వికీపీడియా:రచ్చబండ
వికీపీడియా నుండి
రచ్చబండ | |
---|---|
ప్రతిపాదనలు | వార్తలు | పాలసీలు | సాంకేతికము | సహాయము | విశేష వ్యాసం | అనువాదాలు | ఇతరత్రా.. |
వికిపీడియాకు మీ అవసరం ఉంది. రండి చేతులు కలపండి. ఒక మహా సర్వస్వము తయారీలో మీరు కూడా భాగస్వాములు కండి. మీరు ఇక్కడ ఉన్న వ్యాసాలు మార్చవచ్చు, లేదా మీరే సొంతంగా క్రొత్త వ్యాసాలు మొదలు పెట్టవచ్చు. మీరు వ్యాసము వ్రాయుటకు ఏదైనా సహాయము కూడా తీసుకొనవచ్చును. మరిన్ని వివరములకు మీరు తెలుగు వికి సభ్యుల సమూహముని చూడగలరు. join in this group for more discussions or help.
వారము రోజులు మరియు ఆపైబడిన చర్చలను సంబందిత ఉప పేజీలలో చేర్చవలెను.
[మార్చు] పదివేల పండుగ
పదివేల పండుగ - తెలుగు వికీపీడియా పదివేలవ వ్యాసాన్ని చేరుకునే రోజు. చినుకు చినుకు గా మొదలై జడివాన అయినట్లు, మొలక మొలక గా మొదలై వెయ్యి దాటి రెండు వేలకు దగారౌతున్నది. త్వరలోనే రెండు, మూడు...దాటి పదివేలకు చేరాలని ఆశిస్తూ..
దీనికో మార్గసూచిక (రోడ్‌మాప్) తయారుచేసుకుంటే ఎలా ఉంటుంది? ప్రస్తుతం (07:42, 5 అక్టోబర్ 2005 (UTC)) 150 మంది సభ్యులు.. ఒక్కొక్కరు వారానికి ఒక కొత్త వ్యాసం.., మరో నాలుగు దిద్దుబాట్లు.. సంవత్సరంలో పదివేల వ్యాసాలు గొప్ప విషయమేమీ కాదనుకుంటాను.__చదువరి 07:42, 5 అక్టోబర్ 2005 (UTC)
-
- మన రాష్ట్రములో దాదాపు 1200 మండలములు ఉన్నవి. నా వంతుగా ప్రతి మండలము గురించి కనీసము 2-3 వాక్యములు రాయగలనని నా నమ్మకము. ఇప్పటికి మనము జిల్లా స్థాయిలో బాగానే రాశాము. ప్రతి గ్రామానికి ఒక పేజి ఉండే రోజు త్వరలోనే వస్తుంది.
- తెలుగు సినిమాలు 5000 దాకా ఉంటాయి. మనము వీటి డేటాబేసు ఎక్కడనుంచైన సంపాదించగలిగితే బాట్ ఉపయోగించి వాటన్నిటికి పేజీలు రాయొచ్చు.
- బాట్లు ఎలా ఉపయోగించాలో నేర్చుకోవాలి. పోలిష్ వికిపీడియా ఒక్క రోజులో 90,000 నుండి 1,00,000 కు గెంతింది. ఖచ్చితంగ బాట్ల పనే అయ్యుండొచ్చు. (ఇతర వికిపీడియాలు ఎమి చేస్తున్నయో అప్పుడప్పుడు గమనించండి).
- అన్నింటికంటే ముఖ్య మైనది. సభ్యుల సంఖ్య పెంచడము. చాలా మంది సభ్యులను ఆకర్షించడానికి ప్రతి పేజీపేరు (అన్ని పేజీలకు వర్తించదనుకో) మొదటి వాక్యములో ఆంగ్లములో రాయవచ్చని ఒక సూచన విన్నా వేరే వికిపీడియాలో. (ఉదాహరణకి కర్నూలు(Kurnool) ) will increase the chances of people getting to that article. జనాలు గుగూల్‌లో తెలుగు పదాలతో అన్వేశించడానికి ఇంకా అలవాటు పడలేదు.
- --వైఙాసత్య 08:37, 5 అక్టోబర్ 2005 (UTC)
[మార్చు] ఇంగ్లీషులో పేజీపేరు
పేజీపేరు ఇంగ్లీషులో రాసే విషయమై హిందీ వికీపీడియాలోని ఈ లింకు చూడండి. __చదువరి (చర్చ, రచనలు) 18:16, 15 జనవరి 2006 (UTC)
[మార్చు] తెలుగులో ఏముంది?
