భారత దేశము
వికీపీడియా నుండి
|
|||||
ప్రమాణం: సత్యమేవ జయతే |
|||||
జాతీయ గీతం: జన గణ మన | |||||
రాజధాని | న్యూ ఢిల్లీ |
||||
పెద్ద నగరము | ముంబై (బొంబాయి) | ||||
అధికార భాషలు | హిందీ, ఆంగ్లము, మరియు 21 ఇతర భాషలు | ||||
ప్రభుత్వము | గణతంత్ర సమాఖ్య ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ మన్మోహన్ సింగ్ |
||||
స్వాతంత్ర్యము - ప్రకటన - గణతంత్ర |
యునైటెడ్ కింగ్‌డం నుండి 1947-08-15 1950-01-26 |
||||
వైశాల్యము • మొత్తం • నీరు(%) |
3,287,590 km² (7వ) 9.56 |
||||
జనాభా • 2005 అంచనా • 2001 గణన • జన సాంద్రత |
1,080,264,388 (2వ) 1,027,015,247 329/km² (31వ) |
||||
జి.డి.పి (పి.పి.పి) • మొత్తం • తలసరి |
2005 అంచనా $3.334 ట్రిలియన్ (4వ) $3,019 (120వ) |
||||
కరెన్సీ | రూపాయలు (Rs.)1 (INR ) |
||||
కాల మానము • వేసవి (DST) |
IST (UTC+5:30) లేదు (UTC+5:30) |
||||
ఇంటర్నెట్ TLD | .in | ||||
ఫోను కోడ్ | +91 |
||||
1 రూపాయి ఏక వచనము |
భారత గణతంత్ర రాజ్యము వంద కోట్లకు పైగా జనాభా తో ప్రపంచం లో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండవది. వైశాల్యము లో ప్రపంచం లో ఏడవది. భారత దేశ ప్రాముఖ్యత గత రెండు దశాబ్దాలలో గణనీయంగా పెరిగింది. భారత ఆర్ధిక వ్యవస్థ యొక్క స్థూల జాతీయోత్పత్తి పర్చేసింగ్ పవర్ పారిటీ ప్రకారం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థలలో ఇది ఒకటి. ప్రపంచం లోనే అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యము ఐన భారతదేశం, ప్రపంచం లోనే అతి పెద్ద సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగన దేశంగా ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఆవిర్భవించినది.
దక్షణాసియా లో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉండి, భారత ఉపఖండము లో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య రహదారుల పైన ఉన్నది. పాకిస్తాన్, చైనా, మయాన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మరియు ఆఫ్ఘానిస్తాన్[1] దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. శ్రీలంక, మాల్దీవులు మరియు ఇండోనేసియా భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు. భారతదేశము కొన్ని పురాతన నాగరికతలకు పుట్టిల్లు మరియు నాలుగు ముఖ్య ప్రపంచ మతాలకు(హిందూమతము, బౌద్ధమతము, జైనమతము మరియు సిక్కుమతము) జన్మనిచ్చినది. 1947 లో స్వాతంత్ర్యం రావడానికి ముందు బ్రిటీషు సామ్రాజ్యం లో భాగంగా ఉండేది.
విషయ సూచిక |
[మార్చు] పేరు పుట్టుపూర్వోత్తరాలు
ముఖ్య వ్యాసము: భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు
భారత దేశానికి మొత్తం నాలుగు పేర్లు ఉన్నట్లు చెప్పుకోవచ్చు. వీటిలో మొదటిది జంబూ ద్వీపం. ఇది వేదాలలో భారతదేశానికి ఇవ్వబడిన పేరు, ఇప్పటికీ హిందూ మత ప్రార్థనలలో ఈ పేరు ఉపయోగిస్తారు (ఉదా: జంబూ ద్వీపే, మేరో దక్షిణభాగే, శ్రీశైల ఉత్తర భాగే, కృష్ణా గోదావరీ మధ్య స్థానే......). జంబూ అంటే "నేరేడు" పండు లేదా "గిన్నె కాయ", ఈ దేశంలో ఎక్కువగా నేరేడు పండ్లు ఉంటాయి కనుక దీనికి ఈ పేరు వచ్చినది.
- ఆ తరువాత వచ్చిన పేరు "భారతదేశం" లేదా "భరతవర్షం", ఈ పేరు నాటి రాజు పేరు మీదగా వచ్చినది, ఈ రాజు పేరు "భరతుడు". ఇతను విశ్వామిత్ర, మేనకల కుమార్తె అయిన శకుంతల యొక్క కుమారుడు.
తరువాతి పేరు హిందూదేశం, ఇది సింధునది పేరు మీదగా వచ్చినది, పూర్వపు పర్షియనులు, గ్రీకులు సింధునదికి ఆవల ఉన్న దేశం కనుక ఈ పేరుతో పిలిచారు. తరువాత హిందూదేశం యొక్క రూపాంతరం ఐన ఇండియా అనే పేరు, బ్రిటీషు వారి వలన ప్రముఖ ప్రాముఖ్యతను పొందినది, ప్రస్తుతము భారత దేశానికి రెండు ప్రభుత్వ గుర్తింపు పొందిన పేర్లు కలవు, అవి ఇండియా, భారత దేశం. ఇంకా హిందూస్తాన్ అనునది కూడా హిందూ దేశం యొక్క రూపాంతరమే!
