వికీపీడియా:కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి
వికీపీడియా నుండి
ఈ వ్యాసం సహాయం పేజీల లోని ఒక భాగం.
మీతో సహా ఎవరైనా, వికీపీడియా లో రాయవచ్చు! కింద ఉన్న పెట్టె లో ఏదో ఒక పేరు రాసి, "వ్యాసాన్ని సృష్టించు" ను నొక్కండి:
పేజీ కీ, కొత్త పేజీ కి తేడా ఒకటే - పేజీ కి పేజీ చరిత్ర ఉంటుండి. అయితే, కొత్త పేజీ ప్రారంభించడం అంటే మరేమీ కాదు, ఒక ఖాళీ పేజీ లో దిద్దుబాటు చెయ్యడమే! ఒక్కోసారి కొత్త పేజీ ఖాళీ గా కాక, ముందే నిర్ధారించిన కొన్ని వాక్యాలు ఉండవచ్చు.
[మార్చు] URL ద్వారా పేజీ ని ప్రారంభించడం
ఇప్పటికే ఉన్న పేజీ URL ను నొక్కినపుడు పేజీ ఎలా వస్తుందో, లేని పేజీ కూడా అలాగే వస్తుంది. MediaWiki:Newarticletext లో నిర్ధారించిన వాక్యాలు ఆ కొత్త పేజీ లో ఉంటాయి.
మామూలు పేజీ లో లాగానే, దీనిలో కూడా, మార్చు లింకు ఉంటుంది. దాని ద్వారా మీరు వ్యాసాన్ని సమర్పించవచ్చు.
కాబట్టి "తెగిపోయిన లింకు " అనేది నిజానికి తెగిపోయినదేమీ కాదు. లింకు లోని మొదటి సగం సరిగ్గా ఉన్నంత వరకు, అన్ని లింకులకు పేజీ లు ఉంటాయి.
URL ను సృష్టించే సులభమైన విధానం - ఒక పేజీ URL లోని చివరి భాగాన్ని మార్చి కొత్త URL తయారు చెయ్యడమే.
వేరే భాష వికీపీడియా లోని పేజీ కి interwiki link ద్వారా కొత్త పేజీ ని ప్రారంభించ వచ్చు, కాని ఇది అభిలషణీయం కాదు.