అదే నాకు ఆశ్చర్యంగానూ, గర్వంగానూ ఉంది. నేను కేవలం 45 రోజుల క్రితం యాదృచ్చికంగా తెలుగు వికిపిడియా చూసి, సభ్యునిగా చేరాను. తరువాత ఇది ఒక వ్యసనమై పోయింది. అయితే నేను ఒంటరిని గాను. దాదాపు అందరు సభ్యులు తమ తమ వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూనే రేయింబవళ్ళూ 'తెవికీ' కోసం శ్రమ పడుతున్నారని గమనించవచ్చు. ఒక్కొక్కరి పనిటైము చూస్తే ఇది అర్ధమై పోతుంది. వారికందరికీ నా ధన్యవాదాలు.
ఇంతకూ చెప్పదలచుకున్నదేమంటే ఇలాంటివారు చాలామంది ఉన్నారు కాని వారికి 'తెవికీ' గురించి తెలియదనుకొంటాను (రెండు నెలల క్రితం నాకస్సలు తెలవదు). అటువంటి వారికి గాలం వేయాల్సిన అవుసరం చాలా ఉంది. ముఖ్యంగా యువతరాన్నీ, ఉపాధ్యాయ వర్గాన్నీ, గృహిణులనూ, పత్రికా ప్రపంచంలో ఉన్నవారినీ ఆహ్వానించడం అవుసరం. పది మంది వల్ల అయ్యే పని ఒక్కరికి సాధ్యం కాదు.
సభ్యులందరికీ విజ్ఙప్తి. సందు దొరికినప్పుడల్లా 'తెవికీ' గురించి పది మందికీ తెలియ జెప్పండి. ఇన్షూరెన్సు ఏజంట్లలా వెంట బడండి. పదివేల పండుగ దగ్గరలోనే వుంది. అయితే రాసితోబాటు వాసికూడా మనం నిలబెడదాము.
కాసుబాబు 21:33, 12 సెప్టెంబర్ 2006 (UTC)
[మార్చు] పదివేల పండుగ, తదుపరి లక్ష్యాలు
గత సంవత్సరం అక్టోబరు 5 న "పదివేల పండుగ" ఇదే పేజీలో చర్చకు వచ్చింది. సంవత్సరంలోగా చెయ్యగలమేమో అని అనుకున్నాం. సంవత్సరానికి ఇంకా 20 రోజులు ఉండగానే చేరుకున్నాం! ఈ శుభవేళ సభ్యులందరికీ అభినందనలు. ఈ సందర్భంగా మన ప్రాధమ్యాలను నిర్దేశించుకుందాం.. కింది జాబితాకు మరిన్నిటిని చేర్చండి. __చదువరి (చర్చ, రచనలు) 06:50, 22 సెప్టెంబర్ 2006 (UTC)
- అనువాదాలు: అనువదించవలసిన వ్యాసాలు చాలానే ఉన్నాయి. వీటి పని పట్టాలి.
- భాషా దోషాల సవరణ: వికిపీడియా శైశవ స్థితిని దాటిన వేళ ఇక మనం నాణ్యతపై మరింత జాగ్రత్త వహించాలి. ప్రస్తుత వ్యాసాల్లో భాషా దోషాలు లెక్కకు మిక్కిలిగా ఉంటూ పంటి కింద రాళ్ళలా తగులుతూ ఉంటున్నాయి. ఈ విషయమై మనం ఒక ప్రత్యేక బృందాన్ని తయారు చెయ్యాలి. ఈ బృంద సభ్యులు వ్యాసాల్లోని భాషను సంస్కరిస్తూ ఉంటారు. దీని వలన నాణ్యత పెరుగుతుంది. దీనిపై సభ్యులు తమ అభిప్రాయాలు రాయగలరు.----
- ప్రాజెక్టులు మొదలుపెట్టి, వాటికి ప్రధాన పేజీ నుండి ఓ లింకు ఇవ్వాలి ,తద్వారా ఓ ప్రాజెక్టుపై మక్కు ఉన్న వారిని ఆకర్షించ వచ్చు. ఉదాహరణకు చరిత్ర, భారత దేశ చరిత్ర, ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర, కంప్యూటర్లు, కంప్యూటరు కంపెనీలు, సాఫ్ట్‌వేరు, హార్డ్‌వేరు, తెలుగు ప్రముఖులు, భారత దేశ ప్రముఖులు, మహా భారత వ్యక్తులు, రామాయణ వ్యక్తులు, వేదాలు, మొదలగున్నవి; ఒక్కొక్క ప్రముఖునికి ఓ తలపండినవాడిని అధిపతి చేస్తే బాగుంటుంది.
