వికీపీడియా చర్చ:WikiProject/తెలుగు సినిమాలు
వికీపీడియా నుండి
- నాకొక డేటాబేసు దొరికింది. అందులో 3000 కు పైగా సినిమాలున్నాయి. అందులోని సమాచారాన్ని వికీకి అనుగుణముగా తీర్చిదిద్దే ప్రయత్నములో ఉన్నాను. అయితే అది ఆంగ్లములో ఉన్నందు వలన పేజీలు సృష్టించి ఆ తరువాత అనువదించాలా (మండలాలకు చేసినట్టు). అనువదించి పేజీలు సృష్టించాల అని సతమతమవుతున్నాను. ఒక్క దెబ్బకు తెలుగు వికీ 6000+ వ్యాసాలకు చేరుతుందన్న ఊహే చాలా థ్రిల్లింగుగా ఉంది కానీ ఆ తరువాత బండ చాకిరి చేసి వాటిని తర్జుమా చెయ్యాలి. తర్జుమా చెయ్యడానికి వికిజీవులు ముందుకొస్తే నేను వికీకరించిన డేటాబేసును ముక్కలు చేసి ఇస్తాను. ఒక్కొక్కరు తర్జుమా చేస్తున్న కొద్ది వాటిని బాట్ ద్వార వికీలో పెట్టొచ్చు. ఏమంటారు?? నాకైతే ఒక్కసారే అన్ని చేర్చాలని ఉంది.--వైఙాసత్య 23:38, 2 ఆగష్టు 2006 (UTC)
విషయ సూచిక |
[మార్చు] తెలుగు సినిమాలు ప్రాజెక్టు
- సభ్యులు గమనించే ఉంటారు. భారతదేశం రాష్ట్రాల అనువాదం దాదాపు పూర్తి అయ్యింది. అక్కడక్కడా సాంకేతికమైన కొద్ది పేరాలను అలాగే ఉంచేశాను (తెలుగు మాటలు తెలియక).
- తెవికీలో గ్రామాలు, సినిమాలు - ఈ రెండింటిదే సింహభాగమని మనకందరికీ తెలుసు గదా! ముందుగా తెలుగు సినిమాలగురించి సమాచారం పెంచడానికి తెలుగుసినిమా ప్రాజెక్టు పై దృష్టి పెట్టాలని నా అభిప్రాయం.
- ఇందులో నేను ప్రతిపాదించే ప్రధానాంశాలు: సినిమా సమాచారం, చరిత్ర, నటులు, తెర వెనుక, ఆర్ధికం, సంస్కృతి, రివ్యూలు (ఇక్కడ "తటస్థ దృక్కోణం" అనే విషయంలో కాస్త వెసులుబాటు ఉండడాలేమో?), బొమ్మల కొలువు, రాజకీయాలు, అభిమానసంఘాలు, సినిమాహాళ్ళు - వగైరా.
- తెలుగు సినిమాల వజ్రోత్సవ వేడుకల సందర్భంగా చాలా సమాచారం మనకు మీడియాలో లభించే అవకాశం ఉన్నది. అందుచేత ఈ అదను చూసుకొని వీలయినంత సమాచారాన్ని పొందుపరచండి.
- మీ సూచనలను, సలహాలను ఇక్కడ వ్రాయమని కోరుతున్నాను
కాసుబాబు 19:36, 9 జనవరి 2007 (UTC)
- ఆలోచన బాగుంది. నా దగ్గర కొన్ని వనరులున్నాయి. అవి మీకందిచగలను. అయితే మొదటగా 1100 సినిమా పేజీలు అనాథావస్థలో ఉన్నాయి (అనాథ పేజీలు చూడండి) అంటే వీటికి ఇతర ఏ పేజీ నుండి లింకు లేదు. నేను కొన్నంటిని సరిచేసి ఆయా సంవత్సరాల వారీ తెలుగు సినిమా పేజీలనుండి వాటికి లింకు కల్పించాను. మిగిలినవాటిమీద కూడ కృషి చేయాలి. --వైఙాసత్య 19:59, 9 జనవరి 2007 (UTC)
[మార్చు] అనాధపేజీలలో తెలుగు సినిమాలు
వైఙాసత్యగారూ,
" 1100 సినిమా పేజీలు అనాథావస్థలో ఉన్నాయి (అనాథ పేజీలు చూడండి) అంటే వీటికి ఇతర ఏ పేజీ నుండి లింకు లేదు" - అని వ్రాసారు. వీటికి లింకులు ఎలా ఏర్పాటు చేయాలో నాకు క్లుప్తంగా (చిన్న ఉదాహరణతో) చెప్పగలరా? చేతనైనంతవరకు సరిచేయడానికి ప్రయత్నిస్తాను.
కాసుబాబు 06:06, 10 జనవరి 2007 (UTC)
- నేను అవలంబిస్తున్న పద్దతంటంటే నేను సంవత్సరాలవారీగా సరిచూస్తున్నాను. ఉదాహారణకి 1954 తీసుకున్నామనుకోండి. నేను వర్గం:1954 తెలుగు సినిమాలు, తెలుగు సినిమాలు 1954 పేజీలు తెరిచి ఉంచుకొని వర్గంలో ఉన్న సినిమాలను, పేజీల ఉన్న సినిమాలను సరిపోల్చిచూస్తాను.
- ఒక వేళ వర్గములో ఉండి జాబితా పేజీలో లేకపోతే దానిపేరు జాబితా పేజీలో చేర్చుతా.
- వర్గములో ఉండి జాబితాలో ఎర్రలింకు ఉంటే..దీనికి బహుశా ఏదో నామాంతరము కారణమైతే..ఆ నామాంతరానికి దారిమార్పిడి చేస్తా
- వర్గములో ఉండి జాబితాలో ఎర్రలింకు ఉంటే..దీనికి కారణము జాబితా పేజీలోని పేరు మరీ పెద్ద తప్పైతే జాబితా పేజీలోని పేరు మారుస్తా.
- వర్గములో ఉండి జాబితాలో ఎర్రలింకు ఉంటే..దీనికి కారణము అయోమయ నివృత్తి అయితే ..ఉదాహరణకు వర్గములో లవకుశ (1954 సినిమా) అని ఉండి. జాబితా పేజీలో లవకుశ ఎర్రలింకు ఉంటే దాన్ని [[లవకుశ (1954 సినిమా)|లవకుశ]] అని మార్చుతా. --వైఙాసత్య 22:00, 10 జనవరి 2007 (UTC)
[మార్చు] సినిమా పేర్లలో గజిబిజి
వైఙాసత్యగారూ, అనాధపేజీలకు లింకులు చేస్తున్నపుడు నేను గమనించిన విషయం. తెలుగు సినిమాలు బ చూడండి.
- బాబాయి హోటల్, బాయ్‌ఫ్రెండ్, బిగ్‌బాస్ - ఇవి పని చేస్తున్న లింకులు. Note the Leading Spaces in the links. ఇవి నేను పేజీలపేరునుండి కాపీ చేసిన స్పెల్లింగులు.
- బాబాయి హోటల్, బాయ్‌ఫ్రెండ్, బిగ్‌బాస్ - ఇవి పని చేయవు. ఎందుకంటే Leading Spaces లేవు.
- బాబాయి హోటల్, బాయ్‌ఫ్రెండ్, బిగ్‌బాస్ - ఇవి కూడా పని చేయవు. Leading Spaces ఒకసారి తీసేసి మళ్ళీ పెట్టినా కూడా.
- సంబంధిత సంవత్సరం పేజీలో చూస్తే ఇవి అకారాది క్రమంలో సరిగ్గా రావట్లేదు. చివరలో వస్తాయి.
- కొన్ని సినిమాలు అనాధ పేజీలలో ఉండడానికి ఇది కారణం.
కారణంబేమి? ఉపాయంబేమి? కాసుబాబు 08:44, 13 జనవరి 2007 (UTC)
- http://people.w3.org/rishida/scripts/uniview/conversion ఉపయోగంచి మందు వెనకా ZWNJ (Zero width non joiner) ఉందేమో చూడండి. దీన్ని బ్రౌజర్లు చూపించవు. (ZWNJ decimal code point - 8204) తెలుగు అక్షరాలన్నీ 3000 లలో ఉంటాయి.
బాబాయి హోటల్-> 91 91 8204 3116 3134 3116 3134 3119 3135 32 3129 3147 3103 3122 3149 93 93 (అంటే పనిచేసే లింకులో ZWNJ ఉంది. అలా ఉండకూడదు). పనిచేయని లింకులే సరైనవి.--వైఙాసత్య 18:05, 13 జనవరి 2007 (UTC)
[మార్చు] గిన్నీస్ బుక్‌లో నమోదైన తెలుగు సినీ ప్రముఖులు
గిన్నీస్ బుక్‌లో నమోదైన తెలుగు సినీ ప్రముఖులు గురించి రాస్తే బాగుంతుంది కదా. ఏ విభాగంలో రాస్తే బాగుంటుందో కాస్త చెప్పండి. - శ్రీనివాస (చర్చ • దిద్దుబాట్లు) 10:22, 10 ఫిబ్రవరి 2007 (UTC)
- ఇక్కడ ప్రాంభించండి. వ్యాసం పెరుగుదలను బట్టి పునర్వ్యవస్థీకరిద్దాము --కాసుబాబు 11:35, 10 ఫిబ్రవరి 2007 (UTC)
[మార్చు] సినిమా సమీక్షలు ఎలా వ్రాయాలి?
తెలుగు సినిమా ప్రాజెక్టు నిదానంగా పురోగమిస్తున్నది. ఉత్సాహంగా పాల్గొంటున్నవారికి అభినందనలు. సినిమాలకు సంబంధించి రెండు కీలక విషయాలు మనం గమనించాలి. చర్చించాలి.
- బొమ్మలు: బొమ్మలు లేని సినిమాలో పస ఏముంటుంది? అయితే ఏ బొమ్మలను, ఎలా, కాపీరైటు పరిధిలో వాడవచ్చును? ఈ విషయంపై చర్చించి త్వరలో ఒక నిర్ణయానికి వద్దాము. ఈలోగా మీ అభిప్రాయాలు వ్రాయండి.
- సమీక్షలు: ప్రజాదరణే సినిమాకు ప్రాణం. ప్రేక్షకుల అభిప్రాయాలు సినిమా వ్యాసానికి జీవం.
- నటులు, కలెక్షన్లు, సంవత్సరం - ఇంతమాత్రంతో సినిమా వ్యాసాలకు నిండుదనం రాదు. అభిప్రాయాలు (సినిమా ఎలా వుంది? డైరెక్షను బాగుందా? యాక్షన్ అదిరిందా?) కూడా సినిమా సమాచారంలో ఒక అవినాభావ భాగం. తెలిసీ తెలియకా మనం క్లాసిక్ సినిమాల వ్యాసాలలో అభిప్రాయాలు చొప్పిచ్చేస్తాము (ఉదా: మాయాబజార్ స్క్రీన్‌ప్లే అద్భుతం). ఎటొచ్చీ సమకాలీన సినిమాలకాడికొస్తె తటపటాయిస్తాము. ( ఖైదీ చిత్రంతో చిరంజీవి హీరోగా స్థిరపడ్డాడు. అని వ్రాయకూడదా?). సమకాలీన ప్రేక్షకులే ఇక్కడ చరిత్రకారులుగా ఉండడానికి అన్ని అర్హతలూ కలిగి ఉన్నారని నా అభిప్రాయం. ఈ సినిమాలగురించి అంతా మరిచిపోయాక వాటినిగురించి వ్రాయాలనుకోవడం ఎంత సబబు?
- కాని సినిమాలపై ఇప్పుడున్న "వూపు" వల్ల సమీక్షలు ఎలా బరితెగిస్తాయో మనం ఊహించవచ్చును. అలాగని "ఇవి వ్రాయొద్దు" అంటే స్వేచ్ఛా విజ్ఞానసర్వస్వానికి సంకెళ్ళు వేసినట్లవుతుంది.
- పోనీ సమీక్షలను చర్చా పేజీలలో వ్రాయమందామా? వాటిని ఎవరూ చూడక పోవచ్చును. అవి వ్యాసంలో భాగం కాదు.
- ఈ విషయంలో వికీపీడియా:ఐదు మూలస్థంభాలు, en:Wikipedia:Neutral point of view అనే వ్యాసాలను పరిశీలించి నేను ఇలాగయితే బాగుంటుందనుకొంటున్నాను.
నా ప్రతిపాదన:
-
- సినిమా వ్యాసాలలో సమీక్షలు " ==ప్రేక్షకుల అభిప్రాయాలు== " అనే హెడింగులో ఉంచవచ్చును.
- మిగిలిన అన్ని వ్యాసాలలో ఉండే మర్యాదలు, నిబంధనలు ఈ వ్యాసాలకు కూడా వర్తిస్తాయి. అవాకులూ చవాకులూ ఎక్కడా వ్రాయతగదు. సినిమా వ్యాసాలకే ఈ నిబంధన పరిమితం కాదు.
- సమీక్ష వ్యక్తిగతమైనా గాని సంతకం చేయకూడదు. అయితే (సమీక్షకుడు: ఫలానా) అని వ్రాయవచ్చును. (ఇది source reference లాంటిదన్నమాట!)
ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయాలను చర్చించండి. తరువాత ఒక "పాలిసీ" తయారు చేద్దాము.
(తరువాత ఈ చర్చను సినిమా ప్రాజెక్టు పేజీకి కాపీ చేయాలి)
--కాసుబాబు 09:10, 16 ఫిబ్రవరి 2007 (UTC)
- కాసుబాబు, ఈ విషయంపై చర్చని లేవనెత్తినందుకు కృతజ్ఞతలు.
- బొమ్మలగురించి చర్చ అవసరం. ఇది చూడండి
- ప్రేక్షకుల అభిప్రాయాలని వికీపీడియాలో చేర్చడానికి నేను సుముఖంగా లేను. అయితే సినీ సమీక్షకుల/విమర్శకుల వ్యాసాలనుండి మనం ఉటంకించవచ్చు.
- —వీవెన్ 19:01, 16 ఫిబ్రవరి 2007 (UTC)
- ప్రేక్షకుల అభిప్రాయాలని వికీపీడియాలో చేర్చితే..అవి అభిమానుల మధ్య యుద్దవేదికలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి..ఆ సినిమా కథ ఏంటో..దాని విశేషాలేమిటో తెలియ పరిస్తే చాలనుకొంటున్నాను. ఫోటోలు/పోస్టర్లు పెట్టడం అత్యంత అవసరం. కాసుబాబు గారు, మంచి విషయాలను గుర్తు చేశారు --నవీన్ 04:15, 17 ఫిబ్రవరి 2007 (UTC)