భగవద్గీత
వికీపీడియా నుండి
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు |
|
![]() |
|
వేదములు (శృతులు) | |
---|---|
ఋగ్వేదం · యజుర్వేదం | |
సామవేదము · అధర్వణవేదము | |
వేదభాగాలు | |
సంహితము · బ్రాహ్మణము | |
అరణ్యకము · ఉపనిషత్తులు | |
ఉపనిషత్తులు | |
ఐతరేయ · బృహదారణ్యక | |
ఈశ · తైత్తరీయ · ఛాందోగ్య | |
కేన · ముండక | |
మాండూక్య ·ప్రశ్న | |
శ్వేతాశ్వర | |
వేదాంగములు (సూత్రములు) | |
శిక్ష · ఛందస్సు | |
వ్యాకరణము · నిరుక్తము | |
జ్యోతిషము · కల్పము | |
స్మృతులు | |
ఇతిహాసములు | |
మహాభారతము · రామాయణము | |
పురాణములు | |
ధర్మశాస్త్రములు | |
ఆగమములు | |
శైవ · వైష్ణవ | |
దర్శనములు | |
సాంఖ్య · యోగ | |
వైశేషిక · న్యాయ | |
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
ఇతర గ్రంధాలు | |
భగవద్గీత · భాగవతం | |
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
... · ... | |
ఇంకా చూడండి | |
మూస:హిందూ మతము |
భగవద్గీత |
|||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
గమనిక
- భగవద్గీత అధ్యాయానుసారం పూర్తి పాఠము వికిసోర్స్లో ఉన్నది.
- భగవద్గీత ఒక్కో శ్లోకానికీ తెలుగు అనువాదం వికీసోర్స్‌లో వ్రాయవలసి ఉన్నది. అందుకు ప్రారంభించిన వ్యాసం: ఇక్కడ ఉన్నది- తెలుగు అనువాదాన్ని వ్రాయవచ్చును.
భగవద్గీత , మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు.
భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.
విషయ సూచిక |
[మార్చు] భగవద్గీత ఆవిర్భావం
భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సన్నద్ధమయ్యారు. పాండవవీరుడైన అర్జునునకు రధసారధి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపువారూ శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రధాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని "నా కర్తవ్యమేమి?" అని అడిగాడు. అలా అర్జునునికి అతని రధ సారధి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.
[మార్చు] భగవద్గీత విశిష్టత
భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మ స్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీతకు హిందూ మతంలో ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రశంసించే కొన్ని ఆర్యోక్తులు ఇవి:
- సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాల నందనః
- పార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్
- శ్రీకృష్ణుడను గొల్లవాడు ఉపనిషత్తులనెడు గోవులనుండి అర్జునుడనెడి దూడను నిమిత్తముగా చేసికొని గీత అను అమృతమును పతికెను. బుద్ధిమంతులు అంతా ఈ గీతామృతమును పానము చేయవచ్చును.
- ప్రతి వ్యక్తి గీతను శ్రవణ, కీర్తన, పఠన, పాఠన, మనన, ధారణాదుల ద్వారా సేవిపవలెను. అది పద్మనాభుని ముఖ కమలమునుండి ప్రభవించినది. (మహాభారతం-భీష్మ పర్వం)
- నేను గీతను ఆశ్రయించి ఉందును. గీత నా నివాసము. గీతాధ్యయనము చేయువాడు భగవంతుని సేవించినట్లే (వరాహ పురాణం)
[మార్చు] భగవద్గీత సారం
(భగవద్గీత గురించి ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. ఎందరో పండితులు, సామాన్యులు, ఔత్సాహికులు కూడా అర్ధాలు, అంతరార్ధాలు, సందేశాలు, విశేషాలు వివరించారు. కనుక "భగవద్గీత సారం" అన్నవిషయం ఇది వ్రాసేవారికి "అర్ధమయినంత, తోచినంత" అని గ్రహించాలి)
కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యంవైపు నడిపించడం అనేది గీత లక్ష్యం అని సందర్భానుసారంగా అనుకోవచ్చును. అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించక ప్రశ్నిస్తూ ఉంటాడు. శిష్యునిపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు అతనికి నిగూఢమైన, వేరెవరికీ తెలియని అనేక విషయాలు బోధిస్తాడు.
