ఎయిడ్స్
వికీపీడియా నుండి
ఎయిడ్స్(AIDS) ఒక ప్రాణాంతకమయిన వ్యాధి. ఇది హెచ్ఐవి Human immunodeficiency virus (HIV) అను వైరసు వలన వస్తుంది.
AIDS అనేది Acquired Immune Deficiency Syndrome(ఎక్యైర్డ్ ఇమ్యూన్ డెఫీసియన్సీ సిండ్రోం)కు పొడి నామము. అంటే రోగాలను తట్టుకునే శక్తి నశించటం అన్న మాట. హెచ్ఐవి వైరసు మనుషులలో ఇలా రోగనిరోధక శక్తిని తగ్గటానికి ప్రధాన కారణం. హెచ్ఐవిలో హెచ్ అనేది హ్యూమాన్‌ని సూచిస్తుంది, అంటే ఈ వైరసు మనుషులకు మాత్రమే సోకుతుంది.
విషయ సూచిక |
[మార్చు] ప్రపంచంలో ఎంతమందికి ఎయిడ్స్ ఉంది?
2004లోనే 30,00,000మంది ఎయిడ్స్ బారిన పడి చనిపోయారు, వీరిలో 5,00,000 మంది చిన్నారులే. ఇంకో 40,00,000 మందికి 2004లోనే ఎయిడ్స్ సోకి ఉంటుందని ఒక అంచనా. ఎయిడ్స్ భాదితులలో అత్యధికులు ఆఫ్రికా ఖండంవారే. వారి తరువాత స్థానంలో భారతదేశం ఉంది. మే 2005 నాటి లెక్కల ప్రకారం భారతదేశంలో 1,09,349 మందికి ఎయిడ్స్ ఉన్నట్లు నిధారణ అయింది, అందులో 31,982 మంది ఆడవారయితే, 37% మంది 30ఏళ్ళలోపు వారు. ఇవి కాక నమోదు కాని కేసులు ఎన్నో ఉంటాయి. అంతే కాదు భారత దేశంలో ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఆంధ్ర ప్రదేశ్లోనే చాలా తొందరగా పెరుగుతుందని కేంద్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(NACO) చెబుతుంది. దేశంలో 10% మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఆంద్రప్రదేశ్‌లోనే ఉన్నారు.
[మార్చు] ఎయిడ్స్ ఎక్కడ నుండి వచ్చింది?
శాస్త్రఙుల అంచనా ప్రకారం హెచ్ఐవి వైరసు సోకిన మొదటి వ్యక్తి ఆఫ్రికా ఖండంళోనే ఉండాలి. ఇది 1915, 1941ల మధ్య జరిగి ఉండవచ్చని ఊహిస్తున్నారు. అప్పట్లో అక్కడ చింపాంజీలకు ఎస్ఐవి(SIV)సోకుతూ ఉండేది, ఇది హెచ్ఐవిగా రూపాంతరం చెంది మనుషులకు సోకటం ప్రారంభించింది అని చెబుతారు. కానీ అధికారిక లెక్కల ప్రకారం జూన్ 18, 1981న అమెరికాలో మొదటి ఎయిడ్స్ కేసు నమోదయింది. దీనిని మొదట గే సంభందమయిన(gay-related), వేరొక పురుషుని యెడల లైంగికంగా ఆకర్షింపబడే పురుషుడు, వ్యాధి అని అపోహ పడ్డారు. కాని వచ్చిన కేసులలో సగంపైగా గే కానివారు కావటం వలన అందరికీ వచ్చే జబ్బుగా నిర్ధారించారు.
[మార్చు] మనుషుల శరీరంలో ఎయిడ్స్ ఏం చేస్తుంది?
హెచ్ఐవి వైరసు మనుషులలో చేరిన వెంటనే, రోగనిరోదకతను దెబ్బతీస్తుంది. తద్వారా వ్యాధి గ్రస్తులు త్వరగా జలుబు తదితర అంటురోగముల బారిన త్వరగా పడతారు. అంతే కాదు, క్యాన్సరు రాకుండా ఉండటానికి ఈ రోగనిరోధకత ఎంతో అవసరం. కాబట్టి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు క్యాన్సరు బారిన పడే అవకాశాలు ఎక్కువ.