[మార్చు] చరిత్ర
ముఖ్య వ్యాసము: భారతదేశ చరిత్ర
మధ్య ప్రదేశ్ లోని భింబెట్కా వద్ద లభ్యమైన రాతియుగపు శిలాగృహాలు, కుడ్యచిత్రాలు భారతదేశంలో మానవుని అతి ప్రాచీన ఉనికికి ఆధారాలు. మొట్టమొదటి శాశ్వత నివాసాలు 9,000 సంవత్సారాల కిందట ఏర్పడ్డాయి. ఇవే . క్రీ.పూ.26 వ శతాబ్దం మరియు క్రీ.పూ.20 వ శతాబ్దం మధ్య కాలంలో వర్ధిల్లిన సింధులోయ నాగరికత ఇదే. క్రీ.పూ.5 వ శతాబ్దం నుండి, ఎన్నో స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. ఉత్తర భారతంలో, మౌర్య సామ్రాజ్యం, భారతీయా సాంస్కృతిక వారసత్వానికి విలువైన సేవ చేసింది. అశోకుడు ఈ వంశంలోని ప్రముఖ రాజు. తరువాతి కాలంలో పాలించిన గుప్తుల కాలం స్వర్ణ యుగం గా వర్ణించబడింది. దక్షిణాన, వివిధ కాలాల్లో చాళుక్యులు, చేర, చోళులు, పల్లవులు, పాండ్యులు పాలించారు. విజ్ఞాన శాస్త్రం, కళలు, సారస్వతం, గణితం, ఖగోళ శాస్త్రం, సాంకేతిక శాస్త్రం, మతం, తత్వ శాస్త్రం మొదలైనవి ఈ కాలంలో పరిఢవిల్లాయి. రెండవ సహస్రాబ్దిలో తురుష్కుల దండయాత్రలతో, భారతదేశంలో ఎక్కువ భాగాన్ని ఢిల్లీ సుల్తానులు, తరువాత మొగలులు పాలించారు. అయినా, ముఖ్యంగా దక్షిణాన స్థానిక సామ్రాజ్యాలు అధికారాన్ని నిలబెట్టుకున్నాయి.
రెండవ సహస్రాబ్ది మధ్యలో, పోర్చుగల్, ఫ్రాన్స్, ఇంగ్లండు వంటి ఐరోపా రాజ్యాలు వ్యాపారం చేసే తలంపుతో భారతదేశం వచ్చి, చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న ఇక్కడి పరిస్థితి గమనించి, ఆక్రమించుకున్నారు. బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ పై 1857లో జరిగిన విఫల తిరుగుబాటు (ఇదే, ప్రఖ్యాతి గాంచిన ప్రథమ స్వాతంత్ర్య సమరం) తరువాత, భారతదేశంలోని అధిక భాగం బ్రిటిషు సామ్రాజ్యం కిందకు వచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన సుదీర్ఘ స్వాతంత్ర్య సమరం ఫలితంగా 1947 ఆగష్టు 15 న భారతదేశానికి స్వతంత్రం సిద్ధించింది. 1950 జనవరి 26 న సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది.
విభిన్న జాతులు, విభిన్న మతాలతో కూడిన దేశంగా భారతదేశం - జాతి, మత పరమైన సంఘర్షణలను చవిచూసింది. అయినా, తన లౌకిక, ప్రాజాస్వామ్య లక్షణాన్ని కాపాడుకుంటూనే వచ్చింది. 1975, 1977 మధ్యకాలంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధి విధించిన ఎమర్జెన్సీ కాలంలో మాత్రమే పౌర హక్కులకు భంగం వాటిల్లింది. భారత దేశానికి చైనా తో ఉన్న సరిహద్దు వివాదం కారణంగా 1962లో యుద్ధం జరిగింది. పాకిస్తాన్ తో 1947, 1965, మరియు 1971 లోను యుద్ధాలు జరిగాయి. అలీనోద్యమంలో భారతదేశం స్థాపక సభ్యురాలు. 1974లో, భారత్ తన మొదటి అణు పరీక్షను నిర్వహించింది. 1998లో మరో ఐదు పరీక్షలు నిర్వహించింది. 1991లో జరిగిన ఆర్ధిక సంస్కరణలతో ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా మారింది.
ఇంకా చూడండి:
- భారత దేశ చరిత్ర - ముఖ్యమైన ఘట్టాలు
- భారత దేశ సైనిక చరిత్ర
[మార్చు] ప్రభుత్వము మరియు రాజకీయాలు
- ప్రధాన వ్యాసము: భారత రాజకీయ వ్యవస్థ
భారత దేశం ఒక ప్రజాస్వామ్య గణతంత్ర రాజయము. ఇది పలు రాష్ట్రాల సమాఖ్య. దేశాధినేత అయిన రాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమైనది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు పరోక్ష పద్ధతిలో ఎలక్టోరల్ కాలేజి ద్వారా ఐదేళ్ళ కాలపరిమితికి ఎన్నుకోబడతారు.
