New Immissions/Updates:
boundless - educate - edutalab - empatico - es-ebooks - es16 - fr16 - fsfiles - hesperian - solidaria - wikipediaforschools
- wikipediaforschoolses - wikipediaforschoolsfr - wikipediaforschoolspt - worldmap -

See also: Liber Liber - Libro Parlato - Liber Musica  - Manuzio -  Liber Liber ISO Files - Alphabetical Order - Multivolume ZIP Complete Archive - PDF Files - OGG Music Files -

PROJECT GUTENBERG HTML: Volume I - Volume II - Volume III - Volume IV - Volume V - Volume VI - Volume VII - Volume VIII - Volume IX

Ascolta ""Volevo solo fare un audiolibro"" su Spreaker.
CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
కె.వి.రెడ్డి - వికిపీడియా

కె.వి.రెడ్డి

వికీపీడియా నుండి

కదిరి వెంకటరెడ్డి
కదిరి వెంకటరెడ్డి

తెలుగు వారు గర్వింపదగ్గ అతి కొద్ది మంది దర్శకులలో కదిరి వెంకట రెడ్డి ప్రధముడు. పురాణాలు, జానపద చలన చిత్రాలు తియ్యడంలో సాటి లేని మేటి అనిపించుకొన్న కె.వి.రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రిలో 1 జూలై, 1912 సంవత్సరంలో జన్మించారు. కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలలో కథానాయకులకే కాకుండా ఇతర చిన్న పాత్రలకు సైతం ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఉదాహరణకు సత్య హరిశ్చంద్ర చిత్రంలో రేలంగి, జగదేకవీరుని కథ చిత్రంలో రాజనాల, మాయాబజార్ చిత్రంలో ఎస్వీ.రంగారావు పాత్రలు. అంతే కాక కె.వి.రెడ్డి సినిమాలలో గిల్పం, తసమదీయులు, పరవేశ దవారం, డింభక లాంటి కొత్త పదాలు వినిపించడం కద్దు. కె.వి.రెడ్డి సినిమాలలో కథ, చిత్రానువాదం, పాత్రల విశిష్టతే కాకుండా సంగీతం కూడా ఎంతో బాగుంటుంది.

విషయ సూచిక

[మార్చు] సినీ ప్రస్థానం

సినిమాల గురించీ, సినిమా నిర్మాణం గురించీ తెలుసుకుని, పుస్తకాలు చదివి సినిమాలమీద అభిమానం పెంచుకున్న కె.వి.రెడ్డి స్నేహితుడైన మూలా నారాయణస్వామి సలహా మీద గృహలక్ష్మి (1938) సినిమాకు కేషియర్ గా పని చేశారు. తరువాత వాహినీ సంస్థ బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి దర్శకత్వంలో నిర్మించిన వందేమాతరం (1939) సినిమాకు ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేశారు. ఇదే సినిమాకు పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నారు. తరువాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి సినిమాలైన సుమంగళి (1940), దేవత (1941), స్వర్గసీమ (1945) అన్నింటికీ ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేశారు. వాహినీ సినిమాలలో ఆయన ప్రొడక్షన్‌ మేనేజరు, కాషియరూ అయినా ఆలోచనంతా సినిమా దర్శకత్వం, నిర్మాణం మీదనే ఉండేది.

[మార్చు] భక్త పోతన

కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన మొదటి సినిమా భక్త పోతన (1942). భక్తపోతన పెద్ద హిట్‌ కావడంతో యోగివేమన (1947) తీశారు కె.వి.రెడ్డి. ఆర్థికంగా లాభించకపోయినా ప్రపంచ సినిమాల స్థాయిలో ’యోగివేమన‘ కూడా ఒక క్లాసిక్‌ అన్న ఖ్యాతి లభించింది. ఈ రెండు సినిమాలలో కూడా చిత్తూరు నాగయ్య కథానాయకుడు. తరువాత సినిమా గుణసుందరి కథ (1949). ఇందులో విషాద పాత్రలకు పేరు పొందిన శ్రీరంజని గుణసుందరీ దేవిగా నటించింది. ఈ సినిమాకు కె.వి.రెడ్డి మరియు కమలాకర కామేశ్వరరావు కలసి చిత్రానువాదం అందించగా పింగళి నాగేంద్రరావు సంభాషణలు వ్రాసారు.

