శ్రీకృష్ణార్జున యుద్ధం
వికీపీడియా నుండి
శ్రీకృష్ణార్జున యుద్ధం (1963) | |
దర్శకత్వం | కె.వి.రెడ్డి |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, బి.సరోజాదేవి |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | జయంతి పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఈ చిత్రంలో ప్రఖ్యాత నటులు ఎన్.టి.ఆర్ కృష్ణుడిగా అధ్బుతమైన పాత్రను పోషించగా, ఏ.ఎన్.ఆర్ అర్జునిడిగా తన ప్రతిభను చూపారు.ఆనాటి ఇద్దరు ప్రముఖ కధా నాయకులు ఒకే తెర పై తమ పాత్రలని అధ్బుతంగా పండించి పలువురి ప్రశంశలు పొందారు.బి.సరోజా దేవి సుభద్ర పాత్రను,ఎస్.వర లక్ష్మి సత్య భామ పాత్రలను పోషించారు.కృష్ణార్జునుల యుద్ధానికి కారణమైన ముఖ్యమైన గయుడి పాత్రను ధూళిపాళ పోషించారు.మాయాబజార్ చిత్రంలో దుర్యోదనుడి పాత్రను పోషించిన ముక్కామల ఈ చిత్రంలో కూడా తిరిగి దుర్యోదను ని పాత్రలో నటించారు.
[మార్చు] కథ
గయుడు అనే గంధర్వుడు పుష్పకవిమానంలో వెడుతుండగా తను నములుతున్న తాంబూలాన్ని భూమి మీదకు ఉమ్ముతాడు. అది సంధ్యావందనం చేస్తున్న శ్రీకృష్ణుని చేతులో పడూతుంది. దానితో ఆగ్రహించిన కృష్ణుడు గయుణ్ణి సంహరిస్తానని శపథం చేస్తాడు. దానితో భీతిల్లిన గయుడు నారదుని సలహామీద అసలు విషయం చెప్పకుండా అర్జునుడు శరణు పొందుతాడు. తరువాత విషయం తెలిసికూడా ఇచ్చిన అభయం నిలబెట్టుకోవడం కోసం అర్జునుడు శ్రీకృష్ణుడితో పోరాడటం ఇందులోని కథాంశం.