శ్రీరామగిరి
వికీపీడియా నుండి
శ్రీరామగిరి, వరంగల్ జిల్లా, నెల్లికుదురు మండలానికి చెందిన గ్రామము ,
శ్రీరామగిరి అనునది వరంగల్ జిల్లా లొ ఒక చిన్న గ్రామం. ప్రస్తుతం ఈ గ్రామ జనాభా సుమారు 4000 పైగా ఉంటుంది. ఈ గ్రామం శివారున పెద్ద చెరువు ఉంది. ఈ చెరువును కాకతీయులు త్రొవ్వించారు. ఈ చెరువుకి శీతాకాలంలొ విదేశీ పక్ష్లులు వలస వస్తంటాయి. ఇక్కడి ప్రక్రుతి చూడడానికి అందంగా,రమణీయంగా ఉంటుంది. పురాణ కాలంలో శ్రీరాముడు లంక నుండి వెళుతూ ఈ ప్రాంతంలో బస చేసాడని అందుకు గుర్తుగా ఇక్కడ కొండ మీద ఆలయం నిర్మంచారని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ గ్రామానికి సుమారు రెండు కిలో మీటర్ల దూరంలో పేద్ద కొండ మీద శ్రీ శ్రీరాముడి ఆలయం, శివాలయం లు ఉన్నాయి. ఈ అలయాలు కూడా కాకతీయుల కాలం నాటివి. ప్రతీ శ్రీరామనవమికి మరియు మహా శివరాత్రికి ఇక్కడ పూజలు, ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. తెలంగాణలొ విశేశ ప్రాచుర్యం గల బోనాల పండగ కూడ ఘనంగా నిర్వహిస్తారు. ఈ కొండ మీద ఏడుగురు అక్కచెల్లెల్ల బావి ఉంది, ఈ బావి నుండి చెరువుకి సొరంగ మార్గం ఉంది అని ఇక్కడి ప్రజలు చెపుతంటారు, అందుకు నిదర్శనంగా ఈ బావిలొ వేసిన వస్తువు చెరువులొ తేలుతుంది, బావి కొండకి మధ్య సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ఊరిలో స్వతంత్ర సమరయోధులు కూడా ఉన్నారు. అందులో కీ.శే. చకిలం హనుమంతా రావు గారు మరియూ కీ.శే. కొండపల్లి సీతారామారావు గార్లు ప్రముఖులు. ఈ గ్రామం ఇప్పుడిప్పుడె అభివృద్ది దిశగా పయనిస్తుంది.
- ఖమ్మం జిల్లా, వరరామచంద్రపురం మండలానికి చెందిన ఇదే పేరుగల గ్రామము కోసం చూడండి.