ఆత్మ నిత్య సత్యమైనది మరియు చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ ఆత్మను చంపదు. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి, వస్తు ప్రపంచాన్ని వదలి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరగలడు. భక్తి, కర్మ, ధ్యాన మరియు జ్ఞాన మార్గాలలో భగవంతుని చేరవచ్చును.
మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మలవలన దోషాలు కూడా తప్పవు. సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి, సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించరాదు. అన్ని కర్మల ఫలాన్ని భగవంతునకు ధారపోయాలి.
కృష్ణుడే పరబ్రహ్మము. సృష్టిలోని సకలము భగవంతుని అంశతోనే ఉన్నవి. అన్ని పూజల, యజ్ఞాల ఫలాలు ఆ దేవదేవునకే చెందుతాయి. బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు అర్జునునకు తాత్కాలికముగా దివ్య దృష్టిని ప్రసాదించాడు. అనంతము, తేజోమయము, సర్వవ్యాప్తము, కాల స్వరూపము అయిన ఆ శ్రీకృష్ణుని విశ్వ రూపాన్ని చూసి అర్జునుడు తరించాడు.
ప్రకృతిలో సకల జీవాలు సత్వరజస్తమోగుణాలచే నిండి ఉన్నాయి. భగవంతునకు శరణాగతుడైనవాడికి ఈ గుణాల బంధంనుండి విముక్తి లభిస్తుంది.
[మార్చు] భగవద్గీత విభాగాలు
భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క "యోగము" అని చెబుతారు. వీటిలో 1నుండి 6 వరకు భక్తిషట్కము అని అంటారు. 7 నుండి 12 వరకు కర్మ షట్కము అని అంటారు. 13 నుండి జ్ఞాన షట్కము. ఒక్కొక్క యోగంలోని ప్రధాన విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
- అర్జునవిషాద యోగము: అర్జునుడు కురుక్షేత్రంలో మొహరించి యున్నసేనలను చూశాడు. ప్రాణాలకు తెగించి యుద్ధానికి వచ్చిన బంధు, గురు,మిత్రులను చూశాడు. వీరందరినీ చంపుకొని రాజ్యం పొందడమా? అని మనసు వికలం అయ్యింది. కృష్ణా! నాకు ఏమీ తోచడం లేదు. కర్తవ్యాన్ని బోధించు - అని ప్రార్ధించాడు.
- సాంఖ్య యోగము: ఇది గీతలోని త్తత్వం విశదపరచిన ప్రధానాధ్యాయం. దీనిని సంక్షిప్త గీత అని కూడా అంటారు. శరీరానికి, ఆత్మకు ఉన్న భేదాన్ని భగవంతుడు వివరిస్తాడు. ఆత్మ శాశ్వతమని, దానికి మరణం లేదని, ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతుందని వివరిస్తాడు.
- కర్మ యోగము: కర్మలన్నింటినీ ఆవరిచుకొని కొంత దోషం ఉంటుంది. అలాగని కర్మలు చేయకుండా జీవనం సాధ్యం కాదు. అయితే అహంభావాన్ని, ఫలవాంఛను వీడి కర్మలను ఆచరిస్తే కర్మ బంధాలనుండి విముక్తులు కావచ్చును.
- జ్ఞాన యోగము: ఆత్మను, పరమాత్ముని గురించిన జ్ఞానమే మోక్షప్రదము. అది నిష్కామ కర్మ వలన లభిస్తుంది. ఈ పరమ జ్ఞానాన్ని పురాతనకాలంలో సూర్యునకు భగవంతుడు ఉపదేశించాడు. లోకంలో ధర్మాన్ని రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి యుగయుగమున భగవంతుడు అవతరిస్తాడు.
- కర్మసన్యాస యోగము: కర్మ ఫలాలను త్యజించడం వలన జ్ఞానియైనవాడు మోక్షాన్ని పొందుతాడు.