ప్రధానమంత్రి కార్యనిర్వాహక అధికారాలు గల పదవి. లోక్‌సభలో అత్యధిక సంఖాక రాజకీయ పార్టీ, లేదా సంకీర్ణం సభ్యులు ప్రధానమంత్రిని ఎన్నుకుంటుంది. ప్రధానమంత్రి సలహా మేరకు, రాష్ట్రపతిచే నితమించబడ్డ మంత్రివర్గం ప్రధానమంత్రికి తన విధి నిర్వహణలో సహాయకంగా ఉంటుంది. మంత్రులచే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
భారత దేశపు శాసన వ్యవస్థలో ద్విసభా పద్ధతి ఉంది. ఎగువ సభను రాజ్య సభ అని, దిగువ సభను లోక్ సభ అని అంటారు. లోక్ సభ సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. రాజ్య సభ సభ్యులు ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకోబడతారు.
న్యాయవ్యవస్థ లో పరమోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు, మరియు అప్పిలేట్ కోర్టులు, హైకోర్టులు ఉంటాయి. కోర్టులకు సూచనలు, ఆడేశాలు, రిట్లు ఇచే అధికారం ఉంది. రిట్లలో హెబియస్ కార్పస్, మాండమస్, నిషేధం, కోవారంటో మరియు సెర్టియోరారి అనే వివిధ రకాలుగా ఉన్నాయి. భారతీయ కోర్టులు రాజ్యంగ శక్తులు; ఇవి రాజకీయ జోక్యం లేనివి. న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు అరుదుగా ఏర్పడే ఘర్షణను రాష్ట్రపతి మధ్యవర్తిత్వం వహించి నివారిస్తారు.
స్వతంత్ర భారత చరిత్రలో అత్యధిక భాగం, కేంద్ర ప్రభుత్వంలో భారతీయ కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉంటూ వచ్చింది. స్వాతంత్ర్యనికి పూర్వం అతిపెద్ద రాజకీయ పక్షం కావడం చేత, స్వాతంత్ర్యం తరువాత దాదాపు 40 ఏళ్ళపాటు దేశరాజకీయాల్లో కాంగ్రెసు గుత్తాధిపత్యం వహించింది. 1977లో జనతా పార్టీ గా ఏర్పడ్డ ఐక్య ప్రతిపక్షం కాంగ్రెసును ఓడించి, మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరచింది. ఇటీవలి కాలంలో, భారత ఓటర్లపై గల పట్టును కాంగ్రెసు పార్టీ కోల్పోతూ వచ్చింది. 2004 సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక స్థనాలు గెలిచిన కాంగ్రెసు పార్టీ, వివిధ చిన్న పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హిందూ వాద పార్టీ అయిన భాజపా ప్రధాన ప్రతిపక్షమైంది. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం కారణంగా 1996 తరువాత ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణాలే.
ఇంకా చూడండి :
- భారత దేశపు రాజకీయ పార్టీలు
- భారత ఎన్నికల విధానం
- కేంద్ర మంత్రుల జాబితా
- భారత దేశ అంతర్జాతీయ సంబంధాలు
[మార్చు] భౌగోళిక స్వరూపము, వాతావరణం
భారతదేశపు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలు హిమాలయ పర్వతాలతో కూడుకుని ఉన్నాయి. మిగిలిన ఉత్తర భారతం, మధ్య, ఈశాన్య ప్రాంతాలు సారవంతమైన గంగా మైదానంతో కూడి ఉన్నాయి. పశ్చిమాన, పాకిస్తాన్కు ఆగ్నేయ సరిహద్దున థార్ ఎడారి ఉన్నది. దక్షిణ భారత ద్వీపకల్పం దాదాపు పూర్తిగా దక్కను పీఠభూమితో కూడుకుని ఉంది. ఈ పీఠభూమికి రెండువైపులా తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు ఉన్నాయి.
భారతదేశంలో ఎన్నో ప్రముఖ నదులు ఉన్నాయి. వాటిలో కొన్ని: గంగ, యమున, బ్రహ్మపుత్ర, కృష్ణ, గోదావరి.
దేశపు దక్షిణాన ఉష్ణ వాతావరణం ఉండగా, ఉత్తరాన స్సమశీతోష్ణ వాతావరణం నెలకొని ఉంది. హిమాలయ ప్రాంతాల్లో అతిశీతల వాతావరణం (టండ్రా) ఉంది. భారత దేశంలో వర్షాలు ఋతుపవనాల వలన కలుగుతాయి.
ఇంకా చూడండి :
- భారతదేశ వాతావరణం
- భారత జాతీయ వనాలు
[మార్చు] రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు
- ప్రధాన వ్యాసము: భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశము 28 రాష్ట్రాలుగా విభజించబడినది. (రాష్త్రములు కొన్నిజిల్లాలుగా విభజించబడినవి), ఆరు కేంద్రపాలిత ప్రాంతములు మరియు జాతీయ రాజధాని ప్రాంతము,ఢిల్లీ. రాష్ట్రాలకు స్వంత ఎన్నికైన ప్రభుత్వము ఉండును, కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వముచే నియమించబడిన ప్రతినిధిచే పరిపాలించ బడతాయి.
