సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్
వికీపీడియా నుండి
సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ (మ.1543) దక్షిణ భారతదేశములోని గోల్కొండ రాజ్యాన్ని 1518 నుండి 1687 వరకు పరిపాలించిన కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు.
తుర్కమేనిస్తాన్ కు చెందిన ముస్లిం యువకుడు కులీ కుత్బుల్ ముల్క్ కొంతమంది బందువులు, మిత్రులతో కలిసి 16వ శతాబ్దము ప్రారంభములో ఢిల్లీకి వలసి వచ్చాడు. ఆ తరువాత దక్షినాన దక్కన్లో స్థిరపడి బహుమనీ సుల్తాను మహమ్మద్ షా వద్ద పనిచేశాడు. ఈయన 1518లో గోల్కొండను జయించి గోల్కొండ ప్రాంతానికి సామంతుడైనాడు. బహుమనీ సామ్రాజ్య పతనము తరువాత స్వాతంత్ర్యము ప్రకటించుకొని కుతుబ్ షా అనే పట్టం ధరించి, గోల్కొండ కుతుబ్ షాహీ వంశ స్థాపన చేసాడు.
సుల్తాన్ కులీ, విజయనగర చక్రవర్తులు శ్రీ కృష్ణదేవరాయలు మరియు అచ్యుత దేవ రాయలు యొక్క సమకాలికుడు.
కుతుబ్ షాహీలు | |
---|---|
సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ | జంషీద్ కులీ కుతుబ్ షా | సుభాన్ కులీ కుతుబ్ షా | ఇబ్రహీం కులీ కుతుబ్ షా | మహమ్మద్ కులీ కుతుబ్ షా | సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా | అబ్దుల్లా కుతుబ్ షా | అబుల్ హసన్ కుతుబ్ షా |