రామిరెడ్డిపల్లి
వికీపీడియా నుండి
రామిరెడ్డిపల్లి, కృష్ణా జిల్లా, నందిగామ మండలానికి చెందిన గ్రామము.
ఇక్కడి ప్రజలకు వ్యవసాయం ప్రధాన జీవనాధారము. కానీ ఈ చిన్న గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. రామిరెడ్డిపల్లి గ్రామం లో గల కొండపై చాలా ఏళ్ళ కిందట బౌద్ద స్థూపాలు బయట పడ్డవి. గ్రామస్థుల అమాయకత్వము వలన వాటిని నాగార్జున సాగర్ నందు గల మ్యూజియంకు తరలించిరి. దీని వలన ఈ గ్రామానికి రావలసిన గుర్తింపు మరియు పర్యాటక ఆదాయం రాకుండా పోయినవి.