రాష్ట్రములు:
కేంద్రపాలిత ప్రాంతములు:
- అండమాన్ మరియు నికోబార్ దీవులు
- ఛండీగఢ్
- దాద్రా నగర్ హవేలీ
- డామన్ మరియు డయ్యు
- లక్షద్వీపములు
- పాండిచ్చేరి
జాతీయ రాజధాని ప్రాంతము:
భారతదేశము అంటార్క్‌టికాలో territorial claim చేయలేదు కానీ దక్షిణ గంగోత్రి మరియు మైత్రి అను రెండు శాస్త్రీయ స్థావరాలు కలవు.
చూడండి: జనాభా వారిగా భారతదేశ రాష్ట్రాల జాబితా
[మార్చు] ఆర్ధిక వ్యవస్థ
- ప్రధాన వ్యాసము: భారత ఆర్ధిక వ్యవస్థ
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం యొక్క ఆర్ధికవ్యవస్థ, ద్రవ్య మారకం పరంగా ప్రపంచంలోనే పదో పెద్ద వ్యవస్థ. పర్చేసింగ్ పవర్ పారిటీ ప్రకారం ఇది నాలుగో స్థానంలో ఉంది. 2003 లో అత్యధిక వృద్ధి రేటు - 8 శాతం - నమోదు చేసుకుంది. అయితే, అధిక జనాభా కారణంగా, పి.పి.పి ప్రకారం తలసరి ఆదాయం కేవలం 2,540 డాలర్లుగా ఉంది; ప్రపంచ బాంకు జాబితాలో ఇది 143 వ స్థానం. భారత విడేశీమారక నిల్వలు 13 వేల కోట్ల డాలర్లు. దేశానికి ఆర్ధిక రాజధానిగా ముంబై నగరం భాసిల్లుతోంది. భారతీయ రిజర్వు బాంకు కేంద్ర కార్యాలయం, బాంబే స్టాక్ ఎక్స్చేంజి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి ఇక్కడే ఉన్నాయి. 25% ప్రజలు ఇంకా దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగం విస్తరణ కారణంగా మధ్య తరగతి వర్గం విస్తరిస్తోంది.
చారిత్రకంగా భారత ఆర్ధిక వ్యవస్థ ఆధారపడిన వ్యవసాయం పాత్ర ప్రస్తుతం తగ్గిపోయింది. ప్రస్తుతం ఇది దేశ స్థూలాదాయంలో 25% కంటే తక్కువే. ముఖ్యమైన పరిశ్రమలు గనులు, పెట్రోలియం, వజ్రాలు, సినిమాలు, జౌళి, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, మరియు హస్త కళలు. భారత్ దేశపు పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా ప్రధాన పట్టణాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలలో సాఫ్ట్‌వేర్, బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సొర్సింగ్ రంగాల్లో ప్రపంచంలోని పెద్ద కేంద్రాల్లో ఒకటిగా రూపొందింది. 2003-2004 లో ఈ రంగాల ఆదాయం 1250 కోట్ల డాలర్లు. చిన్న పట్టణాలు, పల్లెల్లోని ప్రజలకు స్థిరమైన ఉపాధి కల్పించే ఎన్నో లఘు పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఏటా దేశాన్ని సందర్శించే విదేశీ యాత్రికులు 30 లక్షల మంది మాత్రమే అయినప్పటికీ, జాతీయాదాయంలో ఈ రంగం పాత్ర ప్రముఖమైనదే. అమెరికా, చైనా, యు.ఎ.ఇ మరియు ఐరోపా సమాఖ్యలు భారత దేశపు ముఖ్య వ్యాపార భాగస్వాములు.
ఇంకా చూడండి : భారతీయ కంపెనీల జాబితా
[మార్చు] జనాభా వివరాలు
- ప్రధాన వ్యాసము: భారత జనాభా వివరాలు
భారత దేశము, చైనా తరువాత ప్రపంచంలోని రెండో అత్యధిక జనాభా గల దేశం. ఎన్నో భిన్నత్వాలు గల జనాభా యొక్క సామాజిక, రాజకీయ వర్గీకరణలో భాష, మతం, కులం అనే మూడు ప్రముఖ పాత్ర వహిస్తాయి. దేశంలోని అతిపెద్ద నగరాలు - ముంబై (వెనుకటి బాంబే), ఢిల్లీ, కోల్‌కతా (వెనుకటి కలకత్తా), మరియు చెన్నై (వెనుకటి మద్రాసు ).
భారత దేశం యొక్క ఆక్షరాస్యత 64.8%, ఇందులో మహిళల అక్షరాస్యత 53.7%. ప్రతి 1000 మంది పురుషులకు 933 మంది స్త్రీలు ఉన్నారు.
దేశంలోని 80.5% ప్రజలు హిందువులైనప్పటికీ, ప్రపంచంలోని రెండో అత్యధిక ముస్లిము జనాభా ఇక్కడ ఉన్నారు. (13.4%). ఇతర మతాలు: క్రైస్తవులు (2.33%), సిక్కులు (1.84%), బౌద్ధులు (0.76%), జైనులు (0.40%), యూదులు, పార్సీలు, అహ్మదీయులు, మరియు బహాయిలు. దేశంలో ఎన్నో మత సంబంధ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా, బహిరంగంగా జరుపుకుంటారు. అనేక మతాల కలగలుపు అయిన భారత దేశంలో పండుగలు అందరూ కలిసి జరుపుకుంటారు. వీటిలో బాగా విస్తృతంగా జరుపుకునే హిందూ పండుగలు శ్రీరామనవమి,వినాయక చవితి,సంక్రాంతి,దీపావళి, హొలీ మరియు దసరా.
