వడ్డాది పాపయ్య
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
వడ్డాది పాపయ్య (సెప్టెంబరు 10, 1921 - డిసెంబరు 30, 1992) ప్రముఖ చిత్రకారుడు. రామ మూర్తి, మహలక్ష్మి దంపతులకు జన్మించారు. 5 సంవత్సరాల పిన్న వయసులోనే తన ఇంటిలో ఉన్న రవివర్మ చిత్రం "కోదండ రామ" ను ప్రేరణగా తీసుకుని హనుమంతుని చిత్రాన్ని గీసాడు. తండ్రి కూడా చిత్రకారుడు కావడంతో ఆయనే పాపయ్యకు తొలి గురువు అయ్యారు. 1947 లో నూకరాజమ్మను, 1984 లో లక్ష్మి మంగమ్మను వివాహమాడారు.