[మార్చు] హెచ్ఐవి మరియూ ఎయిడ్స్
హెచ్ఐవి వైరసు ఉన్న అందరికీ ఎయిడ్స్ ఉన్నట్లు కాదు. శరీరం లోపల హెచ్ఐవి వైరసూన్నా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆరోగ్యంగానే కనిపిస్తారు. వారికి ఎప్పిడయితే ఆరోగ్యం నశిస్తుందో అప్పుడు ఎయిడ్స్ వచ్చినట్లు లెక్క.
ఒక వ్యక్తి శరీరంలో హెచ్ఐవి వైరసు ఉన్నట్లయితే అతనిని హెచ్ఐవి పాసిటీవ్ అని సంభోదిస్తారు.
హెచ్ఐవి ఉన్న వారికి ఎయిడ్స్ వచ్చినట్లు ఎప్పుడు నిర్ధారిస్తారంటే:
- రక్త పరీక్ష చేసినప్పుడు రోగనిరోదకత బాగా క్షీణించిందని తేలినప్పుడు.
- ఎయిడ్స్ కలిగించిన రుగ్మత
[మార్చు] ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు (AIDS defining illness)
ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు సాధారణంగా ఎవరికీ రావు. మనుషులకు ఉండే సహజసిద్దమయిన రోగనిరోధక శక్తి వాటిని అడ్డుకుంటాయి, కాబట్టి వారికి రావు. అందుకనే వీటికి ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు అని పిలుస్తారు. ఎయిడ్స్ కలిగించే కొన్ని రుగ్మతలు కింద ఇవ్వబడినవి:
- కపోసీస్ సర్కోమా(Kaposi's Sarkoma) - సాధారణంగా చర్మానికి వచ్చే క్యాన్సరు.
- సిఎంవి రెటీనైటిస్(CMV Retinitis) - కంటి వెనుక భాగంలో సోకే ఒక వైరసు.
- పిసిపి(PCP) - ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో చాలా మందికి సోకే రోగము, ఇది ఊపిరితిత్తులకు సోకుతుంది.
- టాక్సోప్లాస్మోసిస్(Taxoplasmosis) - ఈ రోగము మెదడుకు సోకుతుంది.
- ఇన్వేసీవ్ సెర్‌వికళ్ క్యాన్సర్ (Invasive Cervical Cancer) - ఇది ఆడవారి గర్భకోశం కింద వ్యాపించే క్యాన్సరు.
[మార్చు] సిడి4(CD4) కణాల సంఖ్య
మనుషుల రోగనిరోధకతకు రక్తంలో సిడి4 అనే రకం తెల్ల రక్త కణాలు ఎంతో దోహద పడతాయి. ఇవి రోగకారక జీవాలతో పోరాడి మనుషులను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే హెచ్ఐవీ ఈ సిడి4 కణాలను చంపేస్తుంది. హెచ్ఐవి పెరుతున్నకొద్దీ ఈ సిడి4 కణాలు నశించటం ప్రారంబిస్తాయి. ఒక మైక్రోలీటరులో 200 కన్నా తక్కువ సిడి4 కణాలు ఉన్నట్లయితే అప్పుడు ఎయిడ్స్ ఉన్నట్లు ద్రువపరుస్తారు.
[మార్చు] ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుంది
- లైంగిక సంపర్కం వలన. ప్రపంచంలోని అత్యధికులు ఈ మార్గం ద్వారానే ఎయిడ్స్ బారిన పడుతున్నారు.
- రక్తం ద్వారా. పచ్చబొట్లు పొడిపించుకోవటం వలన, వ్యాధి గ్రస్తుని రక్తదానం వలన కూడా ఎయిడ్స్ వ్యాపించ వచ్చు. పచ్చబొట్టు వళ్ళ ఎందుకంటే, వారు ఒకరికి ఉపయోగించిన సూదినే మళ్ళీ ఇంకొకరికి ఉపయోగిస్తారు, అయితే ఇలాంటి కోవాకే చెందిన క్షవరం, సుంతీ, ఇంజెక్షను మొదలగునవి చేయించుకునేటప్పుడు అప్రమత్తతో మెలగ వలెను.