- మనము మన ప్రధాన పేజీని ఓ చూపు చూడాలి. చక్కగా దీనిని డిజైనును చేయాలి. అంటే ఇప్పుడు ఉన్నది బాగోలేదని కాదు, కానీ మరింత అధ్భుతంగా చేయాలి, దీనిని సాంకేతిక దృష్టితో కాకుండా ముందు ఎలా ఉంటే బాగుంటుందని స్కెచ్ వేసుకొని ఆ తరువాత అలా ఎలా వ్రాయాలో చూడాలి
- తెలుగువికీ, తెలుగు బ్లాగు (?) సమావేశాలు పెద్ద యెత్తున నిర్వహించాలి. ప్రతి జిల్లా కేంద్రములోనూ, ప్రతి విశ్వవిద్యాలయపు వాకిలిలోనూ, ప్రతి కాలేజీ, స్కూలు లోనూ వీటి గురించి కనీసం ఒకరైనా ఒకసారి అయినా ప్రచారం నిర్వహించాలి. దీని కోసం మనము సభ్యులను చక్కగా పథక రచన చేయమని అడగాలి
Chavakiran 08:24, 22 సెప్టెంబర్ 2006 (UTC)
[మార్చు] ప్రతిపాదన-1
పదివేల పండుగ సందర్భముగా అందరికీ శుభాభినందనలు. చావారవికిరణ్ చెప్పిన విషయాలు అన్నీ ముఖ్యమైనవే. వాటిలో రెండు విషయాలగురించి నేను ప్రస్తావిస్తున్నాను
- వ్యాసాల నాణ్యత పెంచడం. ఇందుకు కొన్ని ముఖ్యమైన సూచనలు.
- అనువాద కార్యక్రమాలు పూర్తి చేయడం
- ఇప్పుడున్న వ్యాసాల శైలినీ, లింకులనూ అవుసరమైనచోట సవరించడం
- పకడ్బందిగా వర్గీకరణ డిజైన్ చేయడం.
- అభిమాన సంఘాలను సినిమా వ్యాసాలలో పాలు పంచుకోమని ప్రోత్సహించడం.
- గ్రామాలగురించి వ్యాసాలు వ్రాయమని మండలం ఆఫీసులకు ఉత్తరాలు వ్రాయడం.
- క్రొత్త సభ్యులను చేర్చడం. ఇందుకు మార్గాలు చాలా మంది సభ్యులకు తెలుసు గాని వారు ఇన్షూరెన్సు ఏజంట్లలాగా ప్రచారాన్ని నిర్వహించడానికి మొగమాట పడుతున్నట్లున్నారు.
- నేనీ మధ్య "చదువరి-ఇసుకపెట్టె 12" లోని "ఇంటర్నెట్లో తెలుగు వ్యాప్తి" అనే వ్యాసాన్ని ఫొటోకాపీలు తీసి మస్కాట్ లో తెలుగువారికి సర్క్యులేట్ చేశాను. - కానీ స్పందన ఇంతవరకూ తెలియదు.
- మూడు వర్గాలపై మనం ప్రధానంగా దృష్టి సారించడం మంచిది. వీరంతా సభ్యులసంఖ్య పెంచడంలో ముందు ముందు ప్రధాన పాత్ర పోషించే అవకాశమున్నది.
-
- గృహిణులు
- జర్నలిస్టులు
- అధ్యాపకులు
-
సభ్యుల అభిప్రాయాలనూ, సహకారాన్నీ కోరుతున్నాను.
కాసుబాబు 09:05, 22 సెప్టెంబర్ 2006 (UTC)
- మీ అందరి ప్రతిపాదనలూ చాలా బాగున్నాయి. ఈ చర్చ ఇంకో వారము పాటు ఉంచి. ఆ తరువాత అన్ని సూచనలు క్రోడికరించి ఒక జాబితా తయారు చేద్దాము.