[మార్చు] పాతాళ భైరవి

కె.వి.రెడ్డి మరియు విజయా సంస్థల పేర్లను ఆంధ్రదేశంలో ప్రతి ఒక ఇంట్లో మారుమ్రోగేలా చేసిన పాతాళ భైరవి సినిమా 1951 సంవత్సరంలో విడుదలైంది. జానపదాల్లో పాతాళభైరవి అనేక విషయాల్లో మార్గదర్శకమైంది. ఈ సినిమా కథకు చందమామ పత్రికలో వచ్చిన ఒక కథ మూలం. నేపాలీ మాంత్రికుణ్ణి సంహరించి తన సాహసంతో ఉజ్జయినీ రాకుమార్తెను పొందే వీరుడిగా ఎన్.టి.రామారావు సరిగ్గా సరిపోయారు. నేపాళీ మాంత్రికుడుగా అద్భుతంగా నటించిన ఎస్వీ.రంగారావుకీ ఈ సినిమా ద్వారా మంచిపేరు వచ్చింది. ముఖ్యంగా సాహసం చేయరా డింభకా, రాకుమారి లభించునురా అన్న వాక్యం ప్రాచుర్యం పొందింది. నేపాళీ మాత్రికునితో పాటు ఉండే డింగిరి పాత్రలో పద్మనాభం నటించారు. ఉజ్జయినీ మహారాజుగా సి.యెస్.ఆర్.ఆంజనేయులు నటించగా, అమాయక రాకుమారుని పాత్రలో రేలంగి నవ్విస్తారు. ఈ సినిమాలోని ఒక పాటలో మహానటి సావిత్రి కనిపించడం విశేషం. ఈ చిత్రంలాగే ఇందులోని పాటలు కూడా అద్భుత విజయం సాధించాయి. ముఖ్యంగా కలవరమాయే మదిలో, ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడూ పాటలు ఆంధ్ర్రదేశమంతా మారుమోగాయి.

[మార్చు] పెద్ద మనుషులు

పాతాళభైరవి లాంటి జానపదం తీసిన తరువాత 1954లో సాంఘికం అయిన పెద్ద మనుషులు చిత్రం విడుదలైంది. సాంఘికాల్లో పెద్ద మనుషులు చిత్రాన్ని కీర్తిస్తూ న భూతో న భవిష్యతి అన్నారు అప్పటి విమర్శకులు. పదవుల ఘరానా ముసుగులో అవతవకలకు పాల్పడే పెద్దలను విమర్శిస్తూ తీశారు ఈ సినిమా. పెద్దలు చేసే పనులలో లొసుగులను బయటపెట్టే తిక్క శంకరయ్య పాత్ర రేలంగి గారి సినీ జీవితంలో మరపురాని పాత్రలలో ఒక్కటి. ప్రముఖ రచయిత డి.వి.నరసరాజుగారికి ఇదే తొలి సినిమా. కొసరాజు వ్రాసిన శివ శివ మూర్తివి గణనాథా, నీవు శివుని కుమారుడవు గణనాథా పాట ఇప్పటికీ వినడుతూంటుంది.

[మార్చు] దొంగ రాముడు

దుక్కిపాటి మధుసూదనరావు, అక్కినేని నాగేశ్వరరావు కంపెనీ ఆరంభించినా, కె.వి.రెడ్డిచేతనే తొలి చిత్రం తీయించాలని, ఆయన కోసం రెండేళ్లు పైచిలుకు కాలం నిరీక్షంచవలసి వచ్చింది. ఆ చిత్రం అన్నపూర్ణావారి దొంగరాముడు (1955). ఈవాళ ఆ చిత్రం పూనా ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని విద్యార్ధులకు బోధనాపాఠం. ఒక దొంగ తన తప్పులు తెలుసుకొని తనను తాను సంస్కరించుకొనే పాత్రలో ఏయెన్నార్ చక్కగా నటించారు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు మరియు ఆర్.నాగేశ్వరరావు మధ్య పోరాట సన్నివేశాలను అత్యంత సహజంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఇందులో సావిత్రి పూలమ్మే అమ్మాయిగా నటించగా జమున అక్కినేని నాగేశ్వరరావుకు చెల్లెలుగా నటించింది. సానుభూతిపరుడైన వైద్యునిగా కొంగర జగ్గయ్య నటించారు.

