జిడ్డు కృష్ణమూర్తి
వికీపీడియా నుండి
జిడ్డు కృష్ణమూర్తి మే 12, 1895 న ఆంద్రప్రదేశ్ లోని మదనపల్లెలో జన్మించారు. 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలు మూలల ప్రయాణిస్తూ అనేక ప్రసంగాలు చేశారు. మనిషి తనంతట తానుగా భయం, కట్టుబాట్లు, అధికారం మరియు మూఢవిశ్వాసాల నుండి విముక్తి చెందాలని బోధించారు.
కృష్ణమూర్తి ప్రసంగాల సారంశం
అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో. మనిషిలో సమూలమైన పరివర్తన కలగపోతే ఈ యుద్దాలు, ఈ హింసాకాండ, ఈ విధ్వంసము ఇట్లాగే కొనసాగుతూ వుంటాయి.
రాజకీయ, ఆర్ధిక విప్లవాలు కానీ, సామాజిక సంస్కరణలు కానీ ఈ పరివర్తనను తేలేవు. నూతన ఆదర్శాలు, మతాత్మకమైన ఆశయాలు అవలంబించినా, కొత్త సిద్ధాదతలతో, కొత్త పద్ధతులలో మనిషిని నిర్భందించినా ఇది జరగదు. తనని తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది.
తెలుగులోకి వెలువడిన కొన్ని రచనలు
1. క్రిష్ణమూర్తి తత్వం-పరిచయ సంపుటం
2. శ్రీలంక సంభాషణలు
3. గతం నుండి విముక్తి
4. ఈ విషయమై ఆలోచించండి
5. ముందున్న జీవితం
6. ధ్యానం
7. విద్య అందు జీవితమునకుగల ప్రాధాన్యత
8. మన జీవితాలు-జిడ్డు క్రిష్ణమూర్తి వ్యాఖ్యానాలు
9. స్వీయజ్ఞ్యానం
10. స్వేచ్ఛ (ఆది లోనూ-అంతంలోనూ)
11. నీవే ప్రపంచం
12. గరుడయానం