బ్రిటిష్ కాలము ముందు ఆంధ్రదేశము లో ఆచారములు
వికీపీడియా నుండి
1000 నుండి 1650 సంవత్సరముల మధ్య, ఆంధ్రదేశములో వేల కొలది దేవాలయ దాతలు, తమ దానముల వివరములను రాతిస్తంభముల పై,ఫలకముల పైన, గుడి గోడల మీద భద్రపరిచారు. సింథియా టేల్బోట్ వీటి సహాయముతో ప్రీకలోనియల్ (బ్రిటిషు వారు రాకముందు) -- భారతదేశములో వివిధ ప్రాంతీయ సమాజములు వృద్ది చెందుతున్న కాలము లో-- ఆంధ్రదేశము నిజముగా ఎలా ఉండేదో - ఆంటే మత సాహిత్యము,రాజుల ఆస్థాన సాహిత్యముల లో ఉండే స్వర్గ తుల్యమైన వర్ణన కాకుండా --నిజానికి దగ్గరగా ఉండే వర్ణనను నిర్మించడానికి ప్రయత్నించారు.
టేల్బోట్ ఆంధ్రదేశపు 650 సంవత్సరముల చరిత్రగల శాసనముల పుట్టుక కు కారణమైన చరిత్ర క్రమము నుండి మొదలు పెట్టారు. ఈ కాలములో గుడులలో ధర్మ కార్యములు వ్యవసాయమును బలపరిచినవి. పాత చరిత్ర లెక్కల ప్రకారము :ఈ కాలము ఆసిఫైడ్ (ఎముక వలే బలమైన) భారత సమాజమును వృద్దిచేసెను--ఈ సమాజము కాలము వలన వచ్చే మార్పు స్వీకరించలేక విదేశీయుల దండయాత్రల వలన బలహీనపడెను. కాని టేల్బోట్ ఈ కాలము ఒక డైనమిక్ యుగమని , ఈ కాలము లో ఎన్నో అభివృద్దికరమైన మార్పులు వచ్చాయని, మత సంస్థలు ఎదిగాయని, వాణిజ్య కార్యకలాపాలు రాజకీయ వ్యవస్థలు ఎదిగాయని చెప్పారు.
టేల్బోట్ కాకతీయులు వృద్ది చెందిన 1175 నుండి 1324 కాలము మీద దృష్టి కేంద్రీకరించారు. ఈ కాలము లోనే అనేక గుడుల లో శాసనాలు లభించినవి. ఈ మొదటి దశలో తెలుగు మాట్లాడే దక్షిణ భారతదేశపు ప్రాంతాలు రాజకీయముగా ఏకము చెందినవి.
[మార్చు] రచయత పరిచయము
సింథియా టేల్బోట్ యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్,ఆస్టిన్ లో చరిత్ర మరియు ఏషియన్ స్టడీస్ కు అసిస్టెంటు ప్రొఫెసర్ గా పని చేసారు. ఆమె ఆంధ్రదేశము లో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ చరిత్రము ల గురించి అనేక వ్యాసాలు ప్రచురించారు.
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
[మార్చు] ఆసక్తికరమైన విషయాలు
బ్రిటిష్ కాలము ముందు ఆంధ్రదేశము లో ఆచారములు అనే విషయము పై పరిశోధనలు చేసి పి.హెచ్.డి. చేసిన సింథియా టేల్బోట్, అదే పేరు తో ప్రచురించిన పుస్తకముకలో కొన్ని ఆసక్తి కరమైన విషయాలు
జేమ్స్ మిల్ ఈ క్రింది వ్యాఖ్యానము తో పుస్తకము ప్రారంభము చేసి, దీనిని ఖండిస్తూ సరైన వివరణ నిచ్చారు.
- గ్రీకుల వ్రాతల నుంచి మనము ఈ విధముగా అనుకోవచ్చు. అలెగ్జాండర్ దండయాత్రల నుండి ఈనాటి వరకు(1826) భారతదేశము లోని హిందువులు సమాజము, అలవాట్లు, జ్ఞానములో ఏమాత్రము మార్పు లేదు. సుమారు రెండు వేల సంవత్సరాల కాలము గ్రీకుల దగ్గర నుండి ఇంగ్లీషు వారి వరకు సమాజము ఒక్కలాగే ఉన్నది. మహ్మదీయులు వచ్చే అంతవరకూ ఏమి జరిగింది, అనేదానికి పూర్తి వివరణలు లేవు.