భారత దేశం రెండు ప్రముఖ భాషా కుటుంబాలకు జన్మస్థానం. అవి, ఇండో-ఆర్యన్ మరియు ద్రావిడ భాషలు. భారత రాజ్యాంగం 22 భాషలను అధికారికంగా గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం అధికార కార్యక్రమాలలో హింది, ఇంగ్లీషు భాషలను ఉపయోగిస్తుంది. దేశంలోని రెందు ప్రాచీన భాషలు సంస్కృతం మరియు తమిళం. దేశంలో మొత్తం 1652 మాతృ భాషలు ఉన్నాయి.
ఇంకా చూడండి :
- భారతీయ భాషలు - మాట్లాడే ప్రజల సంఖ్య
- భారతీయ నగరాలు, పట్టణాలు
- భారత దేశంలో మతాలు
[మార్చు] సంస్కృతి
- ప్రధాన వ్యాసము: భారతీయ సంస్కృతి
భారత దేశం తన ఉత్కృష్టమైన, ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వాన్ని, తరతరాలుగా కాపాడుకుంటూ వచ్చింది. ఆక్రమణదారులు, వలస వచ్చినవారి సాంప్రదాయాలను కూడా తనలో ఇముడ్చుకుంది. తాజ్‌మహల్ వంటి కట్టడాలు, మరెన్నో సంస్కృతీ, సాంప్రదాయాలు మొగలు పాలకులనుండి వారసత్వంగా స్వీకరించింది.
భారతీయ సమాజము భిన్న భాషలతో, భిన్న సంస్కృతులతో కూడిన బహుళ సమాజం. వివిధ మత కార్యక్రమాలు సంఘ దైనందిన జీవితంలో ఒక భాగం. అన్ని సామాజిక, ఆర్ధిక వర్గాలలోను విద్యను ఉన్నతంగా భావిస్తారు. సాంప్రదాయికమైన సమష్టి కుటుంబ వ్యవస్థలోని ఆర్ధిక అవరోధాల దృష్ట్యా చిరు కుటుంబాలు ఎక్కువైపోతున్నప్పటికీ, సాంప్రదాయిక కుటుంబ విలువలను పవిత్రంగా భావిస్తారు, గౌరవిస్తారు.
భారతీయ సంగీతం వివిధ రకాల పద్ధతులతో కూడినది. శాస్త్రీయ సంగీతంలో రెండు ప్రధాన పద్ధతులున్నాయి. దక్షిణాదికి చెందిన కర్ణాటక సంగీతం ఒకటి కాగా, ఉతరాదికి చెందిన హిందూస్థానీ సంగీతం రెండోది. ప్రజాదరణ పొందిన మరో సంగీతం సినిమా సంగీతం. ఇవికాక ఎన్నో రకాల జానపద సంగీత సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. శాస్త్రీయ నృత్య రీతులు కూడా ఎన్నో ఉన్నాయి – భరతనాట్యం, ఒడిస్సీ, కూచిపూడి, కథక్, కథకళి మొదలైనవి. ఇవి ఇతిహాసాలపై ఆధారపడిన కథనాలతో కూడి ఉంటాయి. ఇవి ఎక్కువగా భక్తి, ఆధ్యాత్మికత మేళవింపబడి ఉంటాయి.
ప్రాచీన సారస్వతం ఎక్కువగా మౌఖికమైనది. తరువాతి కాలంలో అది అక్షరబద్ధం చేయబడింది. దాదాపుగా ఇవన్నీ కూడా హిందూ సంస్కృతిలో నుండి ఉద్భవించినవే. పవిత్ర శ్లోకాలతో కూడిన వేదాలు, మహాభారతం మరియు రామాయణం వీటిలో ఉన్నాయి. తమిళనాడుకు చెందిన సంగమ సాహిత్యం భార్తదేశపు ప్రాచీన సాంప్రదాయిక లౌకిక తత్వానికి అద్దం పడుతుంది. ఆధునిక కాలంలో, భారతీయ భాషలలోను, ఇంగ్లీషు లోను కూడా రాసిన ప్రసిద్ధి చెందిన రచయితలెందరో ఉన్నారు. నోబెల్ బహుమతి సాధించిన ఒకేఒక భారతీయుడైన రవీంద్రనాథ్ టాగోర్ బెంగాలీ రచయిత.
ప్రపంచంలొనే అత్యధికంగా సినిమాలు నిర్మించేది భారతదేసమే. దేశంలో అన్నిటికంటే ప్రముఖమైనది ముంబైలో నెలకొన్న హిందీ సినిమా పరిశ్రమ. అధిక సంఖ్యలో సినిమాలు నిర్మిస్తున్న ఇతర భాషా పరిశ్రమలు - తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు బెంగాలీ. బెంగాలీ సినిమా దర్శకుడైన సత్యజిత్ రే ప్రపంచ సినిమా రంగానికి భారత్ అందించిన ఆణిముత్యం.