- నావి కొన్ని ఆలోచనలు.
- ఇక పరుగు పందేలు మానేద్దాము. అయినా సినిమాలు, గ్రామాల పేజీలు కేవలము సంఖ్య పెంచడానికి రాసినవి కాదు. సంఖ్య పెంచాలంటే ఎప్పుడో క్రీ.పూ 5000 నుండి 5000 క్రీ.శ వరకు సంవత్సరాలకు బాటుతో పేజీలు తయారుచేసేవాళ్లము కదా. బెంగాళీ వికిలో ఆఫ్ఘనిస్తాన్ లోని ప్రతి ప్రాంతానికి మొలకలు తయారుచేస్తున్నారు. వాళ్ల ఆతృము చూస్తే నవ్వొచ్చింది.
- సినిమా వ్యాసాలు, గ్రామాల వ్యాసాలతో కొంత సమతుల్యము తప్పిందని నేనంగీకరిస్తాను. అందుకు మనము ఒక తెలుగు విజ్ఞాన సర్వస్వములో తప్పుకుండా ఉండాల్సిన ఒక వెయ్యి వ్యాసాల జాబితా తయారు చేసుకొందాము. ఆ వెయ్యి వ్యాసాలు వీలైనంత సమగ్రముగా విశేష వ్యాసాల స్థాయిలో రాద్దాము. అప్పుడు మన వికి వాసిలో ఆంగ్ల వికిని మించిపోతుంది (13 లక్షల వ్యాసాలున్నా ఆంగ్ల వికిలో విశేష వ్యాసాల సంఖ్య ఈ మధ్యే వెయ్యిని దాటింది). అప్పుడు తెలుగు వికి రాశిలోనే కాదు వాసిలో కూడా మిన్నే అని నిరూపించుకుంటాము. --వైఙాసత్య 15:32, 22 సెప్టెంబర్ 2006 (UTC)
-
-
- నేను మరల మరల నొక్కి చెబుతున్నాను. మన గ్రామాలు, మన సినిమాలు - ఇవి తెలుగు వికీ లో ఉండేవి, మిగిలిన వికీ లలో ఉండనవి. - అంటే మన వికీ ఆంగ్ల వికీకు అనువాదంగా మాత్రమే పరిమితం కాదని చెప్పేవి. కొద్దికాలంలో ఇవి ఉపయోగకరమైన వనరులుగా తీరుదిద్దుకుంటాయి. కనుక సభ్యులు వీటి విషయంపై "అపాలజెటిక్" గా ఫీల్ కానవసరం లేదు. మన అవసరాలను మనం రూపొందించుకుంటాం. కాసుబాబు 18:32, 22 సెప్టెంబర్ 2006 (UTC)
-
[మార్చు] Translation requests
Is there a place for requesting translations or is this fine. Can some translate the below please,
- Infobox Indian jurisdiction - భారత ??? సమాచారపెట్టె
Thanks, Ganeshk 22:56, 10 అక్టోబర్ 2006 (UTC)
- మీ అనువాద విజ్ఞప్తులు ఇక్కడ చేయ్యండి. Wikipedia:వ్యాస అనువాద విజ్ఞప్తులు --వైఙాసత్య 04:05, 11 అక్టోబర్ 2006 (UTC)
-
- Translation done. మూస:భారత స్థల సమాచారపెట్టె --వైఙాసత్య 05:17, 11 అక్టోబర్ 2006 (UTC)
-
-
- Could you please translate the labels that are displayed (Area, Altitude etc)? Thanks, Ganeshk 05:27, 11 అక్టోబర్ 2006 (UTC)
-
-
-
-
- You are too fast!! :) Thanks, Ganeshk 05:35, 11 అక్టోబర్ 2006 (UTC)
-
-
-
-
-
-
- Thanks :-) --వైఙాసత్య 05:47, 11 అక్టోబర్ 2006 (UTC)
-
-
-
[మార్చు] ప్రతిపాదన విశేష వ్యాసం
అరటి ని ఈ వారం విశేష వ్యాసంగా పెట్టాలని నా ప్రతిపాదన Chavakiran 08:01, 7 నవంబర్ 2006 (UTC)
[మార్చు] అధికారిక మెయిలింగు లిస్టు
తెవికీ కొరకు అధికారిక మెయిలింగు లిస్టు సృష్టించాం. wikite-l@wikipedia.org (WikiTe-L) సందేహ నివృత్తి మరియు సహాయం కొరకు సభ్యులు దీన్ని కూడా వాడచచ్చు. ఈ మెయిలింగు లిస్టులో చేరడానికి ఈ పేజీ లోని ఫారం వాడండి.--వీవెన్ 06:46, 22 నవంబర్ 2006 (UTC)
[మార్చు] ఆహ్వానాలు
మనం 'తెలికీ' వాడుకను మరియు 'తెలికీ' గురించి అవగాహనని పెంచటానికి ఆర్కుట్(Orkut) లో మనకు తెలిసినివారికి ఆహ్వానాలు పంపినట్టు తెలికీలో కూడా అవకాశం ఉంటె బావుంటుందని నా ఉద్దేశం.నిర్వాహుకులారా మీ అభిప్రాయం ఏమిటి?---పాపిశెట్టి 14:56, 8 డిసెంబర్ 2006 (UTC)
[మార్చు] 25వేలు! వందనాలు - అభినందనలు - త్వరలోనే లక్షాధికారులు!