- తల్లి నుండి బిడ్డకు. తల్లి గర్భంలో పెరుగుతున్న బిడ్డకు ఆఖరి వారాలలో ఈ వ్యాది కోకే ప్రమాదం ఉంది. అప్పుడప్పుడూ చనుబాల వలన కూడా సంక్రమిస్తుంది. సరయిన చికిత్స తీసుకోనప్పుడు ఈ రకమయిన వ్యాప్తికి ఆస్కారం 20% అయితే, సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీసి సరయిన చికిత్స ఇవ్వగలిగితే అప్పుడు ఎయిడ్స్ వ్యాప్తిని ఒక్క శాతానికి తగ్గించవచ్చు.
[మార్చు] హెచ్ఐవి మరియు ఎయిడ్స్‌ల చికిత్స
ప్రస్తుతానికయితే ఎయిడ్స్‌ని పూర్తిగా నిర్మూలించటానికి ఎటువంటి మందు కానీ టీకా కానీ తయారు చేయలేదు. కానీ దాని తీవ్రతని తగ్గించటానికి మందులు ఉన్నాయి, అవి కొంచెం ఖరీదయినవే.
కొన్ని హెచ్ఐవి వైరసులు కొన్ని మందులను తట్టుకోగలవు. అందుకని వాటి చికిత్సకు ఒకేసారి రెండు మూడు రకాల మందులను వాడుతూ ఉంటారు. అందుకనే వాటిని హెచ్ఐవి కాక్‌టెయిల్ అని పిలిస్తారు. అయితే హెచ్ఐవీ చాలా తొందరగా మందులను తట్టుకునే సామర్ధ్యం పెంచేసుకుంటున్నాయి. కొన్నయితే ఒకటి కంటే ఎక్కువ మందులను తట్టుకోగలుగుతున్నాయి. కాబట్టి శాస్త్రఙులు ఎప్పటికప్పుడు హెచ్ఐవితో పోరాడటానికి కొత్త కొత్త మందులను కనిపెడుతూనే ఉన్నారు.
హెచ్ఐవి చెకిత్సకు సంబందించి ఐదు ముఖ్యమయిన మందులు:
- D4T (stavudine) స్టావిడైన్
- 3TC (Lamivudine) లామివుడైన్
- NVP (nevirapine) నెవిరపైన్
- AZT (zidovudine) జిడోవుడైన్
- EFZ (efavirenz) ఎఫావిరెంజ్
ఈ మందులు కేవలం ధనిక దేశాలలో మాత్రమే లభిస్తాయి, ఎందుకంటే వీటికయ్యే ఖర్చు చాలా ఎక్కువ. ఒక్కో వ్యక్తికి నెలకు $1000, అంటే సుమారు 50,000 రూపాయలు ఖర్చు పెటవలసి ఉంటుంది. అయితే ఈ మందును కనిపెట్టి తయారు చేసే కంపెనీలు వాటిని తక్కువ ధరకు పేద దేశాలలో అమ్మటానికి ముందుకు రావటం లేదు. ఆందుకు వారు చెప్పే కారణం, "అవి మరలా ఎక్కువ ధరకు ధనిక దేశాలకు తరలించబడి అక్కడ తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని". చాలా కంపెనీలు తమకు వచ్చే లాబాలలో కొంత భాగం మళ్ళీ పరిశోధనలపఈనే వెచ్చిస్తున్నాయి.
[మార్చు] ఎయిడ్స్‌ని ఇలా అరికడదాం
అయితే ఎయిడ్స్‌కి సరయిన, ఖరీదు కాని చికిత్స ఇప్పటి వరకూలేదు. అందుకని దానిని తెచ్చుకోకపోవటం ఎంతో ఉత్తమం. ఎయిడ్స్ రాకుండా దానిని అరికట్టటానికి చాలా మార్గములు ఉన్నాయి.
[మార్చు] సురక్షితమయిన శృంగారం
తొడుగులను(condoms) ఉపయోగించండి. తొడుగులను ఉపయోగించటం వలన ఎయిడ్స్ వ్యాప్తి దాదాపు సున్నాగా ఉంటుంది. దాదాపుగా, యెందుకంటే అప్పుడప్పుడు కొంతమంది తొడుగును సరిగ్గా ఉపయోగించరు కాబట్టి. కాబట్టి సాధ్యమయినంత వరకూ తలియని వారితో సంపర్కించవద్దు. భారత దేశంలో ఇప్పుడు ప్రభుత్వం ఈ తెడుగులను ప్రజలకు విరివిగా అందుబాటులో ఉండాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాదు ఒక సారి వాడిన తొడుగులను ఎట్టిపరిస్తితుల్లోను రెండోసారి వాడరాదు. తొడుగులకు కూడా మురిగిపూవు తారీఖు ఉంటుంది, ఒక సారి పరిశీలించి తీసుకోండి. తొడుగులు మగవారికే కాదు ఆడవారికి కూడా లభ్యమవుతున్నాయి.
[మార్చు] ఎయిడ్స్ ఇలా వ్యాపించదు
ఈ క్రింది మార్గాలలో ఎయిడ్స్ వ్యాధి 'వ్యాపించదూ:
- ఈగలు,దోమ కాటు,నల్లులు,పేల వలన.
- స్పర్శించటం వలన,హెచ్‍ఐవి/ఎయిడ్స్ వ్యక్తిని కౌగలి౦చుకొవడ౦ వలన
- వ్యాధిగ్రస్తుని బట్టలు ధరించటం వలన.
- ఒకే మరుగు దొడ్లను ఉపయోగించటం ద్వారా.
- ఎయిడ్సగల వారితొ కలిసిమెలిసి జివి౦చడ౦ వల్ల ఇది రాదు.
- ఎయిడ్సపిడితుల స౦రక్షణ బాధ్యతవహి౦చేవారికి ఆ కారణ౦గా ఇది సొకడ౦ జరగదు.
- హెచ్‍ఐవి/ఎయిడ్స్ ఉన్నవారితొ కలసి పనిచేయడ౦ వలన స౦క్రమణకు గురయ్యే ప్రమాద౦ ఎ౦తమాత్ర౦ లేదు.
[మార్చు] కొన్ని ప్రశ్నలు
- ఎయిడ్స్ రాకు౦డా ఏవైనా టీకాలు ఉన్నాయా?
- హెచ్.ఐ.వి. రాకు౦డా నిరొది౦ఛే టీకా ఉత్పత్తి కొస౦ ప్రప౦చవ్యాప్త౦గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇ౦దుకోస౦ మిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేస్తున్నారు కూడా. భారతదేశ౦ విషయానికొస్తే కే౦ద్ర ప్రభుత్వ స౦స్థ "నారి" (జాతీయ ఎయిడ్స్ పరిశొధనా స౦స్థ, చేన్నై) ఈ దిశగా ఎ౦తో కృషి చేస్తోంది. వ్యాక్సిన్ పరిశొధనలు,వివిధ దశలలొ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అయితే ఇది ఇప్పటికే వ్యాధిగ్రస్తులైన వారికి మాత్ర౦ ఉపయోగపడదు. కొత్తగా ఎవరూ హెచ్.ఐ.వి బారిన పడకు౦డా మాత్రమే కాపాడగలదు.
- ఎయిడ్స్ గ్యార౦టీగా నయ౦ చేయగలమని కొ౦దరు పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారు. నమ్మవచ్చా?
- ఇ౦తవరకు ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా నయ౦ చేసే మ౦దులు తయరు కాలేదు.అయితే ఎయిడ్స్ దశలో రోగి జివిత కాలాన్ని పొడిగి౦చే "ఎ.అర్.టి." మ౦దులు అ౦దుబాటులో ఉన్నయి. రాష్ర్ట౦లొని విశాఖపట్న౦ (కెజిహెచ్), గు౦టూరు(జిజిహెచ్), హైదరాబాద్ (ఉస్మానియా) అసుపత్రులలో ఈ మ౦దులు ఉచిత౦గా ఇవ్వడ౦ జరుగుతున్నది. సెప్టె౦బర్ 1 ను౦డి మరొ 9 కే౦ద్రాలు - కడప, కరీ౦నగర్, అన౦తపుర౦, తిరుపతి, కాకినాడ, విజయవాడ, వర౦గల్, ఒ౦గొలు, సికి౦దరాబాదు (గా౦ధీ అసుపత్రి) ప్రార౦భిస్తున్నారు. గ్యార౦టీగా ఎయిడ్స్ నయ౦ చేస్తామ౦టూ ప్రకటనలు ఇచ్చేవారిని నమ్మక౦డి.