- ఆత్మసంయమ యోగము: ఈ అధ్యాయంలో వివిధ యోగసాధనా విధానాలు చెప్పబడ్డాయి.
- జ్ఞానవిజ్ఞాన యోగము:ఈ అధ్యాయంలో భగవంతుని తత్వం గూర్చిన జ్ఞానం, ఆయన స్వరూపము, మాయ, సర్వాంతర్యామిత్వం పరిచయం చేయబడినాయి. ఆయనకు శరణుజొచ్చుట మాత్రమే సరయిన భక్తిమార్గం. వారికే ఆయన కరుణ లభిస్తుంది.
- అక్షరపరబ్రహ్మ యోగము: బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మ, అధిభూతము, అధిదైవము అనే విషయాల వివరణ ఈ అధ్యాయంలో చెప్పబడింది. నిత్యమైన, సత్యమైన పరమ పదము, పరబ్రహ్మము గూర్చి చెప్పబడినది.
- రాజవిద్యారాజగుహ్య యోగము: ఇది పవిత్రమైన జ్ఞానము. అన్నింటా విస్తరించిన పరమాత్ముని గురించి, ఆయనను పొందు విధము గురించి చెప్పబడినది.
- విభూతి యోగము: సకల చరాచరమలలో, లోకములలో, యుగములలో వ్యాపించియున్న తన అనంతమైన విభూతులలో కొద్ది విభూతులను భగవానుడు అర్జునునకు తెలియజెప్పెను. వేయేల? ఐశ్వర్యమయము, కాంతిమయము, శక్తి మయము ఐనవన్నియు భగవానుని తేజస్సులో ఒక అంశనుండి కలిగినవి.
- విశ్వరూపసందర్శన యోగము: అర్జునుడు భగవానుని షడ్గుణైశ్వర్య సంపన్నమైన తేజోరూపమును చూపమని ప్రార్ధించెను. అందుకై కృష్ణుడు అర్జుననకు దివ్యదృష్టిని ప్రసాదించెను. అపుడు అర్జునుడు అసంఖ్యాక ముఖములు, నేత్రములు, అద్భుతాయుధములు ధరించి అనంతముగా విస్తరించిన దేవదేవుని విశ్వరూపమును దర్శించెను. ఆ మహాకాల స్వరూపమును అంతకు ముందెవ్వరును చూడలేదు. అర్జునుడు పులకించి ఆ అనంతరూపుని ప్రస్తుతించెను.
- భక్తి యోగము: పరమాత్ముని సగుణ, నిర్గుణ రూపములలో దేనిని ఆరాధింపవలెనని అర్జునుడు ప్రశ్నించెను. రెండును భగవానుని చేరు మార్గములే అయినను సగుణ సాకార ఉపాసనయే భక్తులకు అనువైన మార్గమని సెలవిచ్చెను. ఆపై భగవంతుడు జ్ఞానియైన తన భక్తుల లక్షణములను వివరించెను.
- క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము: మానవుల శరీరము క్షేత్రము. ఆ క్షేత్రమును గూర్చి తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు. అన్ని క్షేత్రములలోను అంతర్యామిగానున్న క్షేత్రజ్ఞుడు పరమాత్ముడే. అని, అట్టి పరమాత్ముని స్వరూపమును కృష్ణపరమాత్ముడు తెలియజెప్పెను.
- గుణత్రయవిభాగ యోగము: ఆత్మ నాశన రహితమైనది. కాని ప్రకృతివల్ల ఉద్భవించిన సత్వ రజస్ తమో గుణములు జీవాత్మను శరీరమున బంధించును. అనుచు శ్రీకృష్ణుడు ఈ మూడు గుణముల స్వభావమును, ప్రభావమును వివరించెను.
- పురుషోత్తమప్రాప్తి యోగము: త్రిగుణాత్మకమైన సంసార వృక్షమును శ్రీకృష్ణుడు వర్ణించెను. జగత్తులో నాశనమొందువాడు క్షరుడు. వినాశరహితుడు అక్షరుడు. వీరిద్దరికంటె ఉత్తమమైనవాడు, అతీతుడు గనుక భగవంతుడు పురుషోత్తముడు.
- దైవాసురసంపద్విభాగ యోగము: అసుర లక్షణములు, దైవ లక్షణములకు మధ్య అంతరమును భగవంతుడు వివరించెను.
- శ్రద్దాత్రయవిభాగ యోగము: వివిధమార్గాలలో పూజలు చేసేవారి శ్రద్ధ ఏ విధమైనది? ఎవరు ఏవిధంగా యజ్ఞానుల, దానాలు చేస్తారు?
- మోక్షసన్యాస యోగము: కనుక అన్ని సంశయములను పరిత్యజించి, తనయందే మనసు నిలిపి యుద్ధము (కర్మ) చేయమని భగవంతుడు ఉపదేశించెను. అర్జునుడు మోహవిరహితుడయ్యెను. యోగేశ్వరుడగు కృష్ణుడు, ధనుర్ధరుడైన పార్ధుడు ఉన్న చోట సంపద, విజయము తప్పక ఉంటాయని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు.
[మార్చు] భగవద్గీత గురించి కొన్ని అభిప్రాయాలు
భగవద్గీత నుండి మార్గదర్శకత్వము పొందినవరిలో ఎందరో యోగులు, తాత్వికులు ఉన్నారు. వారిలో శ్రీ చైతన్య మహాప్రభు ఒకరు. ఈయన "హరే కృష్ణ" మంత్రొపాసకులు. మహాత్మా గాంధీ తన అహింస సిద్ధాంతానికి గీత నుండే స్పూర్తీని పొందారు. గాంధీ మహాభారత యుద్ధాన్ని నిత్య జీవితంలో జరిగే సంఘర్షణాలన్నిటికి వేదిక వంటిదని వర్ణించారు. అంతిమంగా గీత సారము ఆయనకు బ్రిటిష్ వారి వలస పాలనను ఎదిరించడానికి ఒక ఆయుధము వంటి స్పూర్తిని ఇచ్చింది.
అమెరికా అణు శాస్త్రవేత్త, అణుబాంబు సృష్టించిన 'మాన్ హాటన్ ప్రాజెక్ట్' నిర్దేశకుడైన 'రాబర్ట్ ఒపెన్హీమర్' 1945లో మొదటి అణ్వాయుధ ప్రయోగాన్ని చూసినపుడు ఆ ప్రభావాన్ని వర్ణించడానికి గీతలోని విశ్వరూప ఘట్టాన్నుండి (11-32) ఉదాహరించాడని అంటారు [1].
శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యులలో ఆగ్రగణ్యుడైన స్వామి వివేకానంద గీతలోని భక్తి, జ్ఞాన, కర్మ రాజ యోగాలకు ఎంతో విపులంగా నూతన భాష్యాన్ని వ్రాశారు. యోగులు కాదలచిన వారు గీతలోని ప్రతి అధ్యాయాన్ని వివరంగా చదవమని స్వామి శివానంద బోధించారు. ఒక యోగి ఆత్మ కధ రచయిత అయిన పరమహంస యోగానంద, గీతను మరియు బైబిల్ లోని నాలుగు గీతాలను ప్రపంచములోని అత్యుత్తమ పవిత్ర గ్రంధములుగా పేర్కొన్నారు.
[మార్చు] భగవద్గీత కాలం
భగవద్గీత ఎప్పుడు వ్రాయబడినదో పూర్తిగా నిర్ధారణ కాలేదు, లేదా నిరూపింపబడలేదు. మహాభారత ఇతిహాసమునందలై వివిధ ఖగోళ ఆధారల అనుసరించి, మహాభారత కాలాన్ని క్రీస్తు పూర్వం 3137 గా చెప్పబడుతున్నాయి. ఈ తారీఖులు హిందువుల విశ్వాసమైన కలియుగారంభమై 5000 సంవత్సరాలు అయినాయి అనేదానికి అనుకూలంగానే ఉన్నాయి. పురాణాలను అనుసరించి మాత్రం క్రీస్తుపూర్వం 1924 గా చెప్పబడుతున్నాయి. పాశ్చాత్య విద్వాంసులు మాత్రం ఈ తారీఖులు క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాలగా చెప్పుచున్నారు. [2]
[మార్చు] గీతా శ్లోక సంఖ్య
భగవద్గీతలోని శ్లోకాల సంఖ్య గురించి చాలా పరిశోధన జరిగింది, ఇంకా జరుగుతూ ఉంది. ప్రస్తుతం లభ్యమౌతున్న సంస్కృత మహాభారతంలో భీష్మ పర్వం 43వ అధ్యాయం, 4వ శ్లోకం ఇలా ఉంది:
- షట్శతాని సవింశాని శ్లోకానాం ప్రాహకేశవః
- అర్జునః సప్తపంచాశత్ సప్తషష్టించ సంజయః
- ధృతరాష్ట్రః శ్లోకమేకం గీతాయా మానముచ్యతే
దీన్నిబట్టి కృష్ణుడు 620 శ్లోకాలు, అర్జునుడు 57 శ్లోకాలు, సంజయుడు 67 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే మొత్తం 745 శ్లోకాలు. కానీ, వాడుకలో ఉన్న భగవద్గీత ప్రతిని బట్టి కృష్ణుడు 574 శ్లోకాలు, అర్జునుడు 84 శ్లోకాలు, సంజయుడు 41 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే మొత్తం 700. మరి కొన్ని ప్రతులలో 13వ అధ్యాయం "క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం" మొదట్లో అర్జునుడు అడిగినట్లుగా "ప్రకృతిం పురుషం చైవ ..." అని ఒక ప్రశ్న ఉంది. అది కనుక కలుపుకుంటే మొత్తం 701 శ్లోకాలు అవుతాయి.
ఇవి కాకుండా రాజస్థాన్లోని కథియవాడ్‌లో భోజ (భూర్జర) పత్రాలపై రాసిన భగవద్గీత పాఠాంతరం ఒకటి బయటపడిందనీ, దానిలో ఏకంగా 755 శ్లోకాలు ఉన్నాయనీ, తమ 'గీతా మకరందం' (1963) రెండవ ముద్రణలొ (చూడు పే. 13, 1964) విద్యాప్రకాశానందగిరి వారు (శుకబ్రహ్మాశ్రమము, కాళహస్తి) రాశారు. కానీ, దీనిని గురించి మరిన్ని వివరాలు అందుబాటులో లేవు.
ఏది ఏమైనా, మహాభారత శ్లోకం ప్రక్షిప్తం కాదనుకుంటే మరొక 44/45 అమూల్యమైన శ్లోకాలు కాలగర్భంలో కలిసిపోయాయని చెప్పచ్చు.
[మార్చు] చూడండి
[మార్చు] ఆధారాలు
- దేవనాగరిలో సంస్కృత భగవద్గీత (వికీసోర్స్)
[మార్చు] బయటి లింకులు
- బహు భాషలలో భగవద్గీత -- ప్రముఖ సమకాలిక వ్యాఖ్యానాలతో
- సంస్కృతము --> ఇంగ్లీషు-- స్వామీ భక్తివేదాంత ప్రభుపాద (ఇస్కాన్/హరేరామ హరేకృష్ణ) ప్రతిపదార్థ, తాత్పర్య, వ్యాఖ్యానాల సహితము (ఇంగ్లీషు)
- కృష్ణ.కామ్ నుండి భగవద్గీత (ఇంగ్లీషు)
- శ్రీమద్ జగన్నాథ్ దాస్ గారి వ్యాఖ్యానము(ఇంగ్లీషు)
- భగవద్గీత లో ప్రేమ తత్త్వము, ఏకనాథ్ ఈశ్వరన్ గారి వ్యాఖ్యానము (ఇంగ్లీషు)
- స్వామీ చిన్మయానంద అనువాదము వ్యాఖ్యానము (ఇంగ్లీషు)
- సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ అనువాదము (ఇంగ్లీషు)
- కాశీనాథ్ త్రయంబక్ తెలంగ్ అనువాదము (ఇంగ్లీషు)
- మహాత్మాగాంధీ అనువాదము/వ్యాఖ్యానము (ఇంగ్లీషు)
- స్వామీ నిర్మలానందగిరి అనువాదము, పాడుకోవడానికి వీలుగా
- డా. రామానంద్ ప్రసాద్ గారి అనువాదము
- సేండర్సన్ బెక్ అనువాదము
- స్వామీ తపస్యానంద అనువాదము
- పరమహంస స్వామీ శివానంద సరస్వతి వ్యాఖ్యానము
- విలియమ్ కాన్ జడ్జి అనువాదము
- భక్తివేదాంత నారాయణ మహారాజ్ అనువాదము
[మార్చు] వ్యాఖ్యానాలు
- 6 వ్యాఖ్యానాలు - ఆదిశంకర, రామనుజ, శ్రీధర స్వామి, మధుసూధన సరస్వతి, విశ్వనాథ చక్రవర్తి, బలదేవ విద్యాభూషణ (ఇంగ్లీషు లో వ్రాయబడిన సంస్కృత వ్యాఖ్యానాలు)
- భక్తివేదాంత ప్రభుపాద గారి భగవద్గీత పరిచయ వ్యాఖ్యానము
- స్వామీ నిర్మలానందగిరి వ్యాఖ్యానము
- వ్లాదిమీర్ ఆంటనోవ్ వ్యాఖ్యానము
- గోవింద లీలామృతము: శ్రీల భక్తివేదాంత నారాయణ మహారాజు
- భగవద్గీః దేవుని అర్జునుని సంభాషణలు
- పరమహంస యోగానండ వ్యాఖ్యానము
- శ్రీ అరబిందో వ్యాసములు
[మార్చు] వినండి(ఆడియో)
- Verses in Sanskrit, transliteration, Hare Krishna-influenced translations and accompanying chants in Realaudio
- Recitation of verses in Sanskrit (MP3s)
- Bhagavad Gita Sung in English, in streaming Realaudio
- The Gita read in English. Streaming audio for each chapter. (Translation: A.C. Bhaktivedanta Swami Prabhupada)
- Bhagavad Gita Online Classes by Swami Satyananda Saraswati
- Bhagavad Gita in 6 Languages
- Bhagavad Gita Lectures in English (MP3)
[మార్చు] అవీ, ఇవీ
- Vedantic commentary on the Gita
- International Gita Society
- Gita4free.com
- Geeta Kavya Madhuri: Samples of metered translation into Hindi verse by Prof. Rajiv Krishna Saxena
- An article in Hindi about the cycles of origin and destruction of universe as explained in Bhagavad-Gita
హిందూ మతము గురించి | |
ముఖ్య గ్రంధాలు: | ధర్మశాస్త్రాలు |
సిద్ధాంతాలు: | అవతారములు | బ్రాహ్మణ | ధర్మ | కర్మ | మోక్ష | మాయ | ఇష్టదేవతలు | ముక్తి | పునర్జన్మ | సంసారము | త్రిమూర్తులు | తురియ |
శాస్త్రాలు: | జ్యోతిష్యము | ఆయుర్వేదము |
పూజావిధానాలు: | హారతి | భజన | దర్శనము | దీక్ష | మంత్ర | పూజ | సత్సంగమము | స్తోత్రములు | యజ్ఞములు |
ఆచార్యులు: | ఆది శంకరాచార్యులు | రామానుజాచార్యులు | శ్రీ మధ్వాచార్యులు | రామకృష్ణ పరమహంస | స్వామీ వివేకానంద | శ్రీ నారాయణ గురు | శ్రీ అరవిందో | రమణ మహర్షి | స్వామి శివానంద | చిన్మయానంద | శివాయ సుబ్రమణ్యస్వామి | స్వామి నారాయణ | శ్రీ ఏ.సీ. భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు |
హిందూ మత శాఖలు: | వైష్ణవము | శైవము | శక్త్యారాధాన | స్మార్తులు | ఆగమ హిందూ ధర్మము | సమకాలీన హిందూమత ఉద్యమాలు | హిందూమత సంస్థలు |
ఇంకా: | హిందూ దేవతా విగ్రహముల పట్టిక | వర్గం:మతములు |