వరి అన్నం మరియు గోధుమ (బ్రెడ్ రూపంలో)లు ప్రజల ముఖ్య ఆహారం. విభిన్న రుచులు, మసాలాలు, పదార్థాలు, వంట విధానాలతో కూడిన భారతీయ వంటలు ఎంతో వైవిధ్యమైనవి. ఎన్నో రకాల శాకాహార వంటలకు దేశం ప్రసిద్ధి చెందింది. భారతీయ ఆహార్యం కూడా ఆహారం వలెనే బహు వైవిధ్యమైనది. చీర, సల్వార్ కమీజ్ స్త్రీలు ఎక్కువగా ధరించే దుస్తులు. పురుషులు పంచె, కుర్తా ధరిస్తారు.
ఇంకా చూడండి :
- భారత్‌లో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితా
- భారతీయ శిల్పకళ
- భారతీయుల ఇంటిపేర్లు
- భారతీయ వంటకాలు
[మార్చు] క్రీడలు
- ప్రధాన వ్యాసము: భారతదేశంలో క్రీడలు
ఇతర సమకాలీన దేశములతో పోల్చితే భారతదేశము చెప్పుకోదగిన క్రీడాశక్తి కాదు. హాకీ భారతదేశ జాతీయ క్రీడ అయినా ఇటీవల కాలంలో ప్రజాదరణ వలన క్రికెటే ప్రస్తుత అనధికారిక జాతీయ క్రీడ. క్రికెట్ యొక్క ప్రజాదరణ విస్త్రుతమైనా, భారతదేశములోని చాలా రాష్ట్రాలలో ప్రత్యేకముగా, ఈశాన్య భారతములో అంత ప్రసిద్ధి చెందలేదు. భారతదేశము ఒలంపిక్ క్రీడలు లాంటి అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీలలో పెద్దగా రాణించలేదు. గత మూడు ఒలంపిక్ క్రీడలలో కేవలం ఒక్కొక్కటే పతకం సాధించగలిగినది.
కొన్ని సాంప్రదాయ ఆటలు అయిన కబడ్డీ, ఖో-ఖో మరియు గోడుంబిళ్ళ (గిల్లీ-దండా)లకు దేశమంతటా బహుళ ప్రాచుర్యము ఉన్నది. చదరంగము, క్యారమ్, పోలో, మరియు బ్యాడ్మింటన్ మొదలైనటువంటి అనేక క్రీడలు భారతదేశంలో పుట్టాయి. ఫుట్‌బాల్(సాకర్)కు కూడా యావత్ భారతదేశంలో చాలా ప్రజాదరణ ఉన్నది.
[మార్చు] శెలవుదినాలు
- ప్రధాన వ్యాసము: Holidays in India
భారతదేశములో జాతీయ శెలవుదినాలు మూడే. పండుగలు, పర్వదినాలు, నాయకుల జన్మదినాలకు సంబంధించిన ఇతర శెలవుదినాలు ఆయా రాష్ట్రాల పరిధిలో ఉంటాయి.
తేదీ | శెలవుదినము | విశేషము |
---|---|---|
జనవరి 26 | గణతంత్ర దినోత్సవము | 1950 లో ఈ రోజున భారతదేశము గణతంత్ర దేశమైనది. |
ఆగష్టు 15 | స్వాతంత్ర్య దినోత్సవము | 1947 లో ఈ రోజున భారతదేశమునకు బ్రిటీష్ పరిపాలన నుండి స్వాతంత్ర్యము లభించినది. |
అక్టోబర్ 2 | గాంధీ జయంతి | మహాత్మా గాంధీ జన్మ దినోత్సవము. |
[మార్చు] అ(న)ల్ప విషయాలు
- వాహనాలు రోడ్డుకు ఎడమ పక్కన నడుస్తాయి. డ్రైవరు స్థానం వాహనంలో కుడి పక్కన ఉంటుంది.
- భారతీయులు మాట్లాడే ఇంగ్లీషు బ్రిటిషు ఇంగ్లీషును పోలి ఉంటుంది.
- తేది పద్ధతి: dd/mm/yyyy
- సంఖ్యా మానం: 10,000,000 = 1 కోటి. 100,000 = 1 లక్ష.
- పోస్టలు కోడు (PIN): 6 అంకెలు.
- అధికారిక కొలమానం: SI
- విద్యుత్ సరఫరా 230 V; 50 HZ
- విద్యుత్ ప్లగ్గులు: Type C, D & M (CEE 7/16; CEE 7/17; BS 546)
- టెలివిజన్ సిగ్నలు: PAL B/G
- ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1 న మొదలవుతుంది.