తెవికీ 25వేల వ్యాసాలకు చేరుకున్న శుభ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు. అక్షరం అక్షరం కూర్చి ఈ మహాయజ్ఙంలో పాల్గొంటున్న ఎందరో దీక్షాపరులకు వందనాలు. ఒకప్పుడు పదివేల పండుగకు ఎదురుచూశాం. ఈనాడు 25వేలకు దూకాం. ఇక మన తరువాత ప్రస్థానం లక్ష వ్యాసాలు! అందుకు మార్గదర్శకాలను త్వరలో చర్చించుకొందాం.
- పైరగాలి వోలె పరువం పరుగులు పెడుతున్నది
- కోడె త్రాచువోలె వయసు కుబుసం విడుతున్నది
- నా పరువం సెలయేరుల నడకలవలె ఉన్నది
- నా రూపం విరజాజుల నవ్వులవలె ఉన్నది ------- మంగమ్మ శపధం నుండి
నిత్యయౌవనంతో తెలుగుభాష, తెలుగువికీ, తెలుగువారి విజ్ఙానము వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ
కాసుబాబు 08:13, 16 డిసెంబర్ 2006 (UTC)
[మార్చు] 2007 శుభాకాంక్షలు - గమనికలు
తెలుగువారికి 2007 క్రొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఆయురారోగ్యైశ్వర్యమస్తు. తెవికీ కేవలం సభ్యులకు, వికీకర్తలకు మాత్రమే పరిమితం కాకుండా తెలుగువారికందరికీ ఉపయోగకరమైన విజ్ఞానవేదికగా రూపుదిద్దుకోవాలని మనందరి ఆకాంక్ష. ఈ సందర్భంలో (ఇది రచ్చబండ గనుక) కాస్త అదీ, కాస్త ఇదీ ---
- ఈ మధ్య కొద్దిరోజులుగా నేను తెవికీలోని వ్యాసాలను, ఇతర భారతీయ భాషా వ్యాసాలతో పోల్చి చూస్తున్నాను. అన్నిభాషలలోనూ ఉండే వ్యాసాలు అంచనాకు ఎంచుకొని, ముఖ్యంగా తమిళం, కన్నడ, బెంగాలీ భాషల వికీలను పరిశీలించాను. వ్యాసాల నాణ్యతలో తెవికీ వేటికీ తీసిపోదు. ఇక వ్యాసాల సంఖ్యలో మనవాళ్ళు పరుగో పరుగు. అయితె అన్ని భారతీయభాషల వికీలు భాల్యదశలోనే ఉన్నాయి గనుక ఈ పోలికలకు అంత ప్రాముఖ్యం ఇవ్వనవుసరం లేదు.
- ఇక సినిమాలు, గ్రామాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఉండవేటిమరి! ఏవూరి కధ ఆవూరిది. అంతా కలిపి మనవారి కధ. ఈ అవిడియా తెచ్చినవారికి, కూర్చినవారికి (చదువరి, వైజాసత్య, వీవెన్ అనుకుంటాను) మరోసారి "ఇది చాలా హాట్ గురూ". అసలీ గ్రామాలగురించి వ్రాయాలనుకునే వారికి ఇదివరకు వేదికే లేదు. ఇప్పుడు సీను రెడీ. లైట్స్.కెమెరా.యాక్షన్.
- అలాగే "మూస:సంఖ్యానుగుణ వ్యాసములు" త్రివిక్రమ్ ప్రత్యేక ఐడియా అనుకుంటాను. ఇలాగ ఒక చోట ఈవిధమైన సమాచారం ఇంతకు ముందు నేను చూడలేదు.
- మాకినేని ప్రదీపు భారతదేశం ప్రాజెక్టుపై బాగా పని సాగిస్తున్నాడు. మరికొన్ని ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవుసరం ఉంది.
- అంతే కాదు. ఇందరే కాదు. ఇంకా సానామంది పని సేత్తన్నారు. అందరికీ దండాలు. పనిసేసే వారికి సాయంసేసే వారికి (కుటుంబ సభ్యులు, మిత్రులూ) దండాలు.
చేసింది బాగుండాది. చేయాల్సింది శాన ఉండాది. మళ్ళీ దండాలు
కాసుబాబు 20:12, 2 జనవరి 2007 (UTC)
[మార్చు] తెలుగు వికీ గురించి ఆంగ్ల వికీలో
నా చర్చా పేజీలో ఒక పోలిష్ సభ్యుడు కొంత సమాచారం అడిగారు. తెలుగు వికీ గురించి వ్యాసం కావాలని. ఆయన సందేశాన్ని క్రింద వ్రాస్తున్నాను.
-
- Could you write some stub about Telegu Wikipedia in English Wikipedia? Now there is only redirect. I would like to write about it in Polish Wikipedia. Write when your wiki was founded, when it passed some milestone (f.e. 10 000 and 20 000), put logo. Thanks, Greg.
-
- I wrote pl:Wikipedia w języku telugu, and be:Тэлугская Вікіпэдыя, but there are incompleted. Milestones and logo are needed. Can you write it in English in article: en:Telugu Wikipedia? Greg.
ఇందుకు సమాధానంగా నేను మొదలుపెట్టిన వ్యాసం en:Telugu Wikipedia చూడండి. అవుసరాన్ని బట్టి ఈ వ్యాసాన్ని సరిదిద్దమని కోరుతున్నాను.
--కాసుబాబు 09:22, 9 ఫిబ్రవరి 2007 (UTC)
[మార్చు] సినిమా సమీక్షలు ఎలా వ్రాయాలి?
ఈ చర్చను ఇక్కడికి మార్చాను. --కాసుబాబు 12:34, 31 మార్చి 2007 (UTC)
[మార్చు] గ్రామాల సమాచారం ప్రాజెక్టు
తెలుగు వికీలో అత్యధిక పేజీలు గ్రామాలకు కేటాయించబడ్డాయి. వీటిలో ఎక్కువ పేజీలు ఒకటి రెండు వాక్యాలు మాత్రమే కలిగి ఉన్నాయి. తెలుగు వికీ రాసిలోనూ, వాసిలోనూ పెరగడానికి ఈ పేజీలను విస్తరించాల్సిన అవుసరం చాలా ఉంది. ఇందుకోసం గ్రామాల సమాచార సేకరణ ఒక ప్రాజెక్టుగా నిర్వహించాలి. సమాచారం పంపమని ప్రచారం నిర్వహించాలి.
- ప్రాజెక్టు ప్రణాళికను ఈ పేజీలో వ్రాసాను. పరిశీలించండి. మీ సూచనలను ఇవ్వండి.
- ప్రచారం కోసం ఒక వ్యాసాన్ని తయారు చేస్తున్నాను. ఇక్కడ చూడండి. ఈ వ్యాసాన్ని మరింతగా మెరుగుపరచండి. లేదా మీరు మీ అభిరుచికి అనుగుణంగా మరొక వ్యాసం వ్రాయండి.
- ఈ వ్యాసాన్ని నేరుగా గాని, లేదా మీకు నచ్చినమరొక విధంగా వ్రాసి గాని, మీకు అందుబాటులో ఉన్న తెలుగు వారికి అందజేయండి. "మీ వూరి గురించి మీరే వ్రాయండి" అన్న నినాదంతో ఈ ప్రచారాన్ని సాగిద్దాము.
- మీ సూచనలు వ్రాయండి. చర్చించండి.
--కాసుబాబు 12:45, 31 మార్చి 2007 (UTC)