వికీపీడియా నుండి
తెలుగు వారికి మరపురాని మేటి చిత్రం ఈ సంవత్సరమే విడుదలయ్యింది. ఈ యేడాది 27 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నాటి అగ్రనటులైన నందమూరి తొమ్మిది చిత్రాలలోనూ, అక్కినేని ఐదు చిత్రాలలోనూ, ఇద్దరూ కలసి ఒక చిత్రంలోనూ నటించారు. విజయావారి 'మాయాబజార్' అగ్రశ్రేణి తారలతో, భారీస్థాయిలో సాంకేతిక విలువలతో రూపొంది ఘనవిజయం సాధించింది. నేటికీ తెలుగు సినిమా ప్రతిష్ఠకు మోడల్‌గా నిలచి, నాటి నుంచి నేటి వరకు విశేష ప్రజాదరణ పొందుతోంది. ఈ చిత్రం ద్వారా తొలిసారి శ్రీకృష్ణుని పాత్ర ధరించిన యన్టీఆర్ ఆ తరువాత పౌరాణిక చిత్రాలకు ప్రపంచంలోనే సాటిలేని మేటిగా చరిత్ర సృష్టించడానికి ఇది శుభారంభమైంది. ఆ రోజులలోనే యన్టీఆర్ శ్రీకృష్ణుని గెటప్‌తో ఉన్న ఈ చిత్రం క్యాలెండర్లు ఐదు లక్షలు విజయాసంస్థ ప్రెస్ నుండే అధికారికంగా అమ్ముడైనట్లు సంస్థాధినేతల్లో ఒకరైన నాగిరెడ్డి పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఒక సినిమా నటుని బొమ్మను పత్రికలు, పోస్టర్స్ నుండి పూజామందిరాల స్థాయికి తీసుకు వెళ్ళిన ఘనత 'మాయాబజార్' చిత్రానికే దక్కుతుంది. నెల రోజుల తేడాతో విడుదలైన అంజలీ పిక్చర్స్ 'సువర్ణసుందరి' కూడా అఖండ విజయం సాధించి, తెలుగు సినిమా చరిత్రలో తొలిసారి రెండు భారీ సూపర్‌హిట్ చిత్రాలు సమాంతరంగా ప్రదర్శితమైన అద్భుతాన్ని ఈ సంవత్సరం ఆవిష్కరించింది. "తోడికోడళ్ళు, భాగ్యరేఖ, వీరకంకణం, వినాయకచవితి, సతీ అనసూయ, యమ్. ఎల్. ఏ. చిత్రాలు శతదినోత్సవ విజయాలు సొంతం చేసుకున్నాయి. 'సతీసావిత్రి', 'కుటుంబగౌరవం', 'భలే అమ్మాయిలు' యావరేజ్ విజయం సాధించాయి. ఈ యేడాది చివరలో వచ్చిన యన్. ఏ.టి. వారి 'పాండురంగ మహాత్మ్యం' సూపర్‌హిట్‌గా నిలచింది. ఈ యేడాదే అక్కినేని తాను నటించిన 60వ చిత్రం 'దొంగల్లో దొర' విడుదల సందర్భంగా చలనచిత్ర వజ్రోత్సవం జరుపుకున్నారు. 'ఎమ్.ఎల్.ఏ.' ద్వారా యస్. జానకి గాయనిగా రంగ ప్రవేశం చేశారు.
[మార్చు] డైరెక్ట్ సినిమాలు
- అక్కాచెల్లెళ్లు
- అల్లావుద్దీన్ అద్భుతదీపం
- ఆలుమగలు
- భాగ్యరేఖ
- భలే అమ్మాయిలు
- భలేబావ
- దాంపత్యం
- దొంగల్లోదొర
- ఎత్తుకు పైఎత్తు
- గంధర్వకన్య
- కుటుంబ గౌరవం
- ఎం.ఎల్.ఏ.
- మాయాబజార్
- నలదమయంతి
- పాండురంగ మహాత్యం
- పెద్దరికాలు
- ప్రేమే దైవం
- రేపు నీదే
- సారంగధర
- సంకల్పం
- సతీ అనసూయ
- సతీ సావిత్రి
- స్వయంప్రభ
- తోడి కోడళ్లు
- వద్దంటే పెళ్ళి
- వరుడు కావాలి
- వీరకంకణం
- వేగుచుక్క
- వినాయకచవితి
- సువర్ణసుందరి
[మార్చు] డబ్బింగ్ సినిమాలు