త్రివర్ణ పతాకం
వికీపీడియా నుండి
మూడు రంగుల లేక మువ్వన్నెల జెండా. భారతదేశంతో బాటు ప్రపంచంలోని చాలా దేశాల జాతీయపతాకాలు మూడు రంగులవే. భారత జాతీయ పతాకం ఆంధ్రుడైన పింగళి వెంకయ్య రూపొందించినది. దీని పొడవు, వెడల్పుల నిష్పత్తి 2:3. దీంట్లో పై నుంచి కిందకు వరుసగా కాషాయం, తెలుపు మరియు ఆకుపచ్చరంగులు సమ నిష్పత్తిలో ఉంటాయి. తెలుపు రంగు మధ్యలో నేవీ బ్లూ రంగులో 24 ఆకులు గల అశోకుడి ధర్మచక్రం ఉంటుంది.వీటిలో కాషాయం త్యాగానికి, తెలుపు స్వచ్ఛతకు, పచ్చదనం సాఫల్యతకు చిహ్నాలు కాగా అశోక చక్రం ధర్మానికి ప్రతీక.
మరిన్ని వివరాలకు జాతీయపతాకం చూడండి.
సంఖ్యానుగుణ వ్యాసములు