[మార్చు] ఇవికూడా చూడండి
భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు | |
---|---|
ఆంధ్ర ప్రదేశ్ | అరుణాచల్ ప్రదేశ్ | అసోం | బీహార్ | ఛత్తీస్‌గఢ్ | గోవా | గుజరాత్ | హర్యానా | హిమాచల్ ప్రదేశ్ | జమ్మూ కాశ్మీరు | జార్ఖండ్ | కర్నాటక | కేరళ | మధ్య ప్రదేశ్ | మహారాష్ట్ర | మణిపూర్ | మేఘాలయ | మిజోరాం | నాగాలాండ్ | ఒరిస్సా | పంజాబ్ | రాజస్థాన్ | సిక్కిం | తమిళనాడు | త్రిపుర | ఉత్తరాంచల్ | ఉత్తర ప్రదేశ్ | పశ్చిమ బెంగాల్ | |
కేంద్రపాలిత ప్రాంతములు: అండమాన్ నికోబార్ దీవులు | చండీగఢ్ | దాద్రా నగరు హవేలీ | డామన్ డయ్యు | లక్షద్వీపములు | పుదుచ్చేరి | |
జాతీయ రాజధాని ప్రాంతము: ఢిల్లీ |
భారత సంబంధ విషయాలు మార్చు | |
---|---|
చరిత్ర | భారతీయ చరిత్ర కాలసూచిక, సింధు లోయ నాగరికత, మేలుహ్హా, ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం, భారతదేశంలో గ్రీకుల దండయాత్రలు, మౌర్య వంశం, అశోకుడు, శుంగ వంశం, శాతవాహనులు, ఇండో గ్రీకు సామ్రాజ్యం, ఇండో స్కిథియనులు, ఇండో పార్థియన్ సామ్రాజ్యం, కుషాణు సామ్రాజ్యం, పశ్చిమ క్షాత్రపులు, గుప్త సామ్రాజ్యం, పాల సామ్రాజ్యం, భారత్‌లో ఇస్లాము సామ్రాజ్యాలు, మొగలు యుగం, మరాఠా సామ్రాజ్యం, బ్రిటిషు రాజ్, బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ, భారత గవర్నర్ జనరల్, భారత వైస్రాయి, ప్రథమ భారత స్వాతంత్ర్య సమరం, భారత స్వాతంత్ర్య సమరం, క్విట్ ఇండియా ఉద్యమం, భారత విభజన, అలీనోద్యమం, చైనా భారత యుద్ధం, భారత పాక్ యుద్ధం 1947, భారత పాక్ యుద్ధం 1965, భారత పాక్ యుద్ధం 1971, కార్గిల్ యుద్ధం, భారత సైన్యం, భారత జనాభా వివరాలు, భారతీయ తపాల చరిత్ర |
రాజకీయాలు | జాతీయతా సూచికలు, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగం, రాజకీయ పార్టీల చరిత్ర (భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్), విదేశీ సంబంధాలు, ఎన్నికలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు |
ప్రభుత్వం | భారత ప్రభుత్వ ఏజన్సీలు, శాసన విభాగం (లోక్ సభ, రాజ్య సభ) కార్య నిర్వాహక విభాగం (రాష్ట్రపతి & ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, భారత మంత్రివర్గం, భారత అటార్నీ జనరల్, భారత ఎన్నికల కమిషను, భారత విదేశీ వ్యవహారాల మంత్రి; భారత్‌లో వట్టాల అమలు: సి.బి.ఐ, సి.ఐ.డి, భారత నిఘా సంస్థలు: ఐ.బి, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్), న్యాయ విభాగం (సుప్రీం కోర్టు), భారత సైనిక దళాలు (భారత సైన్యం, భారత నావికా దళం, భారత వైమానిక దళం, సరిహదు భద్రతా దళం, భారత తీరరక్షక దళం) |
భౌగోళిక స్వరూపం | హిమాలయాలు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, గంగా మైదానము, దక్కను పీఠభూమి, థార్ ఎడారి, గంగ, కచ్, బ్రహ్మపుత్ర, ఈశాన్య భారతం; భారత్ పర్వతాల జాబితా, భారత లోయల జాబితా, భారత ద్వీపాల జాబితా, భారత నదుల జాబితా; భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, భారత నగరాలు, పట్టణాల జాబితా, భారత జిల్లాల జాబితా, భారత ప్రాంతాల జాబితా |
ఆర్ధికం | భారత రూపాయి, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, భారత్‌లో జీవన ప్రమాణాలు, భారత కంపెనీలు, భారతీయ రిజర్వ్ బాంక్ |
జనాభా | భారతీయ భాషలు, భారత్‌లో జీవన ప్రమాణం, భారత్‌లో మతము |
భారత కళలు, వినోదం & భారతీయ సంస్కృతి | భారతీయ సంగీతం (కర్ణాటక సంగీతం, హిందూస్థానీ సంగీతం, ఇండి పాప్), భారతీయ సినిమా & భారత్‌లో టెలివిజన్ (హిందీ సినిమా, తెలుగు సినిమా), భారత టెలివిజన్ స్టేషన్ల జాబితా, భారతీయ సాహిత్యం, భారతీయ వంటలు, భారత్‌లో సెలవులు, జానపద భారతం, భారత శాస్త్రీయ నాట్యం, భారతీయ శిల్పకళా; భారత్‌లో విద్య, భారతీయ భాషలు, భారత్‌లో మాధ్యమాలు |
ఇతరాలు | కాశ్మీరు తీవ్రవాదం, భారతీయ ఇంగ్లీషు, భారత జాతీయతా చట్టం, డూల్ చితిజెన్షిప్, భారతీయ సంఖ్యా మానము, ఇస్రో, భారత సమాచార వ్యవస్థ, భారత రవాణా వ్యవస్థ (భారత హైవేలు, రైల్వేలు, ఆటో రిక్షా), భారత జాతీయ పతాకం, భారత పర్యాటక రంగం, భారత వార్తా వనరులు, భారత వాహన లైసెన్సులు |
[మార్చు] రిఫరెన్సులు
- ^ గణాంకాలు, భారత రాయబార కార్యాలయం
- ^ Census of India 2001, Data on Religion, Census of India (Official site)
- ^ చదరంగ చరిత్ర, Anatoly Karpov.