[మార్చు] మాయా బజార్

మాయాబజార్ పూర్తి స్థాయి వ్యాసంకోసం ఇది చూడండి ఒక్క మాయాబజార్‌ సినిమా చాలు చిత్రానువాదం (స్క్రీన్‌ ప్లే) నడపడంలో కె.వి.రెడ్డి వైదుష్యం ఎంతటిదో అర్థం కావడానికి. ఆ చిత్రం ఎన్ని సార్లు చూసినా, ఏదో ఒక నన్నివేశం అనవసరం అనిపించదు. అలాగే ఇంకేదో సన్నివేశం అవసరం ఉందనీ అనిపించదు. సినిమా మూడు గంటలపాటు నడిచినా ముప్పావుగంటలో అయిపోయిందన్న భ్రమకల్పించడానికీ, సర్వకాలాల్లోనూ సర్వప్రేక్షకుల్నీ అలరిస్తూ ఆహ్లాదపరచడానికీ, ఆ చిత్రానువాదమే కారణం. తెలుగు సినిమా చరిత్రలో విడుదలైన అధ్బుత చిత్రాలలో ఈ సినిమా ప్రధమ స్థానం అలంకరించిందంటే అది ఆ దర్శకచక్రవర్తి ప్రజ్ఞ. ప్రజ్ఞతో చేసిన తపస్సు. పాతాళ భైరవి తరువాత కెవి.రెడ్డి విజయా సంస్థకు చేసిన రెండవ సినిమా ఇది. దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణ కుమారుడితో వివాహం నిశ్చయమైన శశిరేఖను, ఘటోత్కచుడు తన మాయజాలంతో అపహరించి, తన ఆశ్రమంలో అభిమన్యుడితో వివాహం జరిపించడం, తాను మాయా శశిరేఖ అవతారం దాల్చడం, కౌరవులను ముప్పుతిప్పలు పెట్టడం, కృష్ణుడు వీటన్నిటికి పరోక్షంగా సహకరించడం, ఇవి ఈ చిత్రంలోని కథాంశం.

[మార్చు] జగదేకవీరుని కథ

1958లో ఎన్.టీ.ఆర్, జమున నటించిన పెళ్ళినాటి ప్రమాణాలు లాంటి సాంఘికం చేసిన తరువాత 1961లో జగదేకవీరుని కథ లాంటి అద్భుత జానపదాన్ని తీశారు కె.వి.రెడ్డిగారు. ఇందులో నలుగురి కథానాయికలలో ఒకరిగా బి.సరోజాదేవి నటించింది. ప్రతాప్ అనే రాకుమారుడు దేవకన్యలను పెళ్ళి చేసుకొనే కోరికతో బయలుదేరి, దేవతలనే మెప్పించి నాగ కన్య, అగ్ని పుత్రిక, వరుణుడి కుమార్తె, ఇంద్ర పుత్రికలను పెళ్ళాడటం ఈ చిత్రంలోని కథాంశం. ఇందులోని శివశంకరి పాట ఎంతో పేరుపొంది ఘంటసాల కీర్తిని శాశ్వతం చేసింది

[మార్చు] శ్రీకృష్ణార్జున యుద్దం

1962 సంవత్సరంలో తెలుగు సినిమాకు రెండు కళ్ళయిన రామారావు - నాగేశ్వరరావు కలసి నటించిన శ్రీకృష్ణార్జున యుద్దం విడులైంది. మహాభారతంలోని పాత్రలను తీసుకొని కల్పించిన కథ తో ఈ చిత్రాన్ని తీసారు. గయుడు అనే గంధర్వుడు పుష్పకవిమానంలో వెడుతుండగా తను నములుతున్న తాంబూలాన్ని భూమి మీదకు ఉమ్ముతాడు. అది సంధ్యావందనం చేస్తున్న శ్రీకృష్ణుని చేతులో పడూతుంది. దానితో ఆగ్రహించిన కృష్ణుడు గయుణ్ణి సంహరిస్తానని శపథం చేస్తాడు. దానితో భీతిల్లిన గయుడు నారదుని సలహామీద అసలు విషయం చెప్పకుండా అర్జునుడు శరణు పొందుతాడు. తరువాత విషయం తెలిసికూడా ఇచ్చిన అభయం నిలబెట్టుకోవడం కోసం అర్జునుడు శ్రీకృష్ణుడితో పోరాడటం ఇందులోని కథాంశం.

[మార్చు] సత్య హరిశ్చంద్ర

1965 సంవత్సరంలో కె.వి.రెడ్డి హరిశ్చంద్రుని పాత్రలో ఎన్.టీ.ఆర్ ను, చంద్రమతి పాత్రలో ఎస్.వరలక్ష్మి ను తీసుకొని సత్య హరిశ్చంద్ర చలన చిత్రాన్ని తీశారు. విశ్వామిత్రునిగా గుమ్మడి నటించగా, కాటికాపరి పాత్రలో రాజనాల నటించారు

[మార్చు] శ్రీకృష్ణ సత్య

1972 సంవత్సరంలో కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన చివరి చిత్రం శ్రీకృష్ణ సత్య విడుదలైంది. కృష్ణుని పాత్రలో మళ్ళీ ఎన్.టీ.ఆర్ నటించగా, సత్యభామ పాత్రలో జమున నటించింది.

[మార్చు] దర్శకత్వ శైలి

నిర్మాణ శాఖనీ, దర్శకత్వ శాఖనీ రెంటినీ ఆకళింపు చేసుకున్న వ్యక్తి కె.వి.రెడ్డి. ఏ చిత్రం తాను డైరెక్టు చేసినా, పథకం అంతా ఆయనే సిద్ధం చేసేవారు. వేసుకున్న బడ్జెట్‌లోనే సినిమా తియ్యడం సాద్యం చేసుకున్నట్టుగానే రాసుకున్న సినిమా నిడివిని దాటకుండా, సుసాధ్యం చేసుకోగలిగిన దర్శకుడు కె.వి.రెడ్డి. నిడివి విషయంలో ఎంతో దూరాలోచన ఉండేది కె.వి.రెడ్డికి. అలాగే కె.వి.కి దూరదృష్టి కూడా చాలా ఎక్కువ. ఏది తీసినా, ఏది తలపెట్టినా కథాగమనానికీ, దృశ్యనిర్మాణానికీ ఆయన వెచ్చించవలసిన కాలం వెచ్చించవలసిందే. అందులో రాజీ ఉండదు. ‘గుణసుందరి కథ’ లో ‘శ్రీరంజని హీరోయినా?’ అన్నారు కొందరు - మిత్రులూ, పరులూ. ‘పాతాళభైరవి’ లో ‘రామారావు పక్కన మాలతి ఏం బావుంటుంది?’ అన్నారు వాళ్లే. ‘మాయాబజార్‌’ (57)లో అంత లావు సావిత్రి శశిరేఖా? ‘రేవతి ఛాయాదేవా?’ అన్నవాళ్లకి ‘అందుకే ఛాయాదేవి!’ అని ఆయన సమాధానం ఇచ్చారు. అంతలావు తల్లి ఉన్నప్పుడు పక్కన కూతురిలో ఆ లావు కనిపించదని కె.వి. నమ్మకం. శ్రీరంజని అయినా, మాలతి అయినా కథాపరమైన పాత్రలకి ఏ సమస్యా రాదన్నది - ఆయన విశ్వాసం. బక్కచిక్కిన ‘పోతన’ పాత్రకి భారీమనిషి నాగయ్యేమిటి? - అని అప్పుడే వచ్చింది విమర్శ. నాగయ్య తన నటనతో, తన పర్సనాలిటీని మరపింపజేస్తాడని - కె.వి. ధీమా. ఒక్క కథాగమనం, షూటింగ్‌ పథకాలూ అనే కాకుండా - అన్నీ నిశితంగా ఆలోచించే నిర్ణయిస్తారు కె.వి. చిన్న వేషాలు, పక్కవేషాలు, చెలికత్తెల వేషాల నిర్ణయంలో కూడా ఆ ఆలోచన ఉంటుంది. కె.వి. రెడ్డిని చూసినప్పుడు ‘ఈయనా? సినిమా డైరెక్టర్‌లా లేరే!’ అనుకునేవారు కొత్తవాళ్లు. ముతక ఖాదీపంచె, పొట్టిచేతుల చొక్కా, పర్సు, కాయితాలూ, పెన్నులతో ఎత్తయిన జేబు, భుజం మీద వేల్లాడుతూ కండువా - ఇదీ కె.వి. కాస్ట్యూము. ఎక్కువగా ఇంగ్లీషే మాట్లాడేవారు. అందర్నీ ‘బ్రదర్‌!’ అనేవారు. షూటింగులో కె.వి. విధానమే వేరు. తానుగా చేసి చూపించడమో, నటించడమో చేసి చూపించేవారు కాదు. చెప్పేవారు కూడా కాదు. పాత్రధారుల్నే చెయ్యమనేవారు. అది తనకి కావలసిన రీతిలో లేకపోతే, ఇంకోలాగా, ఇంకోవిధంగా చెయ్యమనీ చెప్పమనీ - తమ ఎన్నికచేసి ఫిక్స్‌ చేసేవారు. ఎక్కువ తక్కువలుంటే చెప్పేవారు. ఆర్టిస్టులకి స్వతంత్రం వుండేది - ఆయన కంట్రోలూ ఉండేది. షాటులో ఆరుగురు నటులుంటే - మాట్లాడే వారొక్కరే అయినా, ఫైనల్‌ రిహార్సల్సు ఆరు చేయించేవారు. ఒకొక్క రిహార్సలులోనూ ప్రతి ఒక్కరి రియాక్షనూ చూసేవారు. ఎక్కువ తక్కువలుంటే - సరిదిద్దేవారు. టేకు ముందుమేకప్‌లు, లైటింగ్‌, కెమెరా పొజిషనూ అన్నీ ఓసారి సరిచూసుకుని ‘టేక్‌!’ చేసేవారు. ఐతే, ఆయన ఏనాడూ ‘ఒకే!’ అని గట్టిగా అనలేదు. ‘పాస్‌!’ అనడమే ఆయన అలవాటు. ‘అంటే పాస్‌ మార్కులు ఇచ్చేవారే గానీ, నూటికి నూరు ఇవ్వడం మేము ఎరగం!’ అని చెప్పారు ఆయన చిత్రాల్లో మంచిపాత్రలు ధరించి పేరు తెచ్చుకున్న రేలంగి. కె.వి.రెడ్డిగారి షూటింగుకి విజిటర్స్‌కి అనుమతి ఉండేది కారు. మరీ కావలసినాళ్లో, తప్పనిసరో అయితే ముగ్గురికో, నలుగురికో అనుమతి ఇచ్చేవాళ్లు - అదీ పది, పదిహేను నిమిషాల్లోవెళ్లిపోవాలి. పూర్తి నిశ్శబ్దం, క్రమశిక్షణ, ఏకాగ్రత కనిపించేవి ఆయన షూటింగుల్లో. చిత్రాలు డైరెక్టు చెయ్యమని బయటినుంచి ఎంత డిమాండ్‌ వున్నా - ఆయన అంగీకరించేవారు కాదు. ఒక సినిమా అయిన తర్వాతే - ఇంకో సినిమా ఆలోచన. ‘మిగతా డైరెక్టర్లు ఒకేసారి రెండుమూడు చిత్రాలు చేస్తున్నారుకదా!’ అంటే - ‘ఐయామ్‌ సారీ! ఐ డోంట్‌ హావ్‌ టు బ్రెయిన్స్‌!’ అన్నది కె.వి.సమాధానం. జయాపజయాలు అనేవి అందరికీ వుంటాయి. అన్నిచోట్లా వుంటాయి. కె.వి.కీ వున్నాయి ‘చిత్రాలు విజయం పొందినప్పుడు ఎలా స్పందిస్తామో, పరాజయం పొందినప్పుడూ స్పందిస్తాం. రెండిటినీ సమానంగానే యాక్సెప్ట్‌ చెయ్యాలి!’ అనేవారు రెడ్డిగారు.

[మార్చు] విశేషాలు

  • చిత్ర నిడివి విషయంలో కె.వి.రెడ్డిగారికి ఎంత దూరాలోచన అంటే - ఒక ఉదాహరణ : దృశ్యాల విభజన జరిగిన తర్వాత సంభాషణలు నిర్ధారించుకున్న తర్వాత ‘ఇంత నిడివి ఉండాలి’ అని నిర్ణయించుకున్న తర్వాత - సహాయకులచేత సీన్లు చదివించుకుని స్టాప్‌ వాచ్‌ పెట్టుకుని, టైముచూసుకుని, ‘పుటేజ్‌’ నోట్‌చేసుకోవడం - ఆయన అలవాటు. అలా ఆయన ‘గుణసుందరి కథ’ (1949) లోని ఒకదృశ్యం విని - ‘ఎంతొచ్చింది?’ అని అడిగారు. ‘రెండు నిమిషాలొచ్చింది’ అన్నాడు సహాయదర్శకుడు. ‘కాదు, ఇంకో అరనిమిషం పెరుగుతుంది. ఎంచేతంటారా రాజుగారి వేషం వేస్తున్నది గోవిందరాజు సుబ్బారావు. మీరు చదివినట్టుగా ఆయన డైలాగులు చెప్పరు. ఇంకా తాపీగా చెబుతారు. అంచేత, ఆయన ఉన్న ప్రతి దృశ్యాన్నీ మనం వేసుకున్న టైముకి మరికొంత కలుపుకుంటూ రావాలి!’ అని కె.వి. వివరించినట్టు - పింగళి నాగేంద్రరావు గారు ఓసారి చెప్పారు
  • ‘జగదేకవీరుని కథ’ (1961) షూటింగ్‌ ఆరంభానికి నాలుగునెలల ముందే, కార్యక్రమాలు, షెడ్యూలు సిద్ధమైనాయి. ‘జలకాలాటలలో....’ పాట జనవరిలో పడింది. కాల్‌ షీట్‌ టైము ఉదయం ఏడుగంటలకి. జనవరి అంటే చలిరోజులు. నలుగురు అమ్మాయిలు ఆరున్నరకే రెడీ అయి, ఈతకొలనులోకి దిగాలి. నీళ్లు వెచ్చగా ఉంటే వాళ్లు హాయిగా దిగుతారు. లేకపోతే నసుగుతారు. పైగా చాలాసేపు నీళ్లలో ఉండాలి గనక - ‘ఆ పాట తీసే మూడుపూటలూ వేడి నీరు సరఫరా చెయ్యాలి’ అని నోట్‌ రాసి, ప్రొడక్షన్‌వారికి అందజేశారు. షూటింగ్‌ వేళకి వెచ్చని నీళ్లు ‘పంపు’ కావడం, అనుకున్న షూటింగ్‌ రెండుపూటల్లోనే పూర్తికావడం జరిగాయి.

[మార్చు] పని చేసిన సినిమాలు

దర్శకత్వం వహించినవి
  1. భక్త పోతన (1942)
  2. యోగి వేమన (1947)
  3. గుణసుందరి కథ (1949)
  4. పాతాళభైరవి (1951)
  5. పెద్దమనుషులు (1954)
  6. దొంగరాముడు (1955)
  7. మాయాబజార్ (1957)
  8. పెళ్ళినాటి ప్రమాణాలు (1958)
  9. జగదేకవీరుని కథ (1961)
  10. శ్రీకృష్ణార్జున యుద్ధం (1963)
  11. సత్య హరిశ్చంద్ర (1965)
  12. భాగ్యచక్రం (1968)
  13. ఉమా చండీ గౌరీ శంకరుల కధ (1968)
  14. శ్రీకృష్ణసత్య (1971)
చిత్రానువాదం అందించినవి
  1. గుణసుందరి కథ (1949)
  2. దొంగరాముడు (1955)
కథ అందించినవి
  1. దొంగరాముడు (1955)
  2. మాయాబజార్ (1957)
నిర్మాతగా వ్యవహరించినవి
  1. పెళ్ళినాటి ప్రమాణాలు (1958)
  2. జగదేకవీరుని కథ (1961)
  3. శ్రీకృష్ణార్జున యుద్ధం (1963)
  4. సత్య హరిశ్చంద్ర (1965)
  5. భాగ్యచక్రం (1968)
  6. ఉమా చండీ గౌరీ శంకరుల కధ (1968)

[మార్చు] వనరులు

Static Wikipedia (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2006 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu

Static Wikipedia February 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu