎర్ర రక్తకణాల క్షీణత)
- చర్మం పచ్చగా మారటం
- దగ్గు
- కాలేయం పెరుగుట
- అతిగా చెమట పట్టటం
- అతిగా చలి పుట్టటం
- కోమాలోకి వెళ్ళిపోవటం
- గుండెకొట్టుకునే వేగం తగ్గటం
[మార్చు] డాక్టార్లు వ్యాధి మలేరియా అని ఎలా నిర్ధారిస్తారు?
సాధారణంగా మలేరియా పీడిత ప్రాంతాలలో మలేరియా లక్షణాలు కనిపిస్తే, అప్పుడు ఆవ్యాధి మలేరియా అనే నిర్ధారించవచ్చు. డాక్టర్లు రక్తపరీక్ష చేసి మలేరియా అని నిర్ధారిస్తారు. ఈ పరీక్షను గీంసా బ్లడ్ స్మీయర్ (Giemsa blood smear) అని పిలుస్తారు. సేకరించిన రక్తం బొట్టును ఒక సన్నటి గాజు పలకపై ఉంచి, దానిపై గీంసా(Giemsa) ద్రావకం వేస్తారు. దీనివలన డాక్టర్లు మైక్రోస్కోపు కింద మలేరియా జీవులను చూడగలుగుతారు. ఆ జీవులు ఎర్ర రక్తకణాలను నాశనం చేయటం మనకు కనిపిస్తుంది. ఈ రకమయిన పరీక్ష చాలా తేలికయినది ఖర్చులేనిది. కాకపోతే సరయిన మైక్రోస్కోపు వాడకపోయినా, ద్రావకం సరిగ్గా లేకపోయినా పరీక్షించే వ్యక్తికి ప్లాస్మోడియం కనిపించకపోవచ్చు. ఇంకా ఖరీదయిన పరీక్షలు కూడా ఉన్నాయి. కానీ వాటిని పెద్దగా ఎవరూ వాడరు. తీసుకున్న మందులు వ్యాధినయం చేయనప్పుడు ఈ తరహా ఖరీదయిన పరీక్షలు చేస్తారు.
[మార్చు] మలేరియా చికిత్సా విధానం
వ్యాధిగ్రస్తునికి సోకిన మలేరియా ఏరకమో తెలుసుకొని దానికి తగ్గట్లుగా మందులు ఇవ్వవలెను. ఒక రకం ప్లాస్మోడియంకు పని చేసిన మందు వేరొక దానికి పని చేయకపోవచ్చు. ఒకవేళ ఏరకమయిన మలేరియా సోకిందో తెలియనప్పుడు ఫల్సిపరుం మలేరియా సోకిందనే అనుకోవాలి, ఎందుకంటే అది అన్నిటికంటే భయంకరమయిన మలేరియా కాబట్టి. అప్పుడు వ్యాధిగ్రస్తునికి ఫల్సిపరుం మలేరియాకు ఇవ్వబడే మందునే ఇవ్వవలెను.
వ్యాధిగ్రస్తుడు ఉన్న ప్రదేశము బట్టి కూడా ఇవ్వవలసిన మందు మారుతుంది. ఆఫ్రికాలో ఇచ్చే మందు అమేరికాలో ఇచ్చే మందు వేరేవేరేగా ఉంటాయి. డాక్టర్లు ఎప్పటికప్పుడు తమ ప్రాంతంలో మలేరియా ఏవిధంగా ఉందో పరిశీలిస్తూ ఉండవలెను. కొన్నిసార్లు ఆయాప్రాంత మలేరియా మందులకు అలవాటు పడిపోవచ్చు. కాబట్టి డాక్టర్లు తగు జాగ్రత్తలు తీసుకొని చికిత్స చేయవలెను.
ఒకప్పుడు మలేరియా చికిత్సకు క్లోరోక్వినైన్(chloroquinine) వాడేవారు. కానీ రానురాను మలేరియాను ఇది ఎంతమాత్రం నయం చేయలేక పోవటం వలన క్వినైన్(quinine) మరియూ దాని ప్రత్యామ్నాయాలయిన క్వినైనాక్రిన్(quinacrine), క్లోరోక్విన్(chloroquine), ప్రైమాక్విన్(primaquine) వాడుతున్నారు.
[మార్చు] మలేరియాను ఎలా నివారించాలి?
మలేరియాకు అన్నిటి కంటే మంచి చికిత్స దానిని తెచ్చుకోక పోవటమే
మలేరియాను మూడు రకాలుగా నివారించవచ్చు:
- దోమలను అదుపుచేయటం
- దోమలు మిమ్మల్ని కుట్టకుండా చూసుకోవటం
- దోమకాటుకు గురయితే సరయిన మందులు తీసుకోవటం
[మార్చు] దోమలను అదుపుచేయటం
దోమలను అదుపుచేయటం అనేది చాలా మంచి పద్ద్దతి. ఇదికూడా ప్రాంతాలవారీగా మారుతూ ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్దానికి ముందు దోమలను అరికట్టటానికి DichloroDiphenylTrichloroethane(DDT) అనే క్రిమి సంహారక మందును వాడేవారు. ఇది చాలా తక్కువధరలో లభిస్తుంది, బాగానే పనిచేస్తుంది, మనుషులకు కూడా పెద్దగా అపాయం కాదు, కానీ ఇది ప్ర్యావరనంలో ఎక్కువసేపు ఉండి కాలుశ్యాన్ని పెంచి తద్వారా దీర్గాకాలంలో కీడును కలుగ చేస్తుందని కనుగొన్నారు. కానీ ఈ వాదన మలేరియా తో పీడింపబడని ధనిక దేశాలలో మాత్రమే వినిపిస్తుంది, ప్రపంచ ఆరోగ్య సంస్త(WHO) కూడా DDTని వాడమనే చెబుతుంది. ఎందుకంటే ప్రతీ నిముషం ఇద్దరు చిన్నారులు మలేరియా వలన మరనిస్తున్నారు, దీని ముందు DDT చేసే హాని చాలా తక్కువ. కానీ వచ్చిన చిక్కల్లా కొన్ని ప్రాంతపు దోమలు ఈ DDTని తట్టుకునే సామర్ధ్యం పెంచేసుకున్నాయి. ఈ క్రింది ప్రాతాలలో DDTతో దోమలను అరికట్టడం చాలా కష్టమయిపోతుంది:
- భారత దేశము
- శ్రీలంక
- పాకిస్తాన్
- టర్కీ
- మధ్య అమెరికా
ఈ ప్రాంతాలలో వేరే మందులు వాడవలెను, కానీ అవిఖరీదయినవి. అవి Organophosphate or carbamate మొదలయిన క్రిమిసంహారక మందులు.
[మార్చు] దోమలు మిమ్మల్ని కుట్టకుండా చూసుకోవటం
మలేరియాను మోసుకువెళ్ళే దోమలు తెల్లవారుతున్నప్పుడు లేదా చీకటి పడుతున్నప్పుడు వస్తాయి, ఆ సమయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. దోమలను తరిమి వేసేందుకు కావలిసిని రెపలెంట్స్‌ని వాడండి. పొడుగు చేతులున్న చొక్కాలు ధరించండి. దోమతెరలు కూడా వాడవచ్చు. అంతేకాదు దోమలు మురుగు నీటిలో లేదా చెత్తలో గుడ్లు పెడతాయి. కాబట్టి మీ పరిసరాలను శుబ్రంగా ఉంచుకోడి. మీ ఇంటి చుట్టుప్రక్కల ఎక్కడయినా మురుగునీరు బహితంగంగా కనిపిస్తే దాని మీద కిరోస్సిను ఒక పొరగా చల్లండి, ఇది గుడ్లు దోమలుగా ఎదగకుండా చేస్తుంది.
[మార్చు] దోమకాటుకు గురయితే సరయిన మందులు తీసుకోవటం
మీరు మలేరియా పీడిత ప్రాంతాలలో నివశిస్తునట్లయితే ప్రొఫైలాక్సిస్(prophylaxis) అనే మందును మలేరియా రాకుండా ఉండటానికి వాడవచ్చు. ఈ మందు కొంచెంఖరీదయినదే. అంతే కాదు కొన్ని ప్లాస్మోడియంలు ఈ మందును కూడా తట్టుకునే శక్తి పెంచేసుకున్నాయి. కాబట్టి ప్రొఫైలాక్సిస్ తీసుకునే వారికి కూడా మలేరియా రావచ్చు. ఈ మందును ఎక్కువగా మలేరియా పీడిత ప్రాంతాలను సందర్శించేవారు వాడుతూ ఉంటారు. ప్రొఫైలాక్సిస్ మందుని మలేరియా పీడీత ప్రాంతాలకు వెళ్ళే ముందు వచ్చిన తరువాత 4 వారాల వరకు వాడితే మంచి గుణము కనిపిస్తుంది.