- ^ కారంస్ చరిత్ర, Carrom.org
- ^ పోలో చరిత్ర, Federation of International polo
- ^ Battledore and Shuttlecock, Online guide to traditional games
- మనోరమ ఇయర్ బుక్ 2003 – ISBN 81-900461-8-7
- డిస్కవరీ ఆఫ్ ఇండియా — జవహర్లాల్ నెహ్రూ—ISBN 0195623592
- లోన్లీ ప్లానెట్ ఇండియా — ISBN 1740594215
- Ethnologue report on Languages of India
- CIA — The World Factbook — India — CIA's Factbook on India
- Country Profile: India — BBC's Country Profile on India
- పర్యాటక సమాచారం
- భారత చారిత్రక పటం
- భారత రాష్ట్రాలు
- స్టేటాయిడ్స్
- భారత్‌లో మాధ్యమాలు
[మార్చు] బయటి లింకులు
- India Paper Money - Example of a rare 19th Century 20 Rupee and all of the Haj Pilgrim Issues from the 1950's and 60's
- Official
- భారత ప్రభుత్వ వెబ్ చిరునామాలు
- ప్రధానమంత్రి కార్యాలయ అధికారిక వెబ్సైటు
- రాష్ట్రపతి అధికారిక వెబ్సైటు
- భారత పార్లమెంటు అధికారిక వెబ్సైటు
- రక్షణ శాఖ అధికారిక వెబ్సైటు
- ప్రభుత్వ వెబ్ సైటుల కూడలి
- జనగణన అధికారి
- భారతీయ తంతి తపాలా
- సుప్రీం కోర్టు
- విదేశీ వ్యవహారాల శాఖ
- కేంద్ర ఎక్సైజు, కస్టంసు పన్నుల బోర్డు
- భారత ఎన్నికల కమిషను
- ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రొమోషన్ కౌన్సిల్
- ఎలక్ట్రానిక్స్ శాఖ
- పర్యాటక శాఖ
- విద్యా శాఖ
[మార్చు] పాద పీఠిక
^ జమ్మూ కాశ్మీరు పూర్తిగా భారత్‌లో భాగమేనని భారత ప్రభుత్వం భావిస్తున్నది. ఈ రాష్ట్రానికి ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒక సరిహద్దుగా ఉంది. 1948లో ఐక్యరాజ్యసమితి కుదిర్చిన సంధి ప్రకారం భారత, పాక్ అధీనంలో ఉన్న భూభాగం యొక్క యథాతథ స్థితి కొనసాగుతోంది. ఈ కారణంగా, ఆఫ్ఘనిస్తాన్‌కు సరిహద్దుగా నున్న ఈ రాష్ట్రపు భూభాగం ప్రస్తుతం పాకిస్తాన్ ఆధీనములో ఉంది.
ఆసియా దేశాలు |
అఫ్ఘనిస్తాన్ | ఆర్మీనియా2 | అజెర్‌బైజాన్ | బహ్రయిన్ | బంగ్లాదేశ్ | భూటాన్ | బ్రూనే | కంబోడియా | చైనా (PRC) | సైప్రస్ 2 | తూర్పు తైమూర్ | గాజా అంచు | జార్జియా2 | హాంగ్‌కాంగ్3 | భారత్ | ఇండొనేషియా | ఇరాన్ | ఇరాక్ | ఇస్రాయెల్ | జపాన్ | జోర్డాన్ | కజకస్తాన్ | కువైట్ | కిర్గిజిస్తాన్ | లావోస్ | లెబనాన్ | మకావు3 | మలేషియా | మాల్దీవులు | మంగోలియా | మయన్మార్ | నేపాల్ | ఉత్తర కొరియా | ఒమన్ | పాకిస్తాన్ | ఫిలిప్పీన్స్ | కతర్ | రష్యా1 | సౌదీఅరేబియా | సింగపూర్ | దక్షిణ కొరియా | శ్రీలంక | సిరియా | తైవాన్ (ROC) | తజికిస్తాన్ | థాయిలాండ్ | టర్కీ1 | టుర్క్‌మెనిస్తాన్ | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) | ఉజ్బెకిస్తాన్ | వియత్నాం | వెస్ట్ బాంక్ | యెమెన్ |
1. ఐరోపా, ఆసియా - రెండు ఖండాలలోనూ విస్తరించిన దేశం . 2. ఆసియాలో ఉన్నాగానీ, చారిత్రిక, సాంస్కృతిక కారణాలవల్ల ఐరోపాదేశంగా భావిస్తారు. 3. ప్రత్యేక ప్